For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ వల్ల శరీరంపై 8 డేంజరస్ ఎఫెక్ట్స్

డయాబెటిస్ వల్ల శరీరంపై 8 డేంజరస్ ఎఫెక్ట్స్

|

చాపకింద నీరులా చాలా రహస్యంగా శరీరంలోకి చేరిపోయే ఆరోగ్య శత్రువు మధుమేహం. మధుమేహం అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఎందుకంటే ఒకసారి మీకు మధుమేహం ఉందని నిర్ధారణ అయ్యాక ఇంక తగ్గడం అనే మాటే ఉండదు. ఏమాత్రం అప్రమత్తత లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేసి చేదుని మాత్రమే మిగులుస్తుంది. ఇంకా భయంకరమైన నిజం ఏమిటంటే ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 500మిలియన్లు దాటేసింది!

దీనిని వైద్య పరిభాషలో డయాబెటిస్‌ అని వ్యవహరిస్తుండగా, సాధారణ వ్యవహారంలో షుగర్‌ వ్యాధి, చక్కెర వ్యాధి అంటుంటారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందంటే దీని తీవ్రత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవాలి. వీటన్నిటినీ చూస్తుంటే ఆధునిక జీవనశైలి పుణ్యమా అని పరిస్థితులు ఎంత విషమంగా మారాయంటే, మనం మధుమేహ వ్యాధిగ్రస్తులమో కాదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవడం, ఈ వ్యాధి లక్షణాలు మరియు ప్రభావాలు గురించి తెలుసుకోవడం అనివార్యమయ్యింది.

శరీరం బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్ ను ఏవిధంగా ఉపయోగించుకుంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం వల్ల కళ్లు, హార్ట్, కిడ్నీ, నాడీవ్యవస్థ, గ్యాస్ట్రో ఇన్టెన్షినల్ ట్రాక్ట్, చిగుళ్ళ వ్యాధి మరియు దంత సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.ఇవన్నీ కూడా టైప్ 1 లేదా టైప్ 2 మరియు ప్రీ డయాబెటిక్ లలో ఏ రకానికి చెందినదో దాన్నిబట్టి తెలుస్తుంది. ఎక్కువగా దాహం, ఎక్కువసార్లు మూత్రవిసర్జన, అకస్మికంగా బరువు తగ్గడం, ఎక్కువ ఆకలి, అలసట, చీకాకు, బ్లర్ విజన్ , చిగుళ్ళు, చర్మం మరియు వజైనల్ ఇన్ఫెక్షన్ వంటివి మధుమేహ లక్షణాలు. ఇవే కాదు మధుమేహం వలన శరీరంలో దీర్ఘకాలికంగా కూడా ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!

గుండె సంబంధిత వ్యాధులు:

గుండె సంబంధిత వ్యాధులు:

డయాబెటిస్ కరోనరీ హార్ట్ డిసీజ్ మరియు బ్లడ్ ప్రెజర్ కు సంబంధం ఉంటుంది. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ ప్రకారం జీర్ణ సంబంధిత, కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ ద్వారా హార్ట్ లేదా స్ట్రోక్ సమస్యలకు కారణం అవుతుంది.

కిడ్నీ డ్యామేజ్ :

కిడ్నీ డ్యామేజ్ :

కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం వల్ల శరీరంలోని రక్తంలో వ్యర్థాలను వడపోయడంలో కిడ్నీ పనితీరు ఫెయిల్ అవుతుంది. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు. కిడ్నీ డ్యామేజ్ కొన్ని సంవత్సరాలపాటు ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది.

కంటిచూపు పోతుంది:

కంటిచూపు పోతుంది:

మధుమేహం వల్ల డయాబెటిక్ రెటినోపతికి కారణం అవుతుంది, కంటి వెనుకభాగంలో ఉన్న రెటీనా డ్యామేజ్ అవ్వడం వల్ల కంటిచూపు మందగిస్తుంది. కాంట్రాటక్ట్, గ్లూకోమా సమస్యలుంటాయి. అంతే కాదు సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే పూర్తిగా కంటిచూపు కోల్పోవల్సి వస్తుంది.

నరాలు డ్యామేజ్ అవుతాయి:

నరాలు డ్యామేజ్ అవుతాయి:

శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. దాంతో పాాల్లో ఇన్ఫెక్షన్స్, అల్సర్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. డయాబెటిస్ వల్ల మూడు రకాలుగా నరాలు దెబ్బతింటాయి. అవి పెరిఫెరల్ డయాబెటిక్ న్యూరోపతి, అటానమిక్ న్యూరోపతి మరియు డయాబెటిక్ అమియోట్రోఫి.

చిగుళ్ల సమస్యలు:

చిగుళ్ల సమస్యలు:

మధుమేహం వల్ల చిగుళ్ళ సమస్యలు కూడా మొదలవుతాయి. చిగుళ్ళు ఎర్రగా మారడం, వాపు, అనవసరంగా రక్తస్రావం జరుగుతుంది. రక్తనాళలు మందంగా మారడం వల్ల న్యూట్రీషియన్లు సరిగా సప్లై కావు, దాంతో టాక్సిక్ వేస్ట్ మెటిరియల్ బయటకు పోకపోవడంతో చిగుళ్ళు మరియు బోన్ టిష్యు వీక్ గా మారుతాయి.

చర్మ వ్యాధులు

చర్మ వ్యాధులు

మధుమేహం చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. హైబ్లడ్ షుగర్ లెవల్స్ చర్మంను డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది, దాంతో చర్మం పొడిగా మరియు చర్మపగుళ్ళు ఏర్పడుతాయి. ఇటువంటి పరిస్థితిని డయాబెటిక్ డెర్మోపతి అని పిలుస్తారు.

రీప్రొడక్టివ్ సమస్యలు:

రీప్రొడక్టివ్ సమస్యలు:

గర్భధారణ సమయంలో జస్టేషనల్ డయాబెటిస్ కు కారణం అయ్యే హార్మోన్లలో మార్పులుంటాయి, ఇది హై బ్లడ్ ప్రెజర్ కు కారణం అవుతుంది. వజైన మరియు బ్లాడర్ ఇన్ఫెక్షన్ లక్షణాలుంటాయి. గర్భిణీ స్త్రీలు ప్రీ క్లాంప్సియా లేదా ఎక్లిప్సియా అనే రెండు రకాల బ్లడ్ ప్రెజర్ల గురించి తెలుసుకోవాలి. ప్రసవం తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ స్థితికి చేరుకుంటాయి.

జీర్ణ సమస్యలు:

జీర్ణ సమస్యలు:

మధుమేహం గ్యాస్ట్రోపరేసిస్ కు కారణం అవుతుంది. ఈ డిజార్డర్ పొట్ట ఎక్కువ సమయం కాలీగా ఉండటం వల్ల వస్తుంది. దాంతో వాంతులు, వికారం మరియు పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి పొందుతారు

English summary

8 Effects Of Diabetes On The Body

Diabetes is a group of diseases that affect how your body uses blood sugar or glucose. It increases blood sugar levels that can lead to serious health problems like eye, heart, kidney, nerves, gastrointestinal tract, gums and teeth diseases.
Story first published:Friday, August 30, 2019, 13:10 [IST]
Desktop Bottom Promotion