Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శరీరంలో అదనంగా పేరుకొన్న కొలెస్ట్రాల్ తగ్గించడం ఎలా?
కొలెస్ట్రాల్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక పదార్ధం. కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉన్నాయి: హెచ్ డి ఎల్, సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ అంటారు, ఎల్ డి ఎల్, సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ గా సూచిస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటె, తీవ్రమైన సమస్యలు వస్తాయి.
కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఒక మార్గం ఆహారం. కొలెస్టరాల్ తగ్గించే మంచి ఆహార ప్రణాళికలో కొన్ని వదిలేసి, కొన్ని వాడాలి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవడానికి కొన్ని ఆహార సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
సంతృప్త కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండడం.

సంతృప్త కొవ్వు నుండి కొలెస్ట్రాల్ తయారవుతుంది. కొవ్వు అధికంగా కలిగిన ఆహార పదార్ధాలను దూరంగా ఉంఛి, వీలయితే పూర్తిగా తొలగించడం కొలెస్ట్రాల్ నియంత్రణకు మంచి పద్ధతి. కొన్ని ఆహార పదార్ధాలను పూర్తిగా దూరంచేయడం సాధ్యం కాని పరిస్థితులలో వాటిని కొద్ది పరిమాణంలో తీసుకోవడం మంచిది. వీటిలో సిద్దాహారాలు, కోడి చర్మం, గొడ్డు మాంసం లాంటి కొవ్వు అధికంగా వుండే జంతు పదార్ధాలు వున్నాయి. అంతేకాక, సంతృప్త కూరగాయల కొవ్వులను కూడా వాడరాదు. ఇవి కూడా మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.

పీచు పదార్ధం అధికంగా ఉన్న ఆహారం తినడం: కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడానికి, తగ్గించడానికి, ప్రత్యేకంగా తక్కువ శుద్ది చేసిన పిండితో చేసిన రొట్టె వంటి పీచు పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారాలను తప్పక తీసుకోండి. అదనంగా మీరు గింజలు, తృణ ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. ఈ ఆహారం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా, మీరు వినియోగించే క్యాలరీల మొత్తాన్నీ కూడా తగ్గిస్తుంది. అధిక క్యాలరీలు సహజంగా శరీరంలో కొవ్వుగా మార్చబడతాయి. మీ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే, దానివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి ప్రమాదం కలుగుతుంది.

కూరగాయలు, పండ్లు ఎక్కువ తినండి: కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనుకునేవారు ఎవరైనా తాము తీసుకునే ఆహారంలో క్యాబేజ్, క్యారెట్లు, దోసకాయలు, ఆకుకూరలు ఉండేట్లు చూసుకోవాలి. కూరగాయలే కాకుండా, తాజా పండ్లను కూడా తీసుకోవాలి. ఈ పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి.

చేప, పల్చటి మాంసం తినండి: కొలెస్ట్రాల్ నియంత్రణ ఆహారం చేపలను ఎక్కువగా కలిగి ఉండాలి. కాడ్, సాల్మన్, ట్యున వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను సమృద్ధి పరుస్తాయి. మాంసం తినడం మానలేని వారు, పౌల్ట్రీ నుండి చర్మం లేని మాంసాన్ని ఎంపిక చేసుకోవాలి.

సరైన పరిమాణంలో తినండి: కేవలం కొన్ని పదార్ధాలు తీసివేయడం, జత చేయడ౦ మాత్రమె కొలెస్టరాల్ స్థాయిని తగ్గించడం నియంత్రి౦చడం లో ప్రధానం కాదు. మీరు సరైన పరిమాణంలో ఆహారం తినడ౦ మంచిది.

మీరు తినడానికి ముందు, ఆహారంలోని వివిధ ప్రత్యేకమైన పోషక విలువల స్థాయిని తెలుసుకునేందుకు పట్టికని చదవండి. మీరు కొలెస్ట్రాల్ స్థాయిని తక్కువగా ఉంచుకునేందుకు రోజుకు షుమారు 6 నుండి 7 మోతాదుల తృణధాన్యాలు, 3 నుండి 5 మోతాదుల కూరగాయలు, 2 నుండి 4 మోతాదుల పండ్లు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications