Latest Updates
-
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..
సెలవు రోజులలో తిండా....మజాకా....?
వారాంతపు సెలవులు వచ్చాయంటే చాలు, పార్టీలు, ఫంక్షన్లు లేదా ఇతర శుభ కార్యాలంటూ రోజూ తినేదానికంటే కూడా అధికంగా తినేస్తాము. అప్పటివరకు డైటింగ్ చేస్తున్నప్పటికి నోరూరే ఆహార పదార్ధాలు చూస్తేచాలు తినేయ బుద్ధి వేస్తుంది. గట్టిగా పట్టుపట్టటం, వారమంతా చేసిన డైటింగ్ వ్యర్ధం చేసుకోవడం చేస్తాము. మరి సెలవు రోజుల్లో ఎలా తాగాలి? ఎలా తినాలి? చూడండి.

శుక్రవారం - శుక్రవారం రాత్రులు పార్టీలంటే ఇష్టపడేవారికి ఎంతో ఆనందం. శని మరియు ఆదివారం రెండు రోజులూ సెలవులే, పార్టీ శుక్రవారం రాత్రే పెట్టేస్తే, తినటం, తాగటం ఎంతో ఆనందం, మరుసటిరోజు హేంగోవర్ వచ్చినా మరింత మందు కొట్టేయవచ్చనుకుంటారు. మందు భావనలో ఆకలి కూడా అనిపించదు. మత్తు వదిలిన తర్వాత కడుపు సంగతి తెలుస్తుంది. పార్టీకి వెళితే, మీరు ఎపుడూ తాగే ఫేవరెట్ డ్రింక్ తాగకండి. అది మొదలుపెడితే, అధికంగా తాగేస్తారు. నియంత్రణ కోల్పోతారు. అందుకని ఏదో ఒకటి మీకు అలవాటు లేనిది తీసుకోండి. భోజనం వద్ద కూర్చున్నారా? తేలికగా తినే వారివద్దే కూర్చోండి. మీరు కూడా తేలికగా తిని లేస్తారు. బాగా తినేవారివద్ద కూర్చుంటే, మరి మీరు కూడా గట్టిగా తినవలసిందే.
శనివారం - ఇంటిలోనే వుండి బద్ధకిస్తూ వుంటాము. ఆ బద్ధకంలో బోర్ కొట్టేస్తోంది అంటూ స్నాక్స్ విపరీతంగా తింటాం. వాటిని మితం చేయండి. చిన్నపాటి భోజనం తీసుకోండి. ఫ్రిజ్ లో ఆహారం అధికంగా ఉంచకండి. మిని భోజనం తింటే చాలు తక్కువ తిన్నట్లే. ఫ్రిజ్ లో ఆహారాలు ఏం పెట్టకుండా వుంటే మరీ మంచిది. శనివారం డిన్నర్ పార్టీలు అవసరమయితే తప్ప పెట్టుకోకండి. అవి మిమ్మల్ని మరింత తినేలా చేస్తాయి. డిన్నరన్ పార్టీలో కూడా మీ ప్లేట్ లో పచ్చికూరలు, వంటివి పెట్టుకొని తక్కువతినే వారి పక్కన కూర్చోండి.
ఆదివారం - ఆదివారం వచ్చిందంటే, ఇంటిలో పండుగ వాతావరణమే. ఫుడ్ ఫెస్టివల్, అన్ని పదార్ధాలు తయారు చేస్తారు. చిట్కాగా మీరు పోషకాలు అధికంగా వున్న ఆహారాలనే ఎంచుకోండి. తినే సమయానికి ముందుగా ఒక కప్పు కాఫీ తాగేయండి. కాఫీ ఆకలిని చంపుతుంది. అధికంగా తిననీయదు. మీరు కఠినమైన డైటింగ్ చేస్తున్నప్పటికి, మీకు కూడా కొద్దిపాటి విందు కావాలి. కేలరీలు తక్కువుండే ఐస్ క్రీం శాండ్ విచ్, చిన్న డార్క్ చాక్లెట్, గోధుమ బ్రెడ్ వంటివి తినండి. ఈ పదార్ధాలు, మీరు వారాంతపు సెలవులలో తినాలి అని భావించే వాటికి సరిపోతాయి. ఈ మాత్రం మాత్రమే ఆదివారం తింటే, మరల పనిరోజు అయిన సోమవారం మీకు పనిచేయటానికి తేలికగా వుంటుంది. ఈ చిట్కాలతో వారంతపు రోజుల ఆహారం ముగించండి. అన్నిటికంటే ఆచరించాల్సింది స్వయం నియంత్రణ అని తెలుసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
