Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
స్లిమ్ అయ్యేందుకు ఇంటి చిట్కా!

వేడినీరు - తేనె: ఉదయంవేళ పొట్ట ఖాళీగా వున్న సమయంలో వేడి నీరు, తేనెల మిశ్రమం శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తుంది. బరువు తగ్గించటమేకాదు, ఈ డ్రింక్ మంచి చురుకుదనాన్నిచ్చి మీ జీవప్రక్రియను వేగిరపరుస్తుంది. తేనెలో వుండే అమినో యాసిడ్లు, ప్రొటీన్లు, మినరల్స్ అధిక బరువు రాకుండా నిలుపు చేస్తాయి.
వేడి నీరు - నిమ్మరసం : సాధారణంగా డైటింగ్ చేసేవారు ఈ పానీయాన్ని తాగుతూనే వుంటారు. వేడినీరు శరీరానికి మంచిది. బరువు తగ్గిస్తుంది. వేడినీరు, నిమ్మరసం కలిసిన మిశ్రమం శరీర కొవ్వును కరిగిస్తుంది. మంచి పోషక పానీయం కూడాను. ప్రతి భోజనం తర్వాత ఈ పానీయాన్ని తాగితే శరీర కొవ్వు కరిగిపోతుంది.
గ్రీన్ టీ: దీనిని ఇంటిలోనే తయారు చేసుకొని వేడి లేదా చల్లగా కూడా తాగవచ్చు. గ్రీన్ టీ బరువు తగ్గటానికి బాగా పని చేస్తుంది. శరీరంలోని మలినాలను విసర్జించి ఆరోగ్యంగా వుంచుతుంది. జుట్టు రాలటం, చర్మం పొడిబారకుండా చేయటం వంటివి చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒక సమయంలో గ్రీన్ టీ తాగండి. బరువును తగ్గించటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పచ్చి కూరల రసం - కాకర రసం కొవ్వు తగ్గించేందుకు బాగా పని చేస్తుంది. షుగర్ లెవెల్ అదుపులో వుంచి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దీనితో పాటు బచ్చలి ఆకు లేదా కేరట్ లేదా టొమాటో జ్యూస్ వంటివి కూడా తాగి బరువు తగ్గించుకోవచ్చు. కేరట్, పొట్ల, దోస, సొర వంటి కూరలు కూడా రసం తాగేటందుకు వాడవచ్చు. ఈ పచ్చి కూరల రసంలోనే కొద్దిపాటి తేనె గాని లేదా నిమ్మరసం కాని వేసి తాగితే రుచి మారి మీకు తాగటం కూడా తేలిక అవుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు ఇంటిలోనే ఈ పానీయాలను తయారు చేసుకొని తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
