Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
జంటగా కలిసి వ్యాయామం చేస్తే... !

.
డ్యాన్స్ - జంటలు సాధారణంగా డ్యాన్స్ చేయటానికి ఎక్కువ మక్కువ చూపుతారు. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గటమే కాక, డ్యాన్స్ చేసే నైపుణ్యాన్ని సంపాదించి, పార్టీలు, వెడ్డింగ్ సందర్భాలలో ప్రదర్శన కూడా ఇవ్వవచ్చు. సల్సా, టాప్ డ్యాన్సింగ్, జివింగ్ వంటివి కొన్ని జంటలు కలసి చేయదగినవిగా వుంటాయి.
జాగింగ్ - ఉదయంవేళ ఒక్కరే జోగింగ్ కు వెళ్ళ్ళి వెళ్ళి బోర్ కొట్టేసిందా? మీ పార్టనర్ ని కూడా వెంట తీసుకెళ్ళండి. జాగ్ చేస్తూనే ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. శరీరంలో కొవ్వు కరిగించుకోవచ్చు. కనుక మీ చెవిలో హెడ్ ఫోన్ తీసేసి, పార్టనర్ ని పక్కన పెట్టుకొని జాగ్ చేసి ఆనందించండి.
సైకిలింగ్ - బరువు తగ్గటానికి చాలా తేలికైన వ్యాయమం. కేలరీలు బాగా ఖర్చవుతాయి. కాలి కండరాలు ప్రత్యేకించి తొడ కండరాలు బలపడతాయి. సైకిలింగ్ లో మీ పార్టనర్ తో కొంత సమయం ఆనందించి అందులో వున్న మజా అనుభవించండి.
స్విమ్మింగ్ - రిలాక్స్ అవ్వాలంటూ ఒక్కరే స్విమ్మింగ్ కు వెళితే కొద్ది రోజులయ్యే సరికి విసుగనిపిస్తుంది. మీ పార్టనర్ ని కూడా తీసుకెళ్ళండి. మజాగా వుండటమే కాక, ఆరోగ్యం అద్భుతంగా వచ్చేస్తుంది. అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఈ వ్యాయామంలో జంటలు కలసి మరింత రిలాక్స్ కావచ్చు.
టెన్నిస్ / స్క్వాష్ - ఇద్దరికి ఆటలంటే ఇష్టమా? టెన్నిస్ ఎంతో హుషారు పుట్టిస్తుంది. శరీరం మంచి షేప్ లోకి వచ్చేస్తుంది. రోజంతా చురుకుగా వుంచుతుంది. ఈ ఆట వ్యాయామంగా ఎంతో ఆసక్తి కలిగిస్తుంది.
జంటగా మీ భాగస్వామితో కలిసి చేయదగిన వర్కవుట్ల ప్రత్యామ్నాయంగా ఈ క్రీడలను ఎంచుకొని, ఆరోగ్యం, ఆనందం, కలసి పంచుకోండి. వర్కవుట్ల తర్వాత ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి. ఇది మీ శరీరాన్ని కాపాడటమే కాక, వ్యర్ధాలను విసర్జిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
