Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
Control BP: బీపీ ఇబ్బంది పెడుతోందా? 2 వెల్లుల్లి రెబ్బలతో ఈజీగా కంట్రోల్ చేయండి
ఈకాలంలో చిన్న వయస్సు నుంచే ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. వయస్సు మీద పడేకొద్దీ ఒకదాని తర్వాత మరొకటి అంటూ వ్యాధులు వస్తూనే ఉన్నాయి. ఇందులో రక్తపోటు ఒకటి. బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఇది రక్తాన్ని సరఫరా చేసే ధమనులపై ఒత్తిడిని పెంచుతుంది. ఇలా ఒత్తిడి పెరగడం వల్ల ధమనుల్లో రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది.

రక్తపోటు సమస్యకు ప్రధాన కారణాలు.. తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, శరీరంలో సోడియం అధికంగా ఉండటం. దీని వల్ల తలనొప్పి, తల తిరగడం, ఆయాసం, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు మొదలవుతాయి.
చాలా మంది రక్త పోటు సమస్యను తేలికగా తీసుకుంటారు. కానీ అధిక రక్తపోటు అనేది తీవ్రమైన సమస్య. ఇది స్ట్రోక్ నుంచి కిడ్నీ వైఫల్యం, గుండె వైఫల్యం వరకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి రక్తపోటును నియంత్రించడం చాలా చాలా కీలకం.
మీరు కూడా అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నట్లయితే, బీపీని నియంత్రించడానికి వంటగదిలో ఉండే వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకోండి. బీపీని కంట్రోల్ చేయడంలో వెల్లుల్లి చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. అధిక బీపీతో బాధపడుతున్న వ్యక్తుల ధమనులు కాలక్రమేణా గట్టిపడతాయి. వారికి ఇన్ఫెక్షన్, మంట వంటి సమస్యలు బాధిస్తాయి. ఈ సందర్భంలో వెల్లుల్లి మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
హైబీపీ కోసం వెల్లుల్లి ప్రయోజనాలు:
* వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ రక్తనాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది.
* అల్లిసిన్ వెల్లుల్లిలో కనిపిస్తుంది. ఇది రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
* ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ బి-12 పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి:
అధిక రక్తపోటును తగ్గించే ఉత్తమ మార్గాల్లో వెల్లుల్లి ఒకటి. పచ్చి వెల్లుల్లి అల్లినేస్ ను సక్రియం చేస్తుంది. ఇది అల్లిన్ ను అల్లిసిన్ గా మార్చే ఎంజైమ్. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో 2 వెల్లుల్లి రెబ్బలు నీటితో కలిపి తీసుకోవాలి.
వెల్లుల్లి ఇతర ప్రయోజనాలు:
* బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
* ఐరన్, జింక్ శోషణను పెంచడంలో సహాయపడుతుంది
* LDL అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది
* ఇది కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
* యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ జలుబు మరియు ఫ్లూను తగ్గించడంలో సహాయపడుతుంది.
* రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆర్థరైటిక్.
* వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
100 గ్రాముల వెల్లుల్లిలో పోషకాలు:
* ప్రోటీన్ - 6.30 గ్రాములు
* ఫైబర్ - 1.5 గ్రాములు
* కార్బోహైడ్రేట్ - 33 గ్రాములు
* జింక్ - 1.16 మి.గ్రా
* కాపర్ - 0.2 మి.గ్రా
* సోడియం - 17 మి.గ్రా
* సెలీనియం - 14 మైక్రోగ్రాములు
* విటమిన్-సి - 31 మి.గ్రా
* విటమిన్-బి-6- 1.2 మి.గ్రా
* కాల్షియం - 181 మి.గ్రా
* ఐరన్ - 1.7 మి.గ్రా
* మెగ్నీషియం - 25 మి.గ్రా
* పాస్ఫరస్ - 153 మి.గ్రా
* పొటాషియం - 400 మి.గ్రా
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











