Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
క్షణ క్షణం.... భయపెట్టే షుగర్ వ్యాధి!

డయాబెటీస్ రోగులు ఉపవాసం ఉంటే...
సాధారణంగా మతపర ఆచారాలకై ఒక్కక్కపుడు ఏ ఆహారం తీసుకోకుండా ఉపవాసం వుంటారు. డయాబెటీస్ రోగులకు ఉపవాసం క్లిష్టమైనదే. జాగ్రత్త అవసరం. ఉపవాసం ఉండే రోజు ప్రతి దినం వేసుకొనే డయాబటిక్ మందులు మానండి. ఇన్సులిన్ తీసుకునే వారైతే ఉపవాస సమయాన్ని బట్టి డోసేజీ తగ్గించండి. ఎప్పటికపుడు నీరసం రాకుండా లేదా కళ్ళు బైర్లు కమ్మకుండా తగిన జాగ్రత్తలతో ఉపవాసం కొనసాగించండి.
డయాబెటీక్ రోగులు, హాస్పిటల్ ప్రవేశం...
ఏ కారణం చేత ఆస్పత్రిలో చేరినప్పటికి డయాబెటీస్ రోగులు అప్రమత్తంగా వుండాలి. అడ్మిషన్ సమయంలోనే అక్కడి డాక్టర్లకు, నర్సులకు డయాబెటిక్ రోగినని తెలుపాలి. మీరు వాడే మందులు, దాని స్ధాయి వారికి తెలుపాలి. హాస్పిటల్ లో వున్నంత కాలం మీకు గల ఇతర వ్యాధులు తగ్గటానికి కూడా డయాబెటీస్ ను అదుపులో వుంచాలి. ఆహారం తినటానికి అనుమతించకపోతే కనీసం గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ వంటివైనా సరే ఇచ్చి షుగర్ స్ధాయిని అదుపులో వుంచాలి. ఇక డిశ్చార్జి సమయానికి మీ సాధారణ ఆహారానికి దైనందిన మందులకు అలవాటు పడాలి.
డయాబెటిక్ రోగులు రుతుక్రమంలో ఏం చేయాలి ?
కొంతమంది మహిళలకు రుతుక్రమ సమయానికి ముందర షుగర్ స్ధాయి అధికమవుతుంది. దీనికి పరిష్కారంగా ఆ రోజులలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచండి. కొంతమందికి షుగర్ స్ధాయి తగ్గుతుంది. అటువంటపుడు డోసేజీ తగ్గించండి. ఈ ఇన్సులిన్ డోసేజి లేదా మందులు పెంచటానికి, తగ్గించటానికి లేదా ఎంత మొత్తంలో తీసుకోవాలనటానకి నిర్దేశిక కొలతలు ఏమీ లేవు. ప్రతి రోగి తన శరీర స్ధితిని బట్టి మందుల వాడకాన్ని కొనసాగించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
