Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
అధిక బరువు తగ్గించే నవ్వు!

కడుపారా నవ్వు అనేది పొట్ట సంబంధిత అవయవాలు అంటే లివర్, కిడ్నీ, పాన్ క్రియాస్, స్ప్లీన్, ఎడ్రినాల్ మొదలైనవాటికి ఆరోగ్యాన్ని చేకూర్చే సందేశం ఇస్తుంది. అదెలాగంటే, నవ్వితే చాలు శరీరంలో రక్తప్రసరణ అధికమవుతుంది. వివిధ అవయవాలు కదిలి జీవక్రియ వేగవంతం అవుతుంది. అంతేకాదు, పొట్టలో వుండే డయాఫ్రం తేలికగా కదులుతూ దాని సంకోచాలలో పొట్ట కండరాలను కదిలిస్తుంది. దీనితో కండరాలు మరింత సడలి హాయి పొందుతాయి. నవ్వితే కనీసం 15 కండరాలు కదులుతాయని, ముఖానికి వ్యాయామంగా ఎంతో మంచిదని ఎపుడూ నవ్వుతూ తిరిగేవారు చిన్నవారుగా వుంటారని నిపుణులు చెపుతారు.
నవ్వితే రక్తం ప్రసరణ పెరిగి రక్తం ఒత్తిడి అధికమవుతుంది. నవ్వటం ఆపితే ఒత్తిడి తగ్గుతుంది. దానితో రిలాక్స్ అయినట్లు భావిస్తారు. నవ్వు శరీరంలో కలిగించే ప్రయోజనాలెలావుంటాయంటే....
1. అది గుండె జబ్బుల రిస్కు తగ్గిస్తుంది.
2. శ్వాస మెరుగుపడుతుంది. శ్వాస కోశం శుభ్రపడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
3. రోగ నిరోధక వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. ఆరోగ్య కణాలను పెంచుతుందని రీసెర్చర్లు చెపుతారు.
ఒత్తిడితో సంబంధం కల హార్మోన్ల స్ధాయి తగ్గటానికి తోడ్పడుతుంది. దానితో ఆందోళన తగ్గి మంచి నిద్రపట్టిస్తుంది.
4. నవ్వు మనోవేదన, ఆందోళన దూరం చేసి శరీరంలో సహజ హార్మోన్ అయిన సెరోటోనిన్ స్ధాయి పెంచి వాటిని దూరం చేస్తుంది. హాస్యం చేస్తూ వుండే వారికి విచారం దూరంగా వుండటం అనేది గమనిస్తూనే వుంటాం.
5. నవ్వు, అంటువ్యాధి వంటిది. ఎవరైనా నవ్వినా, జోక్ వేసినా అది అక్కడున్న వారికందరకూ వ్యాపించి ఆ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పరుస్తుంది.
6. అన్నిటిని మించి నేటి వ్యక్తుల సమస్యలైన అధిక బరువును తగ్గిస్తుంది. నవ్వటంతో ఎన్నో కేలరీలు ఖర్చవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగై శరీర బరువును ప్రభావించే మెటబాలిజం రేటు పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
