Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
అధిక బరువుతో వచ్చే షుగర్ వ్యాధి...!

తాజా పరిశోధనలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ లో ప్రచురించారు. లెప్టిన్ అనేది ఒక హార్మోన్ అని అది శరీరం తీసుకున్న ఆహారాన్ని , చేసిన ఎనర్జీ వ్యయాన్ని సమతుల్యత చేస్తుందని, ఈ హార్మోను సహకరించకపోతే శరీరం లావెక్కిపోవటం, షుగర్ వ్యాధి ఏర్పడటం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లారిడా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు వెల్లడి చేశారు.
ఫ్రక్టోస్ అనేది తాజా పండ్లలో వున్నప్పటికి వాటిని తింటే సమస్య లేదని, అయితే స్వీటు తినుబండారాలలో కలిపే సాధారణ స్వీటనర్లు అయిన టేబుల్ షుగర్, ఫ్రక్టోస్ అధికంగా వుండే కార్న సిరప్ మొదలైనవాటి వలననే వ్యక్తులు అధిక బరువు సంతరించుకోడం, షుగర్ వ్యాధి పాలవటం జరుగుతోందని వారు తెలిపారు.
షుగర్ వ్యాధితో బాధపడే వారికి కాకర కాయ రసం ఇస్తే ఆ జబ్బు అదుపులోవుంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక గుణం ఉండటం మూలాన మధుమేహ రోగులకు ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి రోజు ఉదయంవేళ పరకడుపున సేవిస్తుంటే డయాబెటిక్ వ్యాధి అదుపులోవుంటుంది.
కాకర కాయ రసాన్ని తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు: 3 లేదా 4 తాజా కాకర కాయలు, అరచెక్క నిమ్మకాయ, చిటికెడు ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు, రెండు టమాటాలు, చిన్న కీరకాయ ఒకటి.
ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే...కాకర కాయ, టమోటా, కీరకాయ మూడింటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయండి. ఇందులో ఒక గ్లాసు నీరు కలపండి. తెల్లటి గుడ్డలో ఈ మిశ్రమాన్ని వడగట్టండి. తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండి ప్రతి రోజు ఉదయం వేళ పరకడుపున తాగండి. ఇలా ప్రతి రోజు తాగితే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్త ప్రసరణలో కూడా ఈ రసం బాగా తోడ్పడుతుందని పరిశోధకులు చెపుతున్నారు.. దీంతోపాటు మధుమేహవ్యాధి కూడా అదుపులోవుంటుందంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications