For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సులిన్ ఎలా నిలువ వుంచాలి?

By B N Sharma
|

How to Store Insulin?
సహజంగా ఇన్స్ లిన్ ను ఫ్రిజ్ లో ఉంచమనే తయారీదారులు తెలియచేస్తారు. కానీ, కోల్డ్ గా వున్న ఇన్సులిన్ ను ఇంజెక్టు చేసుకుంటే నొప్పిగా బాధగా ఉంటుంది. ఈ బాధ లేకుండా ఉండాలంటే, రూమ్ టెంపరేచర్ లో ఇన్స్ లిన్ ను ఉంచటమే. వేసవి కాలంలో మాత్రం విధిగా ఇన్స్ లిన్ ను ఫ్రిజ్ లో ఉంచటమే బెటర్. ఇంజక్షన్ చేయటానికి ఓ అరగంట ముందుగా ఫ్రిజ్ లోంచి తీసి రూమ్ టెంపరేచర్ లో ఉంచి ఇంజెక్టు చేసుకోవటం బెటర్.

మరీ చల్లదనం, మరీ వెచ్చదనం, ఈ రెండూ చోట్లా ఇన్సులిన్ ను నిలవ చేయరాదు. డీప్ ఫ్రీజర్ లో డైరెక్టుగా ఎండ తగిలే చోట, కార్ డాష్ బోర్డులో ఇన్స్ లిన్ ఉంచకూడదు. ఎక్స్ పైరీ డేట్ ను ఇన్స్ లిన్ వాడేముందు తప్పకుండా గమనించి తీరాలి. ఇన్స్ లిన్ వాడే ముందు బాటిల్ లో ద్రవాన్ని జాగ్రత్తగా గమనించండి. రంగుమారి ఉండకూడదు. మంచుతెర లాంటిది కన్పించకూడదు. అలానే క్రిస్టల్స్ కూడా ఉండకూడదు. చిన్న పార్టికల్స్ కూడా కన్పించకూడదు. ఇలాంటి ఏ డిఫెక్టు కనిపించినా ఆ ఇన్స్ లిన్ వాడకూడదు.

ఒకసారి ఉపయోగించిన సిరంజిని మరల ఉపయోగించటం చేసేవారు, నీడిల్ కేప్ ను వాడిన వెంటనే పెట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచాలి. వేరొకరు మీ సిరంజి నీడిల్ ను ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకోండి. సిరంజి నీడిల్ డల్ అయినా, బెండ్ అయినా, స్కిన్ కు కాకుండా ఏ ఉపరితలానికి నీడిల్ తగిలినా ఆ నీడిల్ ను ఉపయోగించకుండా అవతలపారవేయాలి. సహజంగా టైస్ 1 డయాబెటిక్స్ రోజూ రెండు ఇంజెక్షన్లు చేసుకునేలా ప్లాన్ చేయటం జరుగుతుంది. రోజుకు మూడు లేదా నాలుగు ఇన్స్ లిన్ ఇంజెక్షన్స్ చేసుకునేలా ట్రీట్ మెంట్ సెట్ చేయగల్గితే, బ్లడ్ గ్లూకోజ్ ను పకడ్బందీగా కంట్రోల్ చేయవచ్చు.

మీరు మీ శరీరంపై ఎక్కడ ఇంజెక్టు చేసుకుంటున్నారన్నది కూడా మీ బ్లడ్ గ్లూకోజ్ పై ప్రభావం చూపుతుంది. శరీరంలోని వేరు వేరు ప్రదేశాలలో చేసుకునే ఇన్స్ లిన్ ఇంజక్షన్ వేరు వేరు వేగాలలో రక్తంలోకి చేరుతుంది. పొట్ట పైభాగంలో ఇన్స్ లిన్ ఇంజెక్షన్ చేసుకుంటే, త్వరగా ఇన్స్ లిన్ పనిచేస్తుంది. భుజాలపైన, తొడలపైన, పిర్రలపైన ఇంజెక్టు చేయబడిన ఇన్సులిన్ లేట్ గా తనపని తాను ప్రారంభిస్తుంది. ఇన్సు లిన్ ను ప్రతిసారీ ఒకే స్పాట్ నుంచి ఇంజెక్టు చేసుకోకూడదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినపుడు చేసుకునే ఇంజెక్షన్ ఒక చోట అంటే తొడకు చేసుకుంటే, భోజనం తర్వాత పొట్టకు చేసుకున్నాం అనుకోవాలి. ఆ తర్వాత మీరెప్పుడు చేసుకున్నా బ్రేక్ ఫాస్ట్ సమయంలో తొడకు, భోజనం సమయంలో పొట్టకు చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ ఇదే పద్ధతిని అచిరిస్తే బ్లడ్ గ్లూకోజు ఫలితాలు స్ధిరంగా ఉంటాయి. ఒకే చోట తరచుగా ఇన్స్ లిన్ చేసుకోవటం వలన ఆ ప్రదేశంలో గడ్డుకట్టడం వంటివేమైనా జరిగితే తప్పకుండా మీ డాక్టర్ గారి హెల్ప్ తీసుకోండి. మీరు ఆహారం తీసుకోవటానికి 30 నిమిషాల ముందు ఇన్స్ లిన్ తీసుకోవాలి.

English summary

How to Store Insulin? | ఇన్సులిన్ ఎలా నిలువ వుంచాలి?

The place where you inject your insulin on the body also shows impact on your glucose level in the body. Injections made at different places on the body react in different speeds while mixing in the blood. If the Insulin is injected in the stomach area it works fast and If it is done on the shoulders or thighs it mixes in the blood slow and works late.
Story first published:Friday, June 22, 2012, 12:17 [IST]
Desktop Bottom Promotion