Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
మధుమేహం - నియంత్రణా మెళకువలు!

మధుమేహం ప్రధాన లక్షణాలు -
-అలసట, బలహీనత, కాళ్ళల్లో నొప్పులు. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్ ఉత్పత్తిలో ఏ మాత్రం మార్పులుండవు.
-కాళ్ళకు దెబ్బలు తగిలినప్పుడు వెంటనే మానకపోవడం.
-ఎక్కువగా మూత్రం పోయడం, ఆకలి వేయడంలాంటి లక్షణాలు.
-శరీర బరువు ఉన్నట్టుండి తగ్గిపోవడం.
-తరచూ కంటి అద్దాల నెంబర్లను మార్చడం. అంటే దృష్టి లోపం తలెత్తడం.
-జననాంగాలలో దురదలు
-గుండెపోటు, మెదడు దెబ్బ తినడం.
ప్రతి రోజు ఇన్స్యులిన్ ఇంజెక్షన్ అవసరం లేదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇకపై తమ శరీరంలో గ్లూకోజ్ క్రమబద్దీకరించుకునేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్ మాటిమాటికి వేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ఇన్సులిన్ పంప్ వలన ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు.చాలామందికి బాల్యావస్థలోనుంచే ఈ మధుమేహ వ్యాధి వస్తుంటుందని, ఇది వారి వారి తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుందని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్. మనోజ్ శర్మ అన్నారు. ఇలాంటి వారికి ప్రతి రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలంటే నరకప్రాయంగా ఉంటుంది. వీరికి ఇన్జెక్షన్లనుంచి విముక్తి కలిగించేందుకు ఇన్సులి పంప్ ఎంతో అవసరం ఉందంటున్నారు వైద్యులు.
ఇన్సులిన్ పంప్‌ను ఏ వయసు వారైనా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.ఇన్సులిన్ పంప్ అనేది ఓ పేజర్‌లా ఉంటుంది. ఇందులో ఇన్సులిన్ వైల్ ఫిక్స్ చేసేస్తారు. దీనిని ఓ పలుచటి నీడిల్, ఇన్ఫ్యూజన్ సెట్ ద్వారా శరీరంలో ఉంచుకోవాలి. ఈ పంప్ శరీరానికి కావలసిన ఇన్సులిన్‌ను రక్తంలో కలుపుకుంటుంది. దీంతో ప్రత్యేకంగా ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను వాడాల్సిన అవసరం ఉండదంటున్నారు వైద్యులు. ఇది శరీరంలో తయారయ్యే ఇన్సులిన్‌లాగే ఇన్సులిన్‌ను శరీరానికి సరఫరా చేస్తుందని ఆయన అన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
