Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కుటుంబంలో ఎవరికి లేకపోయినా ?

చాలా వరకు డయాబెటీస్ వ్యాధి తీవ్రత, జీవన విధానం ఆచరించడంపై వుంటుంది. డయాబెటీస్ ప్రారంభ దశలో వున్న వారు ముందుగానే గుర్తించి, తగిన రీతిలో వ్యాయామం ప్రతిరోజూ చేయడం, ఆహారంలో మార్పులు వంటివి చేస్తే డయాబెటీస్ వ్యాధిని రివర్స్ చేయవచ్చు. ఆల్కహాల్ తాగడం, పొగ తాగటం వంటి చెడు అలవాట్లకు కూడా దూరంగా వుండాలి. జంక్ ఫుడ్ అధికంగా తినరాదు. శరీరంలోని గ్రంధులు అవసరమైన హార్మోన్లు ఉత్పత్తి చేసే దిశగా ఆహారాలు తింటూ వుండాలి.
మీకు మీ తల్లితండ్రులనుండి సంక్రమించిన జీన్స్ మాత్రమేకాక, పర్యావరణ ప్రభావం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. అనారోగ్య ఆహారం, శారీరక శ్రమ లేకపోవటం వంటివి టైప్ 2 డయాబెటీస్ వచ్చేందుకు అవకాశమిస్తాయి. కనుక కుటుంబ సభ్యులు ఆరోగ్యకర ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే డయాబెటీస్ వ్యాధి తల్లితండ్రులలో వున్నప్పటికి మీకు వచ్చే అవకాశం లేదు. వాటి మూలాలు మీలో వుండవచ్చు. కాని అవి బయటపడేందుకు అనుకూలమైన పరిస్ధితులు అంటే అనారోగ్య జీవన విధానాలు మీరు ఆచరిస్తే అవి తప్పక బయటపడతాయి.
టైప్ 1 డయాబెటీస్ అనేది పుటుకతోనే పిల్లలలో కలుగుతుంది. దీనికి పర్యావరణ పరిస్ధితులు ప్రధాన కారణం కావు. టైప్ 1 డయాబెటీస్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ బయటనుండి ఇవ్వటమే పరిష్కారంగా చెప్పాలి. అయితే, కొన్ని వైరస్ లకుగురైనవారికి పర్యావరణ పరంగా డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా వుంది. కనుక కుటుంబ సభ్యులెవరైనా ఇట్టి వాతావరణానికి గురికాకుండా వుంటే వారికి డయాబెటీస్ వచ్చే అవకాశం లేదు. మీరు వాటికి గురైనట్లయితే, మీకు మాత్రమే డయాబెటీస్ వచ్చే అవకాశాలుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications