Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాని కలిగించే ఊబకాయం మరియు చెడు కొల్లెస్టరాల్!

చిన్న వయసులలోనే ఏర్పడే ఈ అనారోగ్య పరిస్ధితి దీర్ఘకాల ప్రజారోగ్య సమస్యలు దేశానికి తెచ్చిపెడుతుందని మెడిసిన్ అండ్ సైన్స్ అద్యక్షులు డా. వివియన్ ఫోన్సెకా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ నిర్వహించిన ఒక సదస్సులో పేర్కొన్నారు. రాబోయే పది నుండి ఇరవై సంవత్సరాల కాలంలో దేశంలో అధిక జనాభా డయాబెటీస్ మరియు గుండె జబ్బుల వంటి వాటితో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని ఆయన తెలిపారు.
కొత్త గణాంకాల మేరకు, 12 సంవత్సరాలనుండి 19 సంవత్సరాల వయసు కల పిల్లలు 3,400 మంది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో కనుగొనబడ్డారు.
అధిక బరువు, ఊబకాయం కలవారి శాతం 1999 నుండి 2008 వరకు ప్రస్తుత అంచనాలైన 34 శాతంగా ఒకే రకంగా వుంది. అధిక రక్తపోటు కలవారి శాతం 14 గానుఎల్ డిఎల్ లేదా చెడు కొల్లెస్టరాల్ కలవారు 22 శాతంగాను, మంచి కొల్లెస్టరాల్ కలవారి శాతం 6 శాతంగాను వుంది.
డయాబెటీస్ ముందు దశలో వున్నవారు, డయాబెటీస్ కలిగిన వారి శాతం 1999 - 2000 సంవత్సరంలో 9 శాతం వుండగా, 2007 - 2008 సంవత్సరంలో అది 23 శాతానికి పెరిగింది. అయితే, ఊబకాయం కల పిల్లల శాతం పెరగకపోవటం కొంతలో కొంత మేలుగా వుందని డయాబెటీస్ సెంటర్ ఛీఫ్ మరియు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డా. లోరి లాఫెల్ తెలిపారు. షుమారు పది సంవత్సరాలకాలంలో డయాబెటిస్ ముందుదశ మరియు డయాబెటీస్ వ్యాధి కలవారి సంఖ్య రెట్టింపైందని ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన సమస్య అని ఆమె తెలిపారు.
ఊబకాయం సంఖ్య పెరగకుండానే డయాబెటీస్ కలిగిన పిల్లల సంఖ్య పెరగటం వింతగా వుందని భావించారు. సాధారణంగా పిల్లలు లేదా పెద్దవారిలో ముందుగా ఊబకాయం ఏర్పడి తర్వాతి దశలో ఇన్సులిన్ ప్రభావం తగ్గినందున టైప్ 2 డయాబెటీస్ వస్తుందని ఆమె తెలిపారు.
అయినప్పటికి, పరిశోధన మొత్తంగా ఊబకాయంకు, గుండె జబ్బులకు, డయాబెటీస్ కు మధ్య సంబంధాలున్నాయన్నారు. అందరిలోను కామన్ గా వున్న అంశం చెడు కొల్లెస్టరాల్ ఏర్పడటం మరియు అధిక రక్తపోటుగా తెలిపారు. వీటి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నారు.
తక్కువ కొవ్వు కల ఆహారాలు తినటం, కేలరీలు తగ్గించడం ప్రతిరోజూ 20 నిమిషాలపాటు వ్యాయామం చేయటం చేస్తే డయాబెటీస్ వ్యాధి షుమారు 60 శాతం వరకు తగ్గగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఈ వ్యాధులు 12 నుండి 19 సంవత్సరాల పిల్లలకు కలగటమనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, గతంలో ఈ వ్యాధులు 40 సంవత్సరాల వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవని, మరి ప్రస్తుతం ఈ వ్యాధులు టీనేజ్ లోనే వచ్చేస్తే, 40 సంవత్సరాలకు వీరిలో ఏర్పడే వ్యాధి పరిస్ధితి మరింత తీవ్రంగా వుండగలదని ఆమె భావించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications