Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఒళ్ళు వంచితే....వద్దన్నా ఆరోగ్యమే!

1. అపార్టుమెంట్లలో వున్నా లేక ఆఫీసులలో పని చేస్తున్నా లిఫ్ట్ ఉపయోగించకండి. మెట్లు ఎక్కి మీ ఇంట్లోకి లేదా ఆఫీసులోకి వెళ్లండి.
2. ఇంటి పని - కాస్తంత మీ అహం పక్కన పెట్టండి. పనిమనిషిని మాన్పించండి. ఇంటిలోని పనంతా మీరే చేసుకోండి. ప్రతిరోజూ నేల తుడవటం వంటివి మీ నడుముకు, చేతులకు చక్కటి వ్యాయామాన్నిస్తాయి.
3. శరీరాన్ని వంచండి - ప్రతి రోజూ మీరు చేసే పనులలో ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు నడుం కిందకు వంచండి. షూ లేసులు కట్టేటపుడు లేదా వంట గదిలో పని చేసేటపుడు వీలైనన్ని సార్లు కిందకు వంగడం లేదా కూర్చొని లేవడం వంటివి చేయండి. ఆధునిక కిచెన్ లో కిచెన్ ఫ్లాట్ ఫారమ్ లు నిలబడి పనిచేసేవిగా వుంటూ మహిళల నడుములకు బలాన్ని తగ్గిస్తున్నాయి.
4. నడవండి - ఇంటిలో వుండే వారైనా, లేక ఆఫీస్ లలో పని చేసేవారైనా, వాహనాలున్నప్పటికి వాటిని కొంత దూరంలో వుంచి మరి కొంత దూరం నడవటం ఎంతో మంచిది. నడక శరీరానికి కావలసినంత వ్యాయామం కలిగిస్తుంది. లేదా సైకిలు ఉపయోగించి, షాపింగ్, స్నేహితుల ఇల్లు, దగ్గరలో వున్న బ్యాంకు, ఇతర చిన్నపాటి పనులకు వివిధ ప్రదేశాలకు వెళ్ళి కాలి పిక్కలకు, తొడలకు తగు వ్యాయామం కల్పించండి.
ఈ చిట్కాలు పాటించి మీ జీవన విధానం మార్చుకోడం ద్వారా సహజంగా బరువు తగ్గి స్లిమ్ గా వుండి ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
