Just In
- 33 min ago
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- 50 min ago
40 ప్లస్‌లో కూడా ఆ విషయంలో హ్యాపిగా ఉండాలంటే ఈ చిట్కాలను అనుసరించండి..
- 3 hrs ago
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- 4 hrs ago
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి?ఈ నొప్పి ప్రమాదకరమా?
Don't Miss
- Finance
రూ.5 వేల కోట్లు అప్పు తీసుకుంటాం.. అనుమతివ్వండి: సీజీ పవర్ వినతి
- News
పెళ్లిలో టిక్‌టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్‌లో కాల్పులు
- Sports
క్రీడా అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాల గుత్తా!!
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Movies
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
టైప్-1 డయాబెటిస్ ఉంటే భయపడాల్సిన పని లేదంటున్న ప్రముఖ సింగర్, ప్రియాంక చోప్రా భర్త..
నిక్ జోనస్ అంటే ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన పేరు ఇటీవల భారతదేశంలో కూడా బాగా పాపులర్ అయ్యింది. ఎందుకంటే బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా తన కంటే 11 ఏళ్లు చిన్నవాడు అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకోవడం వల్ల. అయితే ఆ నిక్ జోనస్ కూడా మధుమేహం బారిన పడ్డాడట. తను కూడా టైప్-1 డయాబెటిస్ తో చాలా ఇబ్బందులు పడ్డాడట.
ఈ విషయాలన్నీ స్వయంగా అతనే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అతను కూడా సరిగ్గా 14 ఏళ్ల క్రితం నవంబర్ మాసంలోనే డయాబెటిస్ సోకినట్లు నిర్ధారణ చేసుకున్నాడట. నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా ఆ ప్రముఖ సింగర్ డయాబెటిస్ ను ఎలా ఎదుర్కొన్నాడో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.

1) 14 ఏళ్ల క్రితం డయాబెటిస్..
నిక్ జోనస్ కు బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రాతో పెళ్లి కాకముందే షుగర్ తో బాగా ఫికర్ చెందాడట. 14 సంవత్సరాల క్రితం సరిగ్గా నవంబర్ మాసంలోనే టైప్-1 డయాబెటిస్ గురించి నిర్ధారణ చేసుకున్నాడట. వాటిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు.
|
2) కోమా స్టేజీకి దగ్గరగా..
‘గతంలో తాను ఉన్నట్టుండి బరువు భారీగా తగ్గిపోవడంతో తన తల్లిదండ్రులు ఆసుప్రతికి తీసుకెళ్లారని, అప్పటికే తన ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని, అది ఎంతలా అంటే ఏకంగా కోమా స్టేజీకి దగ్గరగా వెళ్లిపోయాను అని, ఆసుపత్రికి వెళ్లడం ఒక్కరోజు ఆలస్యం అయినా నేను కోమాలోకి వెళ్లేవాడిని‘ అని పేర్కొన్నాడు.

3) నాకు చాలా చిన్నవయసులోనే డయాబెటిస్..
‘నాకు చాలా చిన్నవయసులోనే డయాబెటిస్ రావడంతో నేను చాలా భయపడ్డాను. నేను అనుకున్నది సాధించగలనా అని టెన్షన్ పడేవాడిని. అప్పుడే దీన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను‘ అని చెప్పాడు.

4) డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు..
‘నాకు డయాబెటిస్ నిర్ధారణ అయిన తర్వాత నేను డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎల్లప్పుడూ ఇన్సులిన్ మరియు షుగర్ లెవెల్స్ పై శ్రద్ధ చూపుతుండేవాడిని‘ అని వివరించారు. అలాగే డయాబెటిస్ కారణంగా నేను తీసుకున్న ఆహారాన్ని చూసి కొందరు గాయకులు చాలా విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నాడు.

5) డయాబెటిస్ తో ఒంటరిగా అనిపిస్తుంది..
‘తాను టైప్-1 డయాబెటిస్ వంటి అనారోగ్యానికి గురై ఎంతో బాధను అనుభవించానని, తమ చుట్టూ ఎంత మంది ఉన్నా షుగర్ ఎఫెక్ట్ వల్ల ఒంటరితనంగా ఫీలవ్వాల్సి వస్తుంది. అందరూ మన నుండి దూరం అయినట్లు అనిపిస్తుంది. అని తన అనారోగ్యం గురించి ఎంతలా బాధపడ్డాడో తన అనుభవాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇలా టైప్-1 డయాబెటిస్ వ్యాధిపై అందరికీ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాను‘ అని వివరించాడు.