Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
తక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యం?

తక్కువ తినేందుకు 5 చిట్కాలు
మీరు తినాలనుకునేవాటి జాబితా తయారు చేయండి. వారంకి సరిపడా ఏమేమి తినాలనేది నిర్ధారించుకోండి. దానిని ఆచరణలో పెట్టండి. ఇక అధికంగా తినటం జరగదు. మీరు వ్రాసిన జాబితాలో ఎంతా పరిమాణంలో ఆహారం తీసుకోవాలి అనేదానిని కూడా పేర్కొనండి. ఉదాహరణకు ఒక చిన్న కప్పు అన్నం, రెండు చపాతీలు మధ్యాహ్నం వేళ తినాలి అని నిర్ణయించండి.
ప్రణాళిక - వ్రాసిన ప్రణాళిక ఆచరణలో తప్పక పెట్టాలి. ఖచ్చితంగా మీ తక్కువ ఆహారం ప్రణాళిక ఆచరిస్తే బరువు తగ్గటం తేలికే.
సరైన ఆహారం - సరైన ఆహారం ఎంచుకోండి అది మీ ఆకలిని గంటల తరబడి నియంత్రిస్తుంది. కడుపు నింపే ఆహారాలు అనేకం వున్నాయి. మీ ఆకలి తీరాలంటే కడుపు నింపేవే తినాలి. డార్క్ చాక్లెట్, బాదం పప్పులు, అరటి పండు వంటివి త్వరగా కడుపు నింపేస్తాయి.
ద్రవాలు అధికం - ద్రవాహారాలు అధికంగా తాగండి. కడుపులో ఎపుడూ ద్రవాలు పూర్తిగా వుంటే అది మిమ్మల్ని ఘనాహారం తినకుండా చేస్తుంది. నీరు, పండ్లరసాలు, వెజిటబుల్ రసం వంటివి తాగాలి. ఇవి శరీరంనుండి మలినాలను విసర్జిస్తాయి. తక్కువ కొ్వ్వు, కేలరీలు వుండే వాటిని ఎంచుకోండి.
మెల్లగా తినండి - తినటానికి అధిక సమయం కేటాయించి మెల్లగా తినాలి. వేగంగా తింటే, ఆహారం అధికంగా లోపలికిపోతుంది. నమిలితే దవడ కొవ్వు కరుగుతుంది. ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. కనుక మీ ఆహారాన్ని మెల్లగా తినటమనేది కూడా తక్కువ తినటంలో ఒక చిట్కా అని గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
