Latest Updates
-
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
పెరిగిన వక్షోజాల సైజును తగ్గించేమార్గాలు!

1. వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి.ఈ కొవ్వు కణాలను తగ్గించటం ద్వారా బ్రెస్ట్ సైజును సహజంగా తగ్గించవచ్చు. పరుగెత్తడం, సైకిలు తొక్కడం, మెట్లు ఎక్కటం, స్విమ్మింగ్ చేయటం వంటి సులభమైన వ్యాయామాలు కేలరీలను వ్యయం చేసి స్తనాల సైజును తగ్గిస్తాయి.
2. వక్షోజాల సైజులు తగ్గాలంటే పుష్ అప్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఛాతీని, భుజాల కండరాలను గట్టిపడేస్తాయి. స్తనాల సైజు తగ్గి మంచి రూపం ఏర్పడేలా చేస్తాయి.
3. నేలపైనకాని లేదా ఒక బెంచిపైన కాని పడుకోండి. డంబ్ బెల్ లేదా బార్ బెల్ మీ చేతులలోకి తీసుకొని వాటిని పైకి ఎత్తటం,మోచేతులను వంచి కిందకు దించటం చేయండి. ఈ వ్యాయామం వక్షోజాల సైజులు తగ్గటానికి తోడ్పడుతుంది.
4. స్విమ్మింగ్ మరో చక్కనైన వ్యాయామం. స్విమ్మింగ్ లో చేసే ఫ్రంట్ మరియు బ్యాక్ స్ట్రోకులు ఛాతీ, భుజాల కండరాలపై ప్రభావాన్ని చూపి క్రమేణా వక్షంలోని కొవ్వు కణజాలాన్ని తగ్గేలా చేస్తాయి. కొవ్వును తగ్గించి వక్షోజాల సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఇది మంచి వ్యాయామం.
5. వక్షోజాల సైజులు తగ్గాలంటేజోగింగ్ కూడా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు జోగింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. బ్రెస్ట్ షేప్ పాడవకుండా వుండాలంటే బిగువైన బ్రాసరీ ధరించండి.
6. నేలమీద వెల్లకిలా పరుండి రెండు చేతులలోను డంబ్ బెల్స్ పట్టుకొని ఒకదానికొకటి వ్యతిరేకదశలో చేతులు కలపటం, విడగొట్టటం వంటి వ్యాయామం చేస్తే సత్వరమే వక్షోజాలలోని అధిక కొవ్వు కరిగిపోయి వక్షోజాలు మంచి రూపాన్ని సంతరించుకుంటాయి.
7. మీరు తినే ఆహార పదార్ధాలలో కొవ్వు శాతం తక్కువగా వుండేలా చూసుకోండి.
వ్యాయామాలు ఏవి చేసినప్పటికి ఒకే రోజు అధిక సమయం చేయకుండా క్రమేణా సమయాన్ని పెంచండి. మంచి ఫలితాలను పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
