Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
డైటింగ్ అంటే తక్కువ తినడమా?

1. శరీరానికి అవసరమైన శక్తి పొందాలంటే ఆహారం అవసరం. కనుక తక్కువ తింటూ త్వరగా బరువు తగ్గాలనటం సరి కాదు. తినండి ...తినేది సరైనదో కాదో సరైన పరిమాణంలో వుందోలేదు పరిశీలించండి. పచ్చటి ఆకు కూరలు, పండ్లు, వంటివి మీ ఆహారంలో అధిక నీటిని ఇస్తాయి. త్వరగా జీర్ణం కాని పదార్ధాలు తినకండి. అనారోగ్యకరమైన బేకరీ జంక్ ఫుడ్ వదిలేయండి.
2. కార్బో హైడ్రేట్లు తగ్గించకండి. ఇవి తగ్గితే మీ జీవక్రియ వెనుకబడుతుంది. కేలరీలు తక్కువ వుండే ఆమారాలు తినండి. తినే దానిలో అవసరమైన పోషకాలన్నీ వున్నాయో లేదో చూసుకోండి. ఎంత ఆహారం వదలాలనుకుంటే తినాలనే వాంఛ పెరిగిపోతుందని గుర్తించండి. కనుక తినేవి పోషకాలు కలిగినవిగా ఎంపిక చేయండి.
3. ఎలా తినాలి? నోటిలో పెట్టుకున్న ఆహారం బాగా నమలటం ప్రధానం. మెల్లగా నములుతూ నోటిలోని లాలాజలంతోనే అది జీర్ణం అయ్యేలా తినాలి. నోటిలో అధికంగా ఆహారం పెట్టుకోకండి. ఒకేసారి ఎక్కువ ముద్దలు తినేవారికి అజీర్ణం గ్యాస్, పొట్ట నొప్పి వంటివి కలుగుతాయి. కనుక బాగా నమలండి. చిన్న ముద్దలు పెట్టుకోండి.
4. ఎప్పుడైనా, మీరు కోరిన ఆహారాలు తప్పక ఒకసారైనా కొద్ది కొద్దిగా తిని మీ వాంఛలను తీర్చుకోండి. లేకుంటే మీకు తినాలనే ఆరాటం అధికమైపోతుంది. అయితే దానిని అలవాటుగా మార్చి బరువు పెరగకండి. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక ఆచరించండి. పచ్చటి కూరలు అధికంగా, పప్పులు, ఓట్లు, గింజధాన్యాలు తినండి.
5. ఎట్టి పరిస్ధితులలోను మధ్యాహ్న భోజనం వదలకండి. రోజులో చివరగా తినేది చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారంగా ఎంచుకోండి. రాత్రులందు అన్నం తినకండి. అది అధిక కేలరీలను అందిస్తుంది.
ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ చేసే ముందుగా కనీసం ఒక గ్లాసు గోరు వెచ్చటినీరు తాగండి. ఇది మీరు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
సరైన ఆహారాలు సరైన మొత్తాలలో సరైన సమయంలో తింటూవుంటే మీ శారీరక రూపం ఎంతో ఆకర్షణీయం అనేది గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
