Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటిక్ కోమా అంటే ఏమిటి?

డయాబెటిక్ కోమాకు కారణాలు
డయాబెటీస్ రోగులలో కోమాకు ప్రధాన కారణం రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిలు అతి తక్కువైపోవడం లేదా అత్యధికంగా రావడంగా చెప్పవచ్చు. ఈ కోమాకు గల మూడు సాధారణ కారణాలు అంటే, తీవ్ర హైపోగ్లైసీమియా, డయాబెటిక్ కెటోయాసిడోసిస్, హైపర్ గ్లైసీమిక్, హైపరస్ మోలార్ స్టేట్.
తీవ్ర హైపో గ్లైసీమియా మరియు కోమా (అతి తక్కువ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్) సరిగా చికిత్స లేకుంటే తెలివికూడా తప్పేలా చేస్తాయి.
చాలా పరిస్ధితులలో శరీరం బ్లడ్ షుగర్ స్ధాయిలను గ్లూకోజన్ రిలీజ్ చేయటం ద్వారా సాధారణ స్ధితిలో నిలబెడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు తక్కువగా వుంటే కోమా సంభవించే అవకాశాలు అధికం.
ఇన్సులిన్ డోస్ అధికంగా తీసుకున్నా, ఆల్కహాల్ అధికమై హైపోగ్లైసీమియా ఏర్పడినా, వ్యాయామాలు అధికమై శరీర గ్లైకోజన్ సరఫరా తగ్గినా లేదా ఖాళీ అయిపోయినా కోమా అంటే తెలివి తప్పటం అనేది ఏర్పడుతుంది.
డయాబెటిక్ కెటోయాసిడోసిస్ మరియు కోమా
ఈపరిస్ధితి చాలా ప్రమాదకరమైనది. శరీరం లో ఇన్సులిన్ అయిపోతుంది. ఇది సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ లో ఏర్పడుతుంది. కెటోన్ లెవెల్స్ పెరగకుండా ఇన్సులిన్ అరికడుతుంది. కనుకనే డయాబెటీస్ రోగులకు ఇన్సులిన్ ఇంజక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలని, ఎట్టి పరిస్ధితులలోను మిస్ కాకుండా వుండాలని తెలుపుతారు. ఈ దశలో రోగికి వాంతి, వికారాలు, డీహైడ్రేషన్, శ్వాస కష్టమవటం వంటివి కూడా ఏర్పడతాయి. ఎవరేని డయాబెటీస్ రోగులు ఈ స్ధితిలో వుంటే, వారికి తప్పక ఎమర్జెన్సీ మెడికల్ సహాయం కోరాలి. తెలివి తప్పిన వెంటనే వారు కోమాలోకి వెళ్ళిపోతారు.
టైప్ 1 డయాబెటీస్ లో రక్తంలోని గ్లూకోజ్ మరియు కెటోన్ స్ధాయిలు అధికంగా వుంటాయి. కనుక కెటోన్ స్ధాయిలు ముందుగా పరీక్షించాలి. టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు త్వరగా గుర్తించకపోతే, కెటోయాడిడోసిస్ వచ్చి రోగ నిర్ధారణకు ముందే కోమా ఏర్పడే అవకాశం వుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది నలుగురి రోగులలో షుమారుగా ఒకరికి రావచ్చు.
టైప్ 2 డయాబెటీస్ లో కెటోన్ స్ధాయిలు పెరుగకుండా ఇన్సులిన్ వుంటుంది. జబ్బుపడటాలు లేదా డయాబెటీస్ కు తగిన వైద్యం తీసుకోకపోవడాలు హైపర్ గ్లైసీమిక్ స్ధితిని తెస్తాయి.
డయాబెటిక్ కోమా రాకుండా ఏం చేయాలి?
- రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు పెరగకుండా లేదా తగ్గకుండా చూసుకోవాలి
- జబ్బులు పడ్డపుడు షుగర్ స్ధాయిలు తప్పక పరీక్షచేయించుకోవాలి
- ఆల్కహాల్ అధికంగా తీసుకోరాదు.
- బాగా వ్యాయామం చేసిన తర్వాత ఆల్కహాల్ తాగకండి
- వ్యాయామం చేసిన రాత్రులందు హైపో గ్లైసీమియా ఏర్పడకుండా చూసుకోండి.
- టైప్ 1 డయాబెటీస్ వారు రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు అధికంగా వుంటే కెటోన్ కొరకు పరీక్షించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications