Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
బరువు తగ్గేందుకు.. ఆహారంలో సమతుల్యత తప్పనిసరి
ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరగడం మొదలైంది. అంటే ఆహారంపట్ల జాగ్రత వహించడం పెరిగింది. ఎట్టకేలకు రుచులకోసం తాపత్రయం పోయి కేలరీలను లెక్కేసుకోవడం అలవడింది. జిహ్వచాలప్యం కాస్తంత అణచుకుంటే నిండు నూరేళ్లు అనారోగ్యాలు దరిచేరకుండా గడపొచ్చుననే ఆలోచన వచ్చింది. కాబట్టి తినే ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక వేసుకోవాలి.

మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్ గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి.
1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి.
2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.
3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం.
4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది.
5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి.
6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది.
7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.
8. ఆహారం ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోవడం కంటే కొంచెం మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిది.
9. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు తగిన వ్యాయామం చేయాలి.
10. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే దాన్ని మించిన ఆరోగ్య రహస్యం ఇంకొకటి లేదు.
ఈమాత్రం కనీస సూత్రాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications