Latest Updates
-
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.?
యాపిల్ సైడర్ వినేగర్ చేసే మేలు!
యాపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్ వినేగర్. ఈ వినేగర్ వలన ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి ఈ యాపిల్ సైడర్ వినేగర్ వాడకం ఆశ్చర్యకర ఫలితాలనిస్తూ మీలోని అదనపు కొవ్వును కరిగించేస్తుంది. అయితే, యాపిల్ సైడర్ వినేగర్ అనేది ఒక యాసిడ్ అని అధికంగా వాడితే హాని కలిగిస్తుందని కూడా మీరు గుర్తుంచుకోవాలి. రోజు మొత్తంలో ఏ భోజనానికి ముందైనా సరే ఒకటి లేదా రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే చాలు. దానిని నీటితో కలిపికూడా తీసుకోవచ్చు. దీని వ్యయం అధికం కాదు ప్రతివారికి ఇది అందుబాటులోనే ఉంటుంది. మరి యాపిల్ సైడర్ వినేగర్ వాడి మీ కొవ్వు కరిగించండి, ఆరోగ్య సమస్యలను తక్కువ చేయండి.

బరువు తగ్గుట - యాపిల్ సైడర్ వినేగర్ మీ శరీరంలోని అధిక కొవ్వు కరిగించి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. అదనపు కొవ్వును ఖర్చు చేయడంతోపాటు ఆకలి తగ్గిస్తుంది. దీనిలో ఉండే పెక్టిన్ అనే పదార్ధం కొవ్వును తొలగిస్తుంది. అధికంగా తీసుకుంటే తప్ప ఇది హానిలేనిది. మీకు కనుక దీని వాసన పడకపోతే, టాబ్లెట్ ల రూపంలో కూడా దీనిని వాడవచ్చు. జీర్ణం అవటం కూడా తేలిక అవుతుంది.
డయాబెటీస్ - రక్తంలో షుగర్ స్ధాయిలను కూడా తగ్గిస్తుందని రీసెర్చిలో రుజువు చేయబడింది. గ్లూకోజ్ స్ధాయిలను తగ్గిస్తుంది కనుక దీనిని డయాబెటీక్ రోగులు తప్పక వాడవచ్చు. రాత్రి వేళ డిన్నర్ తీసుకునే ముందుగా ఒకటి లేదా రెండు స్పూన్లు యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే, మరుసటి రోజు ఉదయానికి రక్తంలో షుగర్ స్ధాయిలు తక్కువ ఉండటం గమనించవచ్చు. కనుక డయాబెటీస్ కు ఇది ఒక సహజ నివారణ. అయితే, అధికంగా తీసుకుంటే, గొంతులో మంటను కలిగిస్తుంది.
బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్టరాల్ - యాపిల్ సైడర్ వినేగర్ ఆహారం బ్లడ్ ప్రెజర్ మరియు కొల్లెస్టరాల్ నివారణకు ఔషధంగా వాడవచ్చు. వారంలో 4 లేదా 5 రోజులపాటు ఈ ఆహారం తింటే, గుండె జబ్బులు కూడా రావని చెప్పవచ్చు. దీనిని కనుక మీరు అలాగే తీసుకోలేకపోతే, మీరు తినే ఇతర సలాడ్లలో కలిపి తినేయండి. అధికంగా తీసుకుంటే, అది మీ పంటి ఎనామిల్ ను నష్టపరచే అవకాశం కూడా ఉంది.
ఈ ఆహార చిట్కాలు పాటించి కొవ్వు రహిత ఆరోగ్యకర శరీరాన్ని పొందండి. అది ఒక యాసిడ్ అని గుర్తించండి. అతి తక్కువ మొత్తాలలో మాత్రమే ఔషధంగా దానిని వాడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications