Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శరీరంలో అధిక క్రొవ్వుతో పాటు..మలినాలను బయటకు పంపే సులభ చిట్కాలు
అధిక బరువును తగ్గడం మరియు శరీరంలోని అధికంగా పేరుకొన్న క్రొవ్వులను బయటకు పంపించడమనేది రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ లు. ప్రజలు ప్రస్తుత రోజుల్లో ఆహారానికి విలువిలేని మరియు అధిక ఫ్యాట్ ఉన్న జంక్ ఫుడ్స్ కు బాగా అలవాటు పడ్డారు. జంక్ ఫుడ్ తో శరీరంలోనికి అధిక క్రొవ్వులతో పాటు టాక్సిన్స్ కూడా చేరుతాయి. ఈరెండింటితో అనేక ఆరోగ్య సమస్యలు, ఊబకాయం తలెత్తుతాయి. అయితే అధిక క్రొవ్వులు మరియు టాక్సిన్ శరీరం నుండి బయటకు నెట్టివేయాలంటే కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. ఎప్పుడైతే బరువు తగ్గడం మొదలు పెడుతారు. ఆటోమాటిక్ గా శరీరంలోని క్రొవ్వులు కరిగి, టాక్సిన్స్ బయటకు విసర్జింపబడుతాయి.
ఎప్పుడైతే శరీరం నుండి కల్మషాలను తొలగించుకోవాలనుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా మీ శరీరంలోపల శుభ్రపడాలి. అందుకే కొన్ని హోం రెమడీస్ డిటాక్స్ ఫుడ్స్ బాగా సహాయపడుతాయి. ఇది బరువును అతి త్వరగా తగ్గించడమే కాదు. శరీరంలోని అన్ని జీవక్రియలను శుభ్రం చేసి అదనంగా పేరుకొన్న క్రొవ్వులను, టాక్సిన్స్ ను బయటకు విసర్జింపబడుతుంది . ఆహారంతో పాటు కొన్ని ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని డ్రింక్స్ కూడా అధిక క్రొవ్వును సులభంగా కరిగిస్తాయి. శరీరాన్ని శుభ్రం చేయుటకు మరియు శరీరం ఫిట్ గా ఉండటానికి కొన్ని దశాబ్దాలుగా ఈ హోం రెమడీస్ ఉపయోగిస్తున్నారు .
అందులో కొన్ని మీకు తెలుసిన కొన్ని ఆహారాలు శరీరంలోని అధిక క్రొవ్వును తొలగిస్తుంది. ఉదా: గోరువెచ్చని నీటిలో తేనె మరియు నిమ్మరసం కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల శరీరంలోని క్రొవ్వులు సులభంగా తొలగిపోతాయి. ఇది చాలా సాధారణమైనటువంటి. అందూరికి అందుబాటులో ఉన్నటువంటి ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్. ఇటువంటి మరికొన్ని ఫ్యాట్ బర్నింగ్ హోం రెమడీస్ ఏంటో ఒకసారి చూద్దాం..

గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, వ్యాధినిరోధక శక్తిని అంధిస్తాయి. గ్రీన్ టీతో మంచి ఫలితాలను చూడదల్చుకుంటే గ్రీన్ టీలో పంచదార లేకుండా త్రాగగలిగితే తప్పనిసరిగా బెస్ట్ రిజల్ట్ మీరు చూడవచ్చు.

సొరకాయ జ్యూస్: బాటిల్ గార్డ్(సొరకాయ) మంచి హెల్తీ వెజిటేబుల్. సొరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతే కాదు ఈ ఫైబర్ రిచ్ డ్రింగ్ కొన్ని గంటల పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. అంతే కాదు ఈ డ్రింక్ నుండి జీరో ఫ్యాట్ శరీరారినికి అందుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్: బరువు తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తున్న విషయం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ బరువు తగ్గించే ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్ళలో లేదా జ్యూస్ లో వేసి బాగా మిక్స్ చేసి త్రాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

పార్ల్సే జ్యూస్: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్ ను తొలగించగల సామర్థ్యం గలది ఈ పార్ల్సే హెర్బ్. పార్ల్సే జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలోని క్రొవులను తొలగించి. శరీరం మొత్తాన్ని శుభ్రపరుస్తుంది. దాంతో శరీరంలోని టాక్సిన్స్ బటకు నెట్టివేయబడుతుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్: బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు క్రాన్ బెర్రీలో ఉండే విటమిన్ సి బరువు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక క్రొవ్వును కరిగించడానికి మరియు శరీరంలోని కల్మషాలను బయటకు పంపించడానికి ఈ క్రాన్ బెర్రీ జ్యూస్ కు కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ మిక్స్ చేసి త్రాగాలి.

మాప్లే సిరఫ్ మరియు నీళ్ళు: గోరువెచ్చని నీళ్ళలో మాప్లే సిరఫ్ వేసి బాగా మిక్స్ చేసి ఉదయాన్నే పరకడుపున త్రాగాలి . సెలబ్రెటీలు వారి శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవాడానికి ఈ మాప్లే సిరఫ్ ను ఎక్కువగా త్రాగుతుంటారు. అందుకే ఇది డిటాక్స్ డైట్ లో చేర్చబడింది. ఈ డ్రింక్ ను రోజులో ఏ ఒక్కపూటైనా భోజనం మానేసి త్రాగవచ్చు.

ఉడికించిన ఆపిల్: ఉడికించిన ఆపిల్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆఫిల్ ఫైబర్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారం. ఇంకా ఇందులో పుష్కలమమైనటువంటి ఐరన్ మరియు ఇతర పోషకాంశాలు అధికంగా ఉంటాయి. ఇది కూడా సులభంగా జీర్ణం అవుతుంది. మరియు కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది. శరీరం నుండి అధిక క్రొవ్వులు తొలగించుకోవాలనుకొనేవారు. అతి త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ఫ్రూట్స్ డైట్ ఫాలో అవ్వడం సులభమైన..అద్భుతమైన మార్గం.

డాండెలైన్ లియన్ టీ: డాండెలైన్ టీ మనకు అందుబాటులో ఉండే ఉత్తమ సహజ పానియం. ఇది శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని క్రొవ్వులను బయటకు పంపించడంతో పాటు కాలేయంలోని విషాలను తొలగించడానికి మరియు పిత్తం ఉత్పత్తి మరియు ఉధృతిని తొలగించిడానికి ఇది సహాయపడుతుంది.

మసాలాలతో అల్లం: కొంచెం తాజా అల్లం మరియు కేయాన్ పెప్పర్(మసాలాలను) నీటిలో వేగి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత త్రాగడం వల్ల శరీరంలో మలినాలు తొలగిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ మూలికలు సహజంగానే శరీరంలోని క్రొవ్వును కరిగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు ఇది ఊపిరితిత్తులను క్లియర్ గా ఉంచుతుంది. శ్వాసకు ఎటువంటి హానిలేకుండా కాపాడుతుంది.



Click it and Unblock the Notifications











