Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మగవారు తప్పనిసరిగా తీసుకోవలసిన హెల్తీ డైయట్ ఫుడ్...
ప్రతి రోజూ మనం ఏదో ఒక ఆహారాన్ని తీసుకొంటుంటాం. అయితే ఏఏ ఆహారాలు ఎలా పనిచేస్తాయో, అన్ని విషయాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. ఏం తినాలి? అనే విషయంలో మనకెప్పుడూ సందేహమే. శరీరానికి పోషకాలు అందాలి...అదే సమయం లోబరువు పెరగకూడదు. స్త్రీ, పురుషులు కోరుకునేది ఇదే. మామూలుగానే పురుషులకంటే స్త్రీలు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు అదనంగా పాటిస్తుంటారు. తినే ఆహారంలో కొన్ని రకాలు మహిళలు పూర్తిగా ఉపయోగపడతాయి.శరీరం ఒకే బరువున్న స్త్రీపురషులు ఒకే రకమైన కొవ్వునిల్వలు కలిగివున్నా, వారు వ్యాయామం ద్వారా ఖర్చుచేసే కేలరీలు కూడా ఒక్కటే అయినా స్త్రీపురుషులకు కాలరీల అవసరం మాత్రం వేరు వేరుగా ఉంటుంది. మగవారిలో కండరాలు పెద్దగా ఉండటం వలన వారు వ్యాయామం చేయకపోయినా కండరాలు యథాస్థితిగా ఉండటానికైనా కేలరీలు అవసరం అవుతాయి.
అందుకే మగవారిలో మహిళలకంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మహిళలు చిన్న పరిమాణంలో ఉండటం వలన కండరాలు కూడా చిన్నగా ఉండటం కారణంగా వారిలో ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటే అది కొవ్వుగా మారుతుంది. అందుకే స్త్రీలకు పోషకారం అందాలి. అదే సమయంలో తక్కువ కేలరీలు ఉండాలి. సాధారణంగా మహిళలకు రోజుకి 1200కేలరీలు అవసరం అవుతాయి. మగవారికి మరికొన్ని ఎక్కువ కావాలి. మరి పురుషులకు అన్ని క్యాలోరీలను అందించి.. ప్రత్యేకంగా ఉపయోగపడే ఆహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మగవారు వారు తీసుకొనే ఆహారంలో తప్పకుండా తీసుకోవలసిన కొన్ని రకాల డైయట్ ఫుడ్ లిస్ట్ మీకోసం...

టమోటో
టమోటోలో చాలా ఉపయోగకరమైన వెజిటేబుల్. అధిక రోగనిరోధక శక్తిగల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు కేన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీ పార్లలో ఫేస్‌మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు. లైకోపిన్ అనే ఎంజైమ్ వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

బ్రాజిల్ నట్స్
సాధారణంగా స్నాక్స్ తినేటప్పుడు నట్స్ తీసుకోవడం అటు గుండె ఆరోగ్యానికి, ఇటు చర్మ సంరక్షణకు చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ లో బ్రాజిల్ నట్ కూడా ఒకటి. ముఖ్యంగా మగవారికి ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇందులో హై సెలీనియం అధికంగా ఉంటుంది. వీర్య ఉత్పత్తికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. సెలీనియం ఎల్ డి ఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ మీద బాగా పనిచేస్తుంది.

క్యాబేజి
క్యాబేజీ, బ్రొకోలి మరియు బ్రజెల్స్, తృణధాన్యాలు, కొన్ని గ్రీన్ వెజిటేబుల్స్ మగవారు తమ డైయట్ లో ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిది. ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో క్యాన్సర్ తో పోరాడగలిగే కెమికల్స్ అధిక శాతంలో ఉన్నాయి. ఇవి ప్రొస్టేట్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ బారీన పడకుండా కాపాడుతాయి. కాబట్టి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి.

బెర్రీస్
క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

గుడ్లు
గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గ్రుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. ప్రోటీన్లు: శ్రేష్ఠమైన ప్రోటీన్లు. గుడ్డులోని తెల్ల సొనలో 6.5 గ్రాముల ప్రోటీన్ ఉన్నది. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కావుగనుక తొందరగా ఆకలివేయదు. హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

దానిమ్మ
అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల, విటమిన్స్, మినిరల్స్ సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది .దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది.

వెల్లుల్లి
వెల్లుల్లి గుండెకు ఏవిధంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలిసిన విషయమే..కొలెస్ట్రాలోను తగ్గించడంలో ఇది ముందుంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ప్రతి రోజూ వెల్లుల్లిని మరియు ఉల్లిపాయను తినడం వల్ల ప్రొటెస్ట్ క్యాన్సర్ బారీన పడకుండా సహాయపడుతుంది.

తృణధాన్యాలు
పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు. కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు సమకూరుతాయి.

సాల్మన్(Salmon)ఫిష్
మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్ ఫిష్ ప్రొటీన్ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications











