For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటీక్ రోగుల గుండె జబ్బులు!

By Staff
|

Diseases in Diabetic Patients!
డయాబెటీక్ రోగులలో రెండు రకాల గుండెజబ్బులు వస్తాయి. వాటిలో ఒకటి కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే ఈ వ్యాధిలో గుండెకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో రక్తం గట్టిపడిపోతుంది. దీనితో రక్తనాళాలు సన్నపడి గుండెపోటు వస్తుంది. రెండవది, గుండె విఫలత. ఇది మొదటి దానికంటే తీవ్రమైనది. గుండె రక్తాన్ని సరిగా బయటకు పంప్ చేయలేదు. అలాగని గుండె పని చేయటంలేదనరాదు. కాలక్రమేణా లక్షణాలు మరింత ముదిరిపోతాయి.

షుగర్ వ్యాధి లేని వారికంటే షుగర్ వ్యాధి వున్న వారికి గుండె జబ్బుల రిస్క్ అధికం. అధికంగా ఏర్పడే గ్లూకోజ్ రక్తనాళాలను, గుండె కండరాన్ని డ్యామేజ్ చేస్తుంది. గుండె కొట్టుకోవడంలో అసమతుల్యతలు ఏర్పడతాయి. నొప్పి సంకేతాలు నరాల ద్వారా మాత్రమే తెలుస్తాయి. కనుక ఇటువంటి వారికి నొప్పిలేని గుండె పోటు వచ్చే అవకాశాలుంటాయి.

దీని లక్షణాలు ఎలా వుంటాయంటే... ఛాతీలో అసౌకర్యం అనిపించడం, చేతులు, వీపు, నోటి దవడ లేదా పొట్ట భాగాలనుండి నొప్పి రావడం వుంటుంది. శ్వాస సరిగా ఆడదు, చెమట పట్టటం, వికారం అనిపించడం వుంటుంది. మహిళలకు ఈ లక్షణాలు తక్కువగా చూపుతాయి. డయాబెటిక్ రోగులలో గుండె జబ్బు అరికట్టటానికి సంవత్సరానికి ఒక సారి తప్పక గుండెను పరీక్షింపజేయాలి. కొల్లెస్టరాల్, రక్తపోటు వంటివి చెక్ చేయాలి. అవసరపడితే ఇతర పరీక్షలు కూడా చేయించాలి. డయాబెటీస్, గుండె జబ్బులు రెండూ కూడా షుగర్, రక్తపోటులను అరికడుతూ, రెగ్యులర్ వ్యాయామాలు చేయడం ద్వారా నియంత్రించవచ్చు.

English summary

Diseases in Diabetic Patients! | డయాబెటీక్ రోగుల గుండె జబ్బులు!

Many people who are diabetic don’t show any symptom of heart disease. This is often termed as a silent heart disease.
Desktop Bottom Promotion