Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
సహజ ఆహారాలతో డయాబెటీస్ నియంత్రణ?

తాజాగా మార్కెట్ లో దొరికే డయాబెటీస్ నియంత్రణ పరికరాలు కొని ఇంటిలోనే ఎప్పటికపుడు షుగర్ స్ధాయిలను తెలుసుకొని నియంత్రించవచ్చు. వ్యాధి ముదిరిన తర్వాత కంటే వచ్చిన వెంటనే జీవన విధానాలు సరిచేసుకుంటే డయాబెటీస్ నియంత్రించటం, నివారణ కష్టమేమీకాదు. ప్రతిరోజూ తినే ఆహారంతోనే కొన్ని వ్యాధులను నివారించుకోవచ్చు. వాటిలో డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి ఒకటి. మీరు తినే ఆహార పదార్ధాలలో మార్పులు చేస్తే వ్యాధినివారణ సులభంగా వుంటుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను మనం తీసుకునే ఆహారం నేరుగా నియంత్రిస్తూంటుంది. డయాబెటీస్ కలవారు వారి జీవన విధానం, వ్యక్తిగత అవసరాలను బట్టి వారి ఆహార ప్రణాళిక నిర్ధారించుకోవాలి.
రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ప్రభావించే ఆహారాలు ఏమిటనేది ముందుగా తెలుసుకోండి. ఈ ఆహారాలు మాత్రమే తీసుకుంటుంటే, అపుడపుడూ మీకు తినాలనిపించిన తిండ్లు కూడా తిని ఆనందించవచ్చు. డయాబెటీస్ రాగానే ఇష్టమైన ఆహారాలు వదలాలని భావిస్తారు. కాని డయాబెటీస్ వారు ఏం తినాలనేది తెలిస్తే మీకు ఆహారంలో కూడా ఎన్నో ఎంపికలుంటాయి. కనుక సరైన, డయాబెటిక్ కు కావలసిన ఆహారాలు ఎంపిక చేసుకోండి. వీటిని తింటూంటే మీ డయాబెటీస్ నియంత్రణలో వుంటుంది. కార్బో హైడ్రేట్లు రక్తంలోని గ్లూకోజును అధికం చేస్తాయి.
మన శరీరం అనేక ఆహారాలను గ్లూకోజ్ గా రెండు గంటల్లో మారుస్తుంది. అందుకనే డయాబెటీస్ రోగులు ఆహారాలకు అంత ప్రాధాన్యతనివ్వాలి. గోధుమ అన్నం, చపాతీలు, మొలకెత్తిన విత్తనాలు, తాజా పండ్లు, పచ్చని ఆకు కూరలు, ఉడికించిన కూరలు, బ్రౌన్ బ్రెడ్ మొదలైన వాటికి, ప్రొటీన్లు అధికంగా వుండే ఆహార పదార్ధాలకు ప్రాధాన్యతనివ్వాలి. నూనెలు, ఇతర కొవ్వు కల ఉత్పత్తులను మానండి. ఈ ఆహారాలు తింటూ డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో వుంచుకొని, సందర్భం ఏదైనా వచ్చినపుడు మీరు తినాలనుకున్న ఇతర పదార్ధాలను కూడా తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
