Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ కు తేలికైన మందు నడక!

ఇండియాలో ఇప్పటికి 71 మిలియన్న జనాభా ఈ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిక్స్ ఫెడరేషన్ వెల్లడించింది. ఇది చాలా ఎక్కువని వీరు భావిస్తున్నారు. గత కొద్ది దశాబ్దాలనుండి భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లు తీవ్రస్ధాయి మార్పులకు గురయ్యాయని, సాంప్రదాయక వంటకాలనుండి కార్బో హైడ్రేట్లు అధికంగా వుండే పాశ్చాత్య వంటకాలకు మొగ్గు చూపటమే దీనికి కారణమని వీరు భావించారు. దీనితో పాటుగా జీవనంలోని దైనందిన ఒత్తిడి కూడా ప్రధాన కారణమన్నారు. ప్రతిరోజూ 30 నిమిషాల నడక, లేదా ఇతర వ్యాయామాలు గ్లూకోజ్ స్ధాయిని నియంత్రిస్తాయని తెలిపారు.
నడిస్తే, మన కండరాలు రక్తంలోని షుగర్ ను నియంత్రిస్తాయి. రక్తంలో బాగా కలిసేట్లు చేస్తాయి. ఫలితంగా గ్లూకోజు స్ధాయి తగినట్లుగా వుండి దాని ప్రభావం కొన్ని గంటలపాటు వుంటుంది. అయితే, అది ఎప్పటికి వుండేదికాదు. మరల భోజనం తర్వాత బ్లడ్ గ్లూకోజ్ స్ధాయి పెరుగుతుంది. విటమిన్ బి స్ధాయి తక్కువగా వున్నవారు ప్రత్యేకించి బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాలని అందుకు తగిన విటమిన్లు వాడాలని కూడా నిపుణులు చెపుతున్నారు. సంతులిత ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు నడక వంటి వ్యాయామాలు చేయడం మాత్రమే షుగర్ వ్యాధి నియంత్రణకు తోడ్పడగలవని నిపుణుల అభిప్రాయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications