Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
వెరైటీగా ఒక కప్పు ‘టీ’ తాగండి..బరువును తగ్గించుకోండి...

బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది: అనేక జపనీస్ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఈ టీలో వున్న థియాఫ్లేవిన్స్ మరియు థీరుబిగిన్స్అనేవి బరువు పెరగడాన్ని నియంత్రించడంలో ఇది ఓ దివ్య ఔషదంలా పనిచేస్తుందని తేల్చారు. ఈరెండు కాంపౌండ్స్ ను ఎక్కువ ఫ్యాట్ కలిగిన ఎలుకల పై ప్రయోగించారు. దాంతో ఎలుకల్లో బరువు పెరగకుండా నియంత్రణకు బాగా సహాయపడిందని కనుగొన్నారు. కాబట్టి గ్రీన్ టీ మాత్రమే కాకుండా బరువు తగ్గించడానికి ఇతర వెరైటీ ‘టీ' ఉన్నాయి. అందులో ఒకటి ‘ఓకినోవా' టీ..
బాడీ ఫ్యాట్ ను బర్న్ చేసే బ్లాక్ టీ: వేడివేడిగా బ్లాక్ టీని ఒక కప్పు సేవించడం వల్ల, శరీరంలో వేడి కలిగి, శరీరంలోని నిల్వ ఉన్న కొంత కొవ్వును తొలగించి, కొవ్వుకు ప్రభావితం చేసే కేలోరీలను తగ్గింస్తుంది. మీరు బ్లాక్ టీ సేవించడం వల్ల అతి తర్వగా శరీరంపై ప్రభావితం చేసి కొవ్వును కాల్చివేస్తుంది. బ్లాక్ టీలో ఎక్కువ కెఫిన్ ఉన్నందున కొవ్వును కరిగించడంలో ఇది సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్ టీ తాగడం వల్ల అలసట, పోమరితనం, ఒత్తిడి దూరమవుతాయి. అదే సమయంలో బరువును కోల్పోవడం కూడా జరుగుతుంది. అయితే దీన్నీ అతివేడిగా తీసుకోకూడదు. ఇందులో ఉన్న అధిక శాతం కెఫిన్ బాడీని నిర్జలీకరణం(తేమగా) ఉండేట్లు చేస్తుంది.
జింజర్ టీ: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బర్న్ చేయడానికి జింజర్ టీ కూడా బాగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలను ఒక మూలికా ఔషదంగా అల్లంను ఉపయోగిస్తారు. అల్లం వివిధ రూపాల్లో దొరుకుతుంది. పచ్చిఅల్లం, అల్లం పేస్ట్, అల్ల పౌడర్ఇలా రకరకాలుగా దొరుకుతుంది. జింజర్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారనేదానికి ఏ ఆధారం లేదు. అయితే అనేక అధ్యయనాలు , కొంత మంది నిజ జీవిత అనుభవాల ప్రకారం జింజర్ టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పోగోడుతుందని తేలింది.
జిన్సెంగ్ టీ: శరీరంలోని జీవక్రియకు సమర్ధవంతంగా పనిచేసే శక్తిని అందించే జిన్సెంగ్ టీ...ఆసియా దేశంలో చాలా మంది ఈ హెర్బల్ టీ ను సేవిస్తారు. దీన్ని తాగడం వల్ల అలసటను దూరం చేసి రక్తప్రసరణను మెరుగు పరచి, బరువును తగ్గిస్తుది. ఒక కప్పు జింన్సెగ్ టీ తాగడం వల్ల ఒళ్ళు నొప్పులు, ఒత్తిడితో పోరాడి, వంట్లో సత్తువను పెంచుతుంది.
బరువును తగ్గించడంలో ఉపయోగపడే ఈ హెర్బల్ టీలు పరిమితంగా తాగితే చక్కటి ఫలితం మీ సొంతం అవుతుంది. మీరు బరువును తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే...లోఫ్యాట్ కలిగిన పాలు లేదా మీగడ తీసిన పాలు తాగడం మంచిది. మీరు ఏ టీ సేవించినా అందులో పంచదార లేకుండా చూసుకోవాలి. పంచదారకు బదులు తేనెను ఉపయోగిస్తే శరీరంలో రక్తం చక్కెర స్థాయిలను పెంచుతుంది. మరియు బరువు పెంచకుండా నియంత్రిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
