Latest Updates
-
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి
టైప్ 2 డయాబెటీస్ నియంత్రణకు మార్గాలు!

1. ఎపుడూ ఊహించుకోకండి - ఏం తినాలి? ఏం తినకూడదు లాంటివి ఊహించకండి. వైద్యుడిని సంప్రదించండి. తినకుండా వుండవలసినవి కొవ్వులు, షుగర్, నూనెలవంటివే కాదు. ఆహార సమతుల్యతకు ఇంకా అనేక పదార్ధాలుంటాయి. వైద్య నిపుణుల సలహా తీసుకొని ఆహారాన్ని మెయిన్టెయిన్ చేయడం అవసరం.
2. మీరు ఏం తింటున్నారనేది తెలుసుకోవాలి - కొవ్వు తక్కువగల పదార్ధాలే షుగర్ ను నియంత్రించలేవు. పీచు అధికంగా వుండే పండ్లు, కూరలు మొదలైనవి కూడా బ్లడ్ షుగర్ స్ధాయిని కొన్ని సమయాల్లో పెంచే ప్రమాదముంది.
3. ఆహార ప్రణాళిక వేయండి. ప్రతిరోజూ ఏమి తినాలి? ఏ సమయానికి తినాలనేది నిర్ణయించుకోండి. పిండిపదార్ధాలు తక్కువగా వుండి, ప్రొటీన్ అధికంగా వుండే రాగి లేదా సోయా వంటివి ఆరోగ్యాన్నే కాదు, శక్తిని కూడా ఇస్తాయి.
4. వేపుడు పదార్ధాలను అతిగా తినరాదు. మీ విందులు వినోదాలలో తినే పదార్ధాలు డయాబెటీస్ కు సమస్య అని గుర్తించండి. కాకర రసం, బీట్ రూట్ రసం మొదలైనవి డయాబెటీస్ నియంత్రించటమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
5. శరీరానికి ఎపుడూ పని కల్పించండి - చాలామందికి 40 ఏళ్ళ పైబడితే షుగర్ ఎందుకు వస్తుందంటే వారు రిటైరైపోతున్నామన్న ధ్యాసలో శరీరానికి విశ్రాంతి కల్పిస్తారు. ఈ కారణంగా శరీరం లావెక్కటం కొవ్వు నిల్వలు ఏర్పడటం అధిక బరువు ఏర్పడటం జరుగుతుంది. అధికబరువు డయాబెటీస్ కు ప్రధాన కారణం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
