Latest Updates
-
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..
రంజాన్ ఉపవాస దీక్షలో శక్తినిచ్చే ఆహారాలు(రుచులు)
రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల... అత్యంత కఠోర నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మంచి నీరైనా ముట్టరు. అంతే కాదు.. ఎదుటి వ్యక్తికి తాము ఉపవాసం ఉన్నట్లు కూడా కల్పించరు. రోజువారీ విధుల్ని మామూలుగానే నిర్వహిస్తుంటారు. నగర జీవితం బిజీబిజీ ఎండలో.. వానలో.. ట్రాఫిక్ లో.. మరెన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న వారు నిత్యజీవనం గడుపుతుంటారు. అందుకే సూర్యోదయానికి ముందు.. సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటే రోజంతా ఇబ్బంది ఉండదు. ఎవరి వారు వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్లు ఆహారాన్ని తీసుకోవచ్చని పోషక నిపుణులు సూచిస్తున్నారు. రంజాన్ సందర్భంగా తీసుకునే ఆహార పదార్థాలు, అందులోని పోషక విలువల గురించి తెలుసుకుందాం...

1. ఉపవాసంలో... అత్యధిక పోషకాలు కలిగిన పండ్లు...
పండ్లు: ఉపవాసం ముంగించే సమయంలో మహ్మద్ ప్రవక్త మొదటగా ఖర్జూరాలు తీసుకునే వారని ప్రతీతి... తర తరాల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. వీటితో పాటు పండ్లు కూడా తీసుకుంటారు. నిమ్మరసంతో తయారు చేసిన షర్బత్ ఆరోగ్యానికి మేలైంది, రంజాన్ నెలలో ముస్లింలు ఆయా సీజన్లలో లభించే అన్ని పండ్లను తీసుకుంటారు.
ఖర్జూరాలు: వీటిలో మంచి పోషక పదార్థాలు ఉంటాయి. ఇందులో 7.3శాతం ఐరన్, వంద గ్రాముల పళ్లకు317క్యాలరీల శక్తి లభిస్తుంది.
ఆఫ్రికాట్స్: 430గ్రాముల పొటాషియంతో పాటు కార్బో హైడ్రేట్లు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, క్యాలరీలు అధికం ఉంటాయి
ద్రాక్ష: 71శాతం క్యాలరీలు, ఐన్ అధికంగా ఉంటుంది.
అరటి పండు: 116క్యాలరీల శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.
నల్ల ద్రాక్ష: 58 గ్రాముల శక్తితో పాటు పొటాషియం అధికం
కమలాలు: శక్తి తక్కువగా ఉన్నా పొటాషియం పుష్కలం
సపోటా: 269మిల్లీగ్రాముల పొటాషియం, సోడియం పదార్థాలతో పాటు 98 క్యాలరీల శక్తి
దానిమ్మ: 133మిల్లీ గ్రాముల పొటాషియం.65క్యాలరీల శక్తి ఉంటుంది
నిమ్మ: 270మిల్లీ గ్రాముల పొటాషియం, సోడియం పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
