Latest Updates
-
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.! -
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే! -
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే! -
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.! -
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం! -
ఫిల్టర్స్, మేకప్‌తో పనే లేదు.. నేచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం యోగా సూత్రాలు.! -
కోయంబత్తూర్ అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా..పూరీ,ఇడ్లీ,చపాతీ,పలావ్ లోకి కేక!
యోగాను ఇష్టపడే 12 మంది సెలబ్రెటీలు..!
ఏ సెలెబ్రిటిని అయినా వారియొక్క కండరాల బిగువు మరియు సడలింపు ఎలా నిర్వహించగలుగుతున్నారు? అని అడిగినప్పుడు వారు " ఏమిలేదు. నాకు ఇష్టమైనది తింటాను మరియు నేను సహజంగానే ఇలా ఉంటాను." అని సమాధానమిస్తారు.
కాని ఈ సమాధానం సరి అయినదా? సహజంగానే కనపడతారు,కాని అలా కనపడటానికి దాని వెనుక ప్రత్యేక నిపుణుల బృందం కృషి మరియు ఫిట్నెస్ కోసం కఠినమైన నియమావళి గంటలతరబడి పాటించటం ఉన్నది. సహజంగా సెలెబ్రిటీలు ఎక్కువగా యోగా చేస్తుంటారు. ఇదివరలో యోగా అనేది ఆధ్యాత్మికంగా మరియు క్రమశిక్షణగా ఉండటంలో ఉపయోగపడుతుందని అందరికి తెలుసు, కాని దీని ద్వారా శారీరక లాభాలను కూడా పొందవొచ్చు. ఈరోజు మేము మీకు యోగా అంటే ఇష్టపడే యైదుగురు సెలేబ్రిటిలను మరియు వారు వారి శారీరక సౌందర్యాన్ని ఎలా యోగా ద్వారా కాపాడుకుంటున్నారో తెలుసుకుందాము.

సోనం కపూర్ ప్రతిరోజూ గొప్ప చమత్కార ఆరోగ్యకమైన బిక్రం యోగా సాధన చేస్తున్నది. " బిక్రం యోగా ఈరోజే ప్రారంభించు, ఇది ఈరోజున ప్రతిఒక్కరు హాట్ యోగా అని పిలుస్తున్నారు. మా డాడి ఫాబ్ గా కనపడటానికి ఇదే ఆయన రహస్యం." అని ఆమె రెండు నెలల క్రితం ట్వీట్ చేశారు.

అమెరికన్ యాక్ట్రెస్స్ మరియు ప్రొడ్యూసర్, మెగ్ రియాన్ ఇంటి వద్ద యోగా సాధన చేస్తున్నది. ఆమె దైనందిన జీవితంలో వివిధరకాల అంశాలను ఎడుర్కొనటంలో అంతర్గత బలాన్ని పుంజుకోవటంలో యోగా సాధన ద్వారా పొందే ఆధ్యాత్మిక భావన చాలా దోహదం చేస్తున్నదని ఆమె నమ్మకం. ఆమెకు సరిఅయిన మార్గం ఎంచుకోవటంలో మరియు జీవితంలో మౌనంగా, శాంతంగా ఉండటంలో చాలా సహాయపడుతున్నది.

యోగా ద్వారా మంచి శారీరక సౌందర్యాన్ని కలిగి ఉన్న బాలివుడ్ తార, శిల్పా శెట్టి. ఈమె 2008లో 'శిల్పా యొక్క యోగా' అనే CD విడుదల చేసింది. "యోగా నా మెదడు,శరీరం మరియు ఆత్మను ఫిట్ గా ఉంచుతుంది. నాకు నెక్ సమస్య ఉండేది మరియు భయంకరమైన స్పాన్దిలిటిస్ తో చాలా బాధపడుతుండేదాన్ని. అందువలన నేను యోగా సాధన ప్రారంభించాను. నేను నిపుణుల శిక్షణ తీసుకున్నాను మరియు దానివల్ల చాలా లాభం కలిగింది." అని ఆమె చెప్పారు.

కొంకణ సేన్, తన ఆకృతి సరిగా ఉంచుకోవటంలో యోగా వల్లనే సాధ్యపడిందని బాలివుడ్ తార అంటున్నారు.ఏక థి దయన్ సినిమాలో ఆమె ఒక క్రొత్త రూపంలో కనిపించారు. "నేను యోగా చేస్తాను. చాలాకాలం నుండి చేస్తున్నాను. అది చాలా సహాయపడుతున్నది." ఒక సందర్భంలో ఆమె చెప్పారు.

ఈ పాప్ దేవత యోగాను తన జీవనశైలిలో ఒక భాగంగా దత్తత తీసుకున్నది. ఈమెకు అష్టాంగ యోగా మరియు హఠ యోగా అన్నా చాలా ఇష్టం మరియు ఆమె జీవితంలో మెదడు మరియు ఆత్మను శాంతంగా ఉంచటంలో యోగా చాలా సహాయపడుతున్నది. యోగా చేయటం వలన ఆమె జీవనంలో కలిగే ఒత్తిడులను తట్టుకోగలిగే శక్తిని పొందగలుగుతున్నారని ఆమె నమ్ముతారు.

బాలివుడ్ బ్యూటీ, తల్లి, లారా దత్తా ప్రెగ్నెన్సీ తరువాత తిరిగి శరీర ఆకారం సరిగా పొందటంలో స్త్రీలకూ సహాయపడే ఒక యోగా DVD ని విడుదల చేసింది.ఆమె కూతురు,సైరాకు జన్మ ఇచ్చినతరువాత తిరిగి ఆమె సరిఅయిన శరీర ఆకారాన్ని పొందటంలో యోగా చాలా సహాయపడిందని, కఠినమైన నియమావళి మరియు వ్యాయామం కూడా సహాయం చేసిందని ఆమె చెప్పారు.

ఈ అమెరికన్ నటి, ఒక వారం లో కనీసం 5 సెషన్లు యోగా సాధన చేస్తుంది. ఆమెకు ఒత్తిడి నుండి విరామం పొందటానికి మరియు శరీర పటుత్వం పొందటానికి యోగా సహాయపడింది. ఇంకా ఆమెకు అనుకూలమైన ఆలోచనలు రావటానికి మరియు పొగ త్రాగటం వంటి అలవాట్ల నుండి దూరం కావటానికి యోగా సహాయపడింది. అనిస్టన్ ప్రకారం, విశ్రాంతి పొందటానికి యోగా ఒక గొప్ప మార్గం.

ప్రపంచంలో మిలియన్ల ప్రజల గుండెలను దోచుకునే మార్టిన్ యోగా వలన అంతర్గత ప్రశాంతతను పొందుతున్నానని చెపుతున్నారు. ఈయనకు ప్రత్యేకంగా హఠ యోగా అంటే చాలా అభిమానం మరియు ఈయన యోగా వ్యాయామాలు చేస్తుంటారు. ఈయన "నా గుండె, మెదడు మరియు శరీరం స్థిరత్వాన్ని సాధించడానికి యోగా దోహదపడింది." అని చెపుతుంటారు.

కంగనా రనవాట్, మరొక యోగా శక్తికి అభిమాని. సెక్సీ పడుచు,వాడాలాలో అవతార్ ఆమె షూట్ అవుట్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నది. "నేను క్రమం తప్పకుండా యోగా చేస్తాను మరియు సమతుల్య ఆహారం తింటాను." అని ఆమె అంటారు.

"నేను పూర్తిగా యోగాలో ఉన్నాను. యోగా నా జీవితాన్ని మార్చివేసింది. ప్రతిరోజూ ఉదయం గంటన్నర యోగా సాధన చేయటం వలన, నాకు ఆరోజంతా సక్రమంగా గడుస్తుంది. ఏ రోజైతే నేను యోగా చేయనో, ఆ రోజు నాకు సరిగా గడవదు మరియు నేను ఏ పనిని పూర్తి చేయను." అని కరీన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

అమెరికా యొక్క టాప్ మోడల్, యోగా యొక్క అత్యంత విశ్వాసకులలో ప్రముఖులలో ఒకరు. భారత విధానాల్లో గొప్ప నమ్మకాన్ని ఉంచిన ఆమెకు వాస్తు మరియు ఆయుర్వేదం జీవితంలో స్థానం కల్పించటం అంటే ఇష్టం.యోగా యొక్క ఆధ్యాత్మిక,శారీరక మరియు మానసిక సహాయం పట్ల ఆమెకు యెనలేని నమ్మకం. ఆమె, 18 సంవత్సరాల వయస్సు నుండి యోగా తరగతుల శిక్షణ తీసుకుంటున్నారు.

నటి రాణి ముఖర్జీ ప్రతి రోజు యోగా రెండు గంటల సాధన ద్వారా ఒక చిత్రం కోసం ఆమె శరీరం అదనపు కిలోల బరువును కోల్పోయారు మరియు శరీరాకృతిని పొందారు. "నేను యోగా మరియు బరువు శిక్షణను కలిపి చేశాను, ఇలా చేయటం నా శరీరానికి చాలా ఉపయోగపడింది." అని ఈ నటి తెలిపారు.



Click it and Unblock the Notifications