Latest Updates
-
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..
రొట్టె మంచిదా? అన్నం మంచిదా?
రొట్టె మంచిదా? అన్నం మంచిదా? అనే అంశం ప్రతి ఇంటిలోను ఎంతో కాలంగా చర్చించబడుతూనే ఉంటుంది. దేని మంచి దానిదే? దేని ఆరోగ్యం దానిదే అంటూ ఎవరికిష్టమైన రీతిలో వారు సమర్ధించుకుంటారు. కొంతమంది అన్నం తింటే లావెక్కి పోతారంటారు. కొంతమంది చపాతి లేదా రొట్టెలు తింటే జీర్ణం చేసుకోవడం కష్టం అంటారు. మరి వీరి మాటలలో వాస్తవం ఎంతా? అన్నం తింటే లావెక్కటం, రొట్టెలు జీర్ణం కాకపోవడం వంటి అంశాలు వివరంగా పరిశీలించండి. ఆరోగ్య కరమైన ఈ రెండు ఆహారాలలో ఏది గెలుస్తుందో పరిశీలిద్దాం.

కార్బోహైడ్రేట్లు - ముందుగా వీటిలోని కార్బోహైడ్రేట్లు గమనించండి. అన్నంలో కార్బోహైడ్రేట్లు తక్కువ. మరి రొట్టెలో అధికంగా ఉంటాయి. ఈ అధిక కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయాలంటే అధిక కేలరీలు ఖర్చు చేయాలి. అదే అన్నం జీర్ణం కావాలంటే, రొట్టెల కంటే కూడా తక్కువ ఎనర్జీ సరిపోతుంది. ఎవరికైనా జీర్ణ వ్యవస్ధ బలహీనంగా ఉంటే, వారికి రొట్టెలు అరగటం లేదా జీర్నం అవటం కష్టం. వీరు అన్నం తినటమే మంచిది.
సోమరితనం - అన్నం లంచ్ లేదా డిన్నర్ లో తింటే చాలామంది బద్ధకంగా ఉంటుందంటారు. రైస్ మీకు అతి త్వరగా జీర్ణం అయి రక్తంలోని షుగర్ అధికం చేస్తుంది. ఈ కారణంగానే కొంతమంది అన్నం తినగానే సోమరిగా ఉంటారు. అదే మీరు రొట్టెలు లేదా చపాతీ తింటే ఈ బద్ధకం అనేది మీకు రాదు. ఈ కారణంగానే చాలామంది రొట్టెలు లేదా చపాతీలు తినేందుకు ఇష్టం చూపుతారు.
కొవ్వు పట్టడం - అన్నంలో కొవ్వులు అధికం. కనుక మీరు ఆహారాలు బాగా తినేవారైతే, రైస్ లేదా అన్నం తినకండి. రొట్టెలలో కొవ్వులు అధికంగా ఉండవు. అందుకనే ధైరాయిడ్ లేదా అధికబరువు ఉండే వారు వారి భోజనంలో అన్నాన్ని తినరు. అన్నం వండే విధానంలో కూడా అది ఉంటుంది. అన్నాన్ని కనుక మీరు ప్రెషర్ కుక్కర్ లో వండితే, అది అనారోగ్యమే. అధిక నీటిని అది పీల్చుకుంటుంది. కనుక అన్నాన్ని ఆవిరి బయటకు బాగా పోయేలా విడిగా వండండి.
పీచు - ఇక పీచు విషయాలనికి వస్తే, అది అన్నంలో ఉంటుందా? లేక రోట్టెలలో అధికంగా ఉంటుందా? అనేది పరిశీలిద్దాం. పీచు రొట్టెలలోనే అధికంగా ఉంటుంది. మీకు మలబద్ధకం ఏర్పడదు. అదే మీరు రైస్ తిన్నట్లయితే రొట్టెలలో అందినంత పీచు మీకు అందదు.
వాస్తవానికి అన్నం లేదా రొట్టెలు ఏదైనప్పటికి గింజలనుండి వచ్చినవే. దేని లాభాలు దానికి, దేని నష్టాలు దానికి ఉన్నాయి. కనుక మీరు ఆహారంగా దేనిని తీసుకోవాలంటే దానిని అంటే, రొట్టెలు లేదా అన్నం మీ ఆహారంలో చేర్చండి. అన్నం తిన్నప్పటికి తక్కువ మొత్తంలో అన్నాన్ని తింటూ, అధిక పరిమాణంలో కూరలు, లేదా పప్పు వంటివి అధికంగా తినండి. అధిక మొత్తంలో తినే కూరలు మీ ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
