Latest Updates
-
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.!
మజిల్స్ పెంచి - బాడీ బిల్డ్ చేసే మాంసాహారం...
బాడీనీ స్లిమ్ గా ఉంచుకోవాలంటే.. చాలా వర్క్ అవుట్సే ఉన్నాయి. అయితే వర్క్ అవుట్స్ చేయడంతో బరువు తగ్గుతారు తప్ప మంచి శరీరసౌష్టవం(ఆకారం) కనబడదు. వ్యాయమంలో ముఖ్యంగా కార్డియో మరియు ఏరోబిక్ ఎక్సర్ సైజులను మాత్రమే చేయిస్తుంటారు. అయితే ఇవి మంచి శరీరసౌష్టవాన్నందిచి మజిల్స్ (కండరాలు) ఏర్పడేలా చేసేవి వేరేవి ఉన్నాయి. అలా బాడీ బిల్డప్ చేయాలనుకొనే వారు బాడీ బిల్డిగ్ ఉపయోగపడే ఆహారాలను ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. మీరు శాకాహారులు కానట్లైతే మాంసాహారాలు బాడీబిల్డ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. పెద్ద పెద్దగా మజిల్స్ ఉండి.. అందంగా కనబడే శరీర సౌష్టవానికి ఐదు రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్ మీకోసం....

గుడ్లు
గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గ్రుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. ప్రోటీన్లు: శ్రేష్ఠమైన ప్రోటీన్లు. గుడ్డులోని తెల్ల సొనలో 6.5 గ్రాముల ప్రోటీన్ ఉన్నది. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కావుగనుక తొందరగా ఆకలివేయదు. గుడ్డులో ఉన్న పోషకపదార్ధాలు: ఎమినోయాసిడ్లు, ఎ.,డి., ఇ. విటమిన్లతో సహా అత్యవసర పోషకాలు, థయమిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, ఐరన్, పాష్పరస్.. ఉంటాయి.

క్రాబ్స్ మీట్(ఎండ్రక్కాయలు)
మాంసాహార ప్రియలు ఎక్కువగా చికెన్, మటన్ మాత్రమే తింటుంటారు. అయితే వాటి స్థానంలో సీఫుడ్ అంటే క్రాబ్స్, పీతలు వంటివి తినడం కండర పుష్టికి బాగా ఉపయోగపడుతుంది. క్రాబ్స్ లోకాలొరీలను కలి చాలా రకాల న్యూట్రిషియన్స్ ఉంటాయి. బాడీ బిల్డింగ్ మజిల్స్ పెంచుకోవడమే కాదు.. మజిల్స్ కు స్టాంగ్ బోన్స్ ఉన్నప్పుడు అందంగా కనబడుతాయి. అందు ఈ క్రాబ్స్ తగినంత శక్తిని, క్యాల్షియం, జింక్ ను అందిస్తాయి. ఇది ఒక మంచి సీ ఫుడ్ .వీటి మాంసం రుచికరంగా ఉంటుందని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

మటన్
రెడ్ మీట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ మీట్ ను తినడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు. మటన్ లేదా బీఫ్ లో అమినో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మట్టన్ లేదా బీఫ్ తరుచూ తీసుకొంటే మజిల్స్ త్వరగా ఏర్పడుతాయి. మటన్ లో కూడా అర్జినైన్ అనే విటమిన్ మజిల్స్ పెరగడానికి బాగా తోడ్పడుతుంది.

ఓయిస్ట్రెస్(Oysters)
పురుషుల ఆరోగ్యానికి అవసరమైన జింక్ అత్యధికంగా కలిగి ఉన్నటు వంటి సహజ వనరు. జింక్ మగవారిలో ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్వహించడమే కాకుండా ఆరోగ్యరమైన స్పెర్మ్(వీర్యం)వృద్ది చెందడానికి సహాయపడుతుంది. పురుషుల్లో మంచి శరీర సౌష్టవం కలిగి ఉండేలా చేసి మాన్లీ లుక్ ను అందిస్తుంది. జింక్ లోపించడం వల్ల అత్యధికంగా హెయిర్ ఫాల్ సంభవిస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎక్కువ మోతాదులో జింక్ ను అందించే ఓయిస్ట్రెస్. కాబట్టి పురుషు ఆరోగ్యాని, అందానికి అత్యంత ప్రయోజకారినిగా పనిచేస్తుంది ఓయిస్ట్రెస్.

సాల్మన్(Salmon)ఫిష్
మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్ ఫిష్ ప్రొటీన్ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications