For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ పేషంట్స్ ఖచ్చితంగా తినకూడని వెజిటేబుల్స్

|

షుగర్ (మధుమేహ)వ్యాధి సోకిన తరువాత నియంత్రించుకోవడం కంటే ఆ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వడం చాలా ముఖ్యం. మారిన, మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, లోపించిన దేహ పరిశ్రమ, పౌష్టికాహార లోపం, పర్యావరణంలో కలుగు తున్న మార్పులు, కాలుష్యం - ఇవన్నీ కలిసి మన దేశంలోనూ, ఇతర దేశాలలోనూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాయి.

పెద్దవారికి మాత్రమే పరిమితమైందనుకునే టైప్‌-2 మధు మేహం ప్రస్తుతం పిల్లలు, యుక్తవయస్కులలో కూడా కనిపిస్తున్నది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేజారిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, వారు పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి కాకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధిని నయం చేయటంలో ఆహారం ప్రధానపాత్ర వహిస్తుంది. సగం డయాబెటిస్ వ్యాధిని మంచి ఆహార నియమాలు పాటించడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ఆహార నియమాల విషయంలో ఈ కింది జాగ్రత్తలును తీసుకోవాలి.

ఆహారం పరంగా అన్ని రకాల కూరగాయలు మరియు పండ్లు అన్నీ ఆరోగ్యకరమే, కాబట్టి అన్నింటి తీసుకొంటే ఏమవుతుంది? అనుకుంటారు. అయితే, మధుమేహగ్రస్తులకు మాత్రం అన్ని కూరగాలయను తినకూడదు. వెజిటేబుల్స్ లో చాలా వరకూ అన్ని కూరగాయాల్లో స్ట్రార్చ్(గంజి)ఎక్కువగా ఉంటుంది కబట్టి మధుమేహగ్రస్తులు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. స్ట్రార్చ్ వెజిటేబుల్స్ ను మనం చాలా సులభంగా కనుగొనవచ్చు. ఎందుకంటే అవి కొద్దిగా తియ్యగా ఉంటాయి. ఉదా: బంగాళదుంప చాలా రుచికరంగా ఉంటుంది. ఉడికించి తన్నప్పుడుతియ్యగా కూడా అనిపిస్తుంది.

చాల వరకూ వెజిటేబుల్స్ అన్నీ భూమిలోపల పండేటవే కాబట్టి వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇటువంటి వెజిటేబుల్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను అతి త్వరగా పెంచేస్తాయి. మధుమేహగ్రస్తులు హై గ్లిసిమిక్ ఇండెక్స్ ఆహారాలకు ఖచ్చితంగా నివారించాలి. కానీ కొన్ని ఆహారాలు తీయ్యగా ఉన్నప్పటికీ వాటిలో గ్లైసిమిక్ ఉండదు. ఉదాహరణకు గుమ్మడి. ఇది కొద్దిగా తియ్యగా ఉన్నప్పటికీ, ఇందులో చాలా తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. మధుమేహగ్రస్తులు ఖచ్చితంగా తినకూడని లేదా పరిమిత మోతాదులో తీసుకోవల్సిన కొన్ని వెజిటేబుల్ లిస్ట్ మీకోసం...

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

బంగాళదుంపలు: బంగాళదుంపలు స్వీట్ గా మరియు కొవ్వును కలిగి మరియు ఖచ్చితమైన స్ట్రాచ్ ను కలిగి ఉంటాయి. అందువల్ల, మధుమేహగ్రస్తులు ఖచ్చితంగా బంగాళదుంపలకు దూరంగా ఉండాలి.

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

దుంపలు: భూమిలోపల పెరిగే దుంపల్లో పిండి పదార్థాలు (స్ట్రార్చ్)ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో భూమిలో పెరిగే కొన్ని వెరైటీ దుంపలు ఉన్నాయి. ఉదా: foot yam and butter nut yam ఇవి చాలా ప్రసిద్ది. మధుమేహగ్రస్తులకు బంగాళదుంపలు వలే ఈ దుంపలు కూడా హాని కలిగిస్తాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది.

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

బీన్స్: బీన్స్ తీపి కాదు, కానీ ఇది స్ట్రాచ్ పదార్థం. బీన్స్ అన్ని వేళలా తినకుండా ఆపడానికి వీలు లేదు. బీన్స్ ను ఉడికించినవి మరియు బేగించిన బీన్స్ ను పరిమితంగా తసుకోవచ్చు. ఇన్సులిన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు బీన్స్ ను తినకపోవడమే ఉత్తమం.

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

బీట్ రూట్: బీట్ రూట్ దుంప భూమిలోపల పెరుగుతుంది. ఇది బూమిలోపల పెరగడం వల్ల మట్టి నుండి తీపిని గ్రహించే ఒక కూరగాయగా ఉంది. కాబట్టి బీట్ రూట్ ను వారంలో ఒక సారి కంటే ఎక్కువగా తినకూడదు.

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

గుమ్మడి(స్క్వాష్) : స్క్వాష్ ఇది ఒక వింటర్ వెజిటేబుల్. ఇది తియ్యగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. మీకు మధుమేహం ఉంటే, ఇది చాలా రకాల పోషకాలు కలిగి ఉన్నప్పటీకీ, ఈ వెజిటేబుల్ ను తినడం నివారించాలి.

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

టమోటో: టెక్నికల్ గా టమోటోలు ఫ్రూట్స్, అయితే మనం వెజిటేబుల్ గా ఉపయోగించుకుంటాం. టమోటోలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కానీ ప్రాథమికంగా ఇది తీపి కలిగి ఉంటుంది. మనం పచ్చి టమోటోలను తినడం నివారించాలి. వంటకు కూడా చాలా తక్కువ టమోటోలను ఉపయోగించాలి.

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

కార్న్(మొక్క జొన్న): కొన్ని రకాల కార్న్స్ ను ‘స్వీట్ కార్న్' అని పిలుస్తుంటారు. స్వీట్ కార్న్ బేసిక్ గా తీయ్యగా ఉంటుంది. ఇందులో కూడా స్ట్రాచ్ కలిగి ఉంటుంది. కాబట్టి మీరు డయాబెటిక్ లక్షణాలు ఉంటే కార్న్ తినడం నిలిపివేయండి.

మధుమేహగ్రస్తులకు డేంజరెస్ వెజిటేబుల్స్

అరటికాయ: భారతదేశంలో అరటిపువ్వు మరియు కాండం ను కూరగాల్లో ఒకటిగా చెబుతుంటారు. అందుకే వీటితో వివిధ రకాల వెరైటీలను వండుతుంటారు. కానీ ఈ అరటిలో పిండి పదార్థాలు ఉంటాయి. అంతే కాదు వాటికి అవే తీపిగా మార్చుతాయి.

English summary

Vegetables That Diabetics Should Avoid

Once you are diagnosed with diabetes, you will have to be a picky eater for the rest of your life. That is why its prudent for all diabetics to know what they can and cannot eat. Most of us have this misconception that vegetables are always healthy and you can have them so matter what.
Desktop Bottom Promotion