For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్‌ నివారణకు అద్భుతమైన పరిష్కారం: దానిమ్మ జ్యూస్, ఎప్పుడు తాగాలి?

డయాబెటిస్‌ను నివారణకు అద్భుతమైన పరిష్కారం: దానిమ్మ జ్యూస్, ఎప్పుడు తాగాలి?

|

మీకు డయాబెటిస్ ఉందని నిర్ధారించిన తర్వాత దాన్ని నిర్వహించడం కష్టతరమైన వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ఎందుకంటే ఇంటెన్సివ్ చికిత్స కూడా ఈ వ్యాధిని నయం చేయలేకపోయింది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుకోవడంలో సరైన ఆహారనియమాలను పాటించడం చాలా అవసరం. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తినదగిన పండ్లలో ఖచ్చితంగా సూచిస్తున్న పండ్లలో ఒకటి దానిమ్మపండు. ఇది డాక్టర్లచే సూచింపబడిన పండు. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

Why Pomegranate is Good for Diabetic Treatments?

డయాబెటిక్ చికిత్సలకు దానిమ్మపండు ఎందుకు మంచిది?

డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు సిఫారసు చేసిన పండ్లలో ఇతర రుచికరమైన పండ్లలో దానిమ్మ మాత్రమే ఎందుకని మీలో కొందరు ఆశ్చర్యపోవచ్చు. దానిమ్మపండ్లలో ఫైబర్ ఎక్కువ మరియు యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ వంటి కొన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా కార్బోహైడ్రేట్ కంటెంట్ వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి మానవునికి చాలా బలంగా అవసరమవుతాయి. కానీ కార్బోహైడ్రేట్స్ డయాబెటిక్ రోగులకు సమస్యగా మారవచ్చు. అదృష్టవశాత్తూ దానిమ్మలో కనిపించే కార్బోహైడ్రేట్ కంటెంట్ డయాబెటిస్‌కు తగినంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. డయాబెటిస్ చికిత్సలో దానిమ్మ రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింది విధంగా వివరంగా తెలుపడం జరిగింది.

ఫైబర్ ఎక్కువ

ఫైబర్ ఎక్కువ

డయాబెటిక్ రోగులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు లేదా పండ్లు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఫైబర్ యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియకు పోషకాలను గ్రహించడం మరియు సరైన జీవక్రియను ప్రోత్సహించడం మాత్రమే కాదు, కొలెస్ట్రాల్ మరియు హృదయ సంబంధ సమస్యల వంటి డయాబెటిక్ పరిస్థితుల వల్ల కలిగే కొన్ని క్లిష్ట పరిస్థితులను నివారించడంలో ఇది చాలా మంచి చేస్తుంది.

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది

మనకున్న సాధారణ పరిజ్ఝానంతో డయాబెటిక్ రోగులు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి యాంటీఆక్సిడెంట్లు మాత్రమే పరిష్కారం. అయినప్పటికీ, మానవ శరీరం యాంటీఆక్సిడెంట్లను ఉత్పత్తి చేయదు; అందువల్ల బాహ్య వనరులను బట్టి యాంటీఆక్సిడెంట్ల అవసరాలను తీర్చగల ఏకైక మార్గం దానిమ్మ. డయాబెటిక్ రోగులకు మరింత తీవ్రమైన పరిస్థితులకు కారణమయ్యే కొన్ని సమస్యలను కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడానికి యాంటీఆక్సిడెంట్లు మంచి పరిష్కారం.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు

డయాబెటిక్ రోగులు సాధారణంగా ఎదుర్కొంటున్న పరిస్థితులలో కొలెస్ట్రాల్ ఒకటి. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 2 ఉన్న రోగుల్లో ఈ సమస్య ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత కొలెస్ట్రాల్ స్థాయి సాధారణమైనదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం దానిమ్మ రసాన్ని రోజూ తీసుకునే వారిలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది నిర్ధారించబడ్డాయి.

రక్తంలో చక్కెరను తగ్గించడంలో సూపర్ గా సహాయపడుతుంది

రక్తంలో చక్కెరను తగ్గించడంలో సూపర్ గా సహాయపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడటానికి దానిమ్మ రసానికి ఉన్న గుణాలు కేలరీలు తక్కువగా మరియు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారం. పరిశోధలన ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో దానిమ్మ రసం మంచిగా ఉండటానికి కారణం ఏమిటంటే అవిరామ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దానిమ్మలో లభించే యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ దానిమ్మలో కనుగొన్నారు. అదే ఇందుకు ప్రదాన కారణమని తేలింది.

ఈజీ స్నాక్ ఛాయిస్

ఈజీ స్నాక్ ఛాయిస్

దానిమ్మ రసంలో స్వీట్ మరియు టేస్టీ ఫ్లేవర్ డయాబెటిక్ రోగి తిన్న ఆహారాలనే రోజూ తింటుంటే బోరు కొట్టకుండా రోజువారీ మెనుని చిన్న పాటి మార్పును సూచిస్తుంది. అందుకే దానిమ్మ రసాన్ని మితంగా మాత్రమే తీసుకోవడం వల్ల ఇది ఒక ఈజీ స్నాక్ ఛాయిస్ అయ్యింది. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడు తిన్నా సరైనా మోతాదులో మాత్రమే తినాలి. అప్పుడే రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అందుచేత సాధ్యమైనంత వరకూ రెగ్యులర్ డైట్ లో ఎర్రని దానిమ్మ పండును చేర్చుకోండి. సాధ్యమైనంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది

ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది

ఫ్రీ రాడికల్స్ డయాబెటిస్తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. మీరు డయాబెటిక్ రోగులలో మీరు ఒకరు కాకపోయినా, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల మీ శరీరంలోకి ఫ్రీ రాడికల్స్ ప్రవేశించకుండా నివారించడంలో ఇది గొప్పగా సహాయపడుతుంది. దానిమ్మలో కనుగొనబడిన ఈ యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ డయాబెటిస్‌ను అరికట్టడానికి సరిపోతుంది.

నేచురల్ ఇమ్యునిటీ బూస్టర్‌గా పనిచేయగలదు

నేచురల్ ఇమ్యునిటీ బూస్టర్‌గా పనిచేయగలదు

డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం ఎందుకంటే సాధారణ ఫ్లూ వైరస్ మరింత క్లిష్ట పరిస్థితులకు దారితీస్తుంది. దానిమ్మపండు మరియు కొన్ని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ విషయాలలో లభించే విటమిన్ సి ప్రయోజనాలు మీ శరీరానికి అవసరమైన రక్షణను అందిస్తాయి.దాంతో అవి సహజ రోగనిరోధక శక్తిని పెంచేవిగా పనిచేస్తాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

దానిమ్మ రసంలో ఉన్న ఫైబర్ కంటెంట్ హృదయ ఆరోగ్యానికి ఎందుకు అంత మంచిది అంటే, ఈ పండు మీ గుండె చాలా కష్టపడి పనిచేయవలసి వచ్చినప్పుడు అధిక రక్తపోటు లక్షణాల వల్ల గుండె జబ్బులు మరియు ఇతర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించగలదు. కొన్ని అధ్యయనాలు దానిమ్మ రసంలో లభించే యాంటీఆక్సిడెంట్స్ ద్రాక్ష రసం, క్రాన్బెర్రీ జ్యూస్ మరియు రెడ్ వైన్ వంటి కొన్ని ఇతర ఎర్ర పానీయాలలో కన్నా ఎక్కువగా ఉందని నిరూపించాయి.

డయాబెటిస్‌ను నివారించడానికి అద్భుతమైన పరిష్కారం

డయాబెటిస్‌ను నివారించడానికి అద్భుతమైన పరిష్కారం

మీరు డయాబెటిస్ సమస్యను దూరంగా ఉంచాలనుకుంటే, ఈ పరిస్థితిని తల్లిదండ్రులల్లో ఏవరికైనా డయాబెటిస్ కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఉన్నట్లైతే వీలైనంత త్వరగా వ్యూహాన్ని ఆలోచించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లును నిర్వహించడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం తప్పనిసరి. కానీ ‘ఆరోగ్యకరమైన' అనే పదం ఎల్లప్పుడూ సాదా ఆహారాలతో సంబంధం కలిగి ఉండదు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అధికంగా ఉండే దానిమ్మ రసాన్ని తీసుకోవడం మీ ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది.

డయాబెటిస్ చికిత్స కోసం దానిమ్మ రసాన్ని తీసుకునే జాగ్రత్తలు

డయాబెటిస్ చికిత్స కోసం దానిమ్మ రసాన్ని తీసుకునే జాగ్రత్తలు

  • డయాబెటిస్ చికిత్సలో భాగంగా మీరు రోజూ దానిమ్మ రసాన్ని తీసుకుంటున్నప్పుడు కొన్ని ముందు జాగ్రత్తలు లేదా హెచ్చరికల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
  • డయాబెటిక్ రోగులు దానిమ్మపండును మితంగా మాత్రమే తీసుకోవాలి. ముందుగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దానిమ్మ పండు కూడా చక్కెర లేనిదని కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మితగా పండ్లతో పోల్చినప్పుడు ఈ పండులో న్యాచురల్ షుగర్స్ పరిమితంగా ఉంటాయి కాబట్టి, ఈ పండును పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ ప్రయోజనాలను పొందగలరు
  • డయాబెటిస్ చికిత్సలో భాగంగా మీరు దానిమ్మ రసాన్ని జోడించాలనుకుంటే, మొదట మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది, ముఖ్యంగా మీరు డయాబెటిస్ నివారణ కోసం నిర్దిష్టమైన ఔషధాలను తీసుకుంటున్నప్పుడు ఇతర ఎలాంటి దుష్ప్రభవాలు నివారించడానికి తప్పనిసరిగా డాక్టర్ ను కలిసి తగిన సూచనలు తీసుకోవాలి.

English summary

Why Pomegranate is Good for Diabetic Treatments?

Benefits of Pomegranate Juice for Diabetes Treatment. Read to know more about..
Desktop Bottom Promotion