పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ బాడీ ఫిట్ నెస్ సీక్రెట్స్!

By Super

సల్మాన్ ఖాన్, హ్రితిక్ రోషన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్, ఆమిర్ ఖాన్ వంటి అత్యంత ప్రసిద్ధ బాలీవుడ్ నటులు వారి శరీరంపై మంచి శ్రద్ధ తీసుకుంటారు. వారు వారి వయసుకంటే తక్కువ వయసువారిగా కనిపించడానికి కారణం ఇదే అయిఉ౦డవచ్చు.

మీరు వారి దైనందిన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుకుంటే, అవి ఇక్కడ ఉన్నాయి. వ్యాయామాలు, కార్యక్రమాలతో ఎలా ఈ నటులు వారి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకు౦టున్నారో తెలుసుకుందాం.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

సల్మాన్ ఖాన్: సల్మాన్ ఖాన్ మంచి కండలు కలిగిఉంటాడు. సల్మాన్ కార్డియో వాస్కులర్ వ్యాయామాలు బాగా చేస్తారు, కండరాలను కుదురుగా ఉంచుకోవడానికి వ్యాయామాలు చేస్తారు. ఆతను ప్రతిరోజూ దాదాపు 10 కిలోమీటర్లు సైకిల్ కూడా తోక్కుతాడని చెప్తారు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

హ్రితిక్ రోషన్: హ్రితిక్ రోషన్ అద్భుతమైన శరీర సౌష్ఠవం, చక్కటి భుజాలు, కండరాలు కలిగిఉంటాడు. చెక్కుచెదరని శరీరం కోసం, హ్రితిక్ రోషన్ కార్డియో వాస్కులర్ వ్యాయామం, సరైన ఆహరం తోపాటు వారానికి నాలుగుసార్లు శిక్షణ తీసుకుంటాడు. ఆతను నెయ్యి, వెన్న, నూనె మానేసి, ఎక్కువ నీరు తాగుతాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

అక్షయ్ కుమార్: అక్షయ్ కుమార్ సన్నగా, ఆరోగ్యంగా, కుదురైన శరీరాన్ని కలిగిఉంటాడు. ఆతను వారంలో మూడురోజులు బాస్కెట్ బాల్ ఆడతాడు, ఆరోగ్యంగా ఉండడానికి 10 మైళ్ళు పరుగెడతాడు కూడా. శక్తిని పెంచుకోవడానికి నడక, పర్వతారోహణ కూడా చేస్తాడు. చాలా పళ్ళు, కూరగాయలతో ఇంట్లో వండిన ఆహారం తింటాడు, ఉప్పు తగ్గిస్తాడు. ధ్యానం కూడా చేస్తాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

షారుఖ్ ఖాన్ : ఓం శాంతి ఓం తీర్చిదిద్దినట్టుండే షారుఖ్ సిక్స్ పాక్ ను ఎవరు మాత్రం మరచిపోగలరు ? షారుఖ్ సహనం కోసం చాలా శిక్షణ తీసుకుంటాడు, వెయిట్ లిఫ్టింగ్, కార్డియో వాస్కులర్ వ్యాయామాలు చేస్తాడు. అతను బెల్లీ డాన్సింగ్ కూడా చెస్తాడు. ఆరోగ్యకరంగా ఉండే ఆహారమే తీసుకుంటాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

జాన్ అబ్రహాం : శాకాహారి అయిన జాన్ అభ్రహాం కండరాలు బాగుంటాయి. అతను కార్డియో వాస్కులర్, బరువు శిక్షణ మార్చి మార్చి చేస్తూ కండరాల మీద దృష్టి వుంచుతాడు. రోజు 2-3 గంటలు వ్యాయామం చేస్తాడు, వెయిట్ లిఫ్టింగ్, కిక్ బాక్సింగ్ కూడా దాంట్లో భాగంగా చేస్తాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

అర్జున్ రాంపాల్: అర్జున్ రాంపాల్ కి ప్రత్యేకమైన దినచర్య ఏమీలేదు. అయితే, ఇతను బరువులో శిక్షణ, రన్నింగ్, స్విమ్మింగ్ లేదా కరాటే తోపాటు వారానికి 5 రోజులు కొన్ని రకాల వ్యాయామాలు చేస్తాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

సునీల్ శెట్టి: సునీల్ శెట్టి మహారాజుల ఫలహారాన్ని, యువరాజుల భోజనాన్ని, పేదవాడి లాగా డిన్నర్ ని తీసుకుంటాడు. అయితే, అతను సరైన ఆహారాన్ని తిని, పని బాగా చేయాలనీ నమ్ముతాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

ఆమిర్ ఖాన్: ఘజిని సినిమాలో ఆమిర్ ఖాన్ 8 పాక్ ని ఎవరైనా ఎలా మర్చిపోతారు? కానీ అతను కఠినమైన వ్యాయామం కోసం రోజుకు 4 గంటలు కేటాయించి 13 నెలలలో సాధించాడని మీకు తెలుసా.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

షాహిద్ కపూర్: షాహిద్ కపూర్ ప్రతిరోజూ కనీసం 15 నిముషాలు ట్రెడ్మిల్ పై వ్యాయామం చేస్తాడు, శరీరం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

రన్బీర్ కపూర్: ఇతను జిమ్ వద్ద వారంలో ఆరు రోజులు షుమారు 45 నిముషాల నించి గంట దాకా, 15 నిముషాలు వ్యాయామ౦ చేస్తాడు. ఈ నటుడి కార్యకలాపాల గురించి ప్రదీప్ వివరిస్తున్నాడు. "రన్బీర్ హార్డ్ కోర్ జిమ్మింగ్ చేస్తాడు, అతను స్విమ్మింగ్ లేదా యోగా అంటే అంతగా ఇష్టపడడు. అతను తన చాతీ, వెనుక భాగానికి పనిచేయడానికి ఇష్టపడతాడు, కాళ్ళతో పనిచేసేటపుడు నొప్పి ఉంటే బాధపడతాడు. అతను పనిచేసేటపుడు సంగీతం వినడానికి ఇష్టపడతాడు. ప్రాక్టీసు కోసం 5 నుంచి 10 నిమిషాల పాటు కార్డియో వ్యాయామం చేస్తాడు. రన్బీర్ ఛాతీ, వెన్నెముక, భుజాలు, కాళ్ళు, చేతులు ఇలా ఒక్కోరోజు ఒక్కో దానిమీద ధ్యాస పెడతాడు, అపుడపుడు కిక్ బాక్సింగ్ కూడా చేస్తాడు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

ఇమ్రాన్ హాష్మి: ఫిట్నెస్ పిచ్చోడు కానప్పటికీ, ఇతనుకూడా తన శరీరాకృతిని కాపాడుకోవడానికి వారానికి నాలుగైదు రోజులు వ్యాయామం చేస్తాడు. కండలు తిరిగి ఉండే కన్నా ఆరోగ్యంగా ;ఉండడం మంచిదని అనుకుంటాడు. అయితే, తెరమీద పోషిస్తున్న పాత్రకోసం తరాలు ఒక్కోసారి వారి శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంటుంది. వరుసగా రెండు రోజులు వ్యాయామం చేసి ఒకరోజు విశ్రాంతి ఇస్తాడు, ఇదేపధ్ధతి పునరావృతం చేస్తాడు. వారానికి ఒకటి రెండు సార్లు ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేస్తాడు. బలానికి శిక్షణ కార్డియో, బారువుల తో కలిపి రోజుకు ఒక గంట ఇమ్రాన్ వ్యాయామం చేస్తాడు. ఈయన ఆరోగ్య రహస్య౦ చాలా తేలిక - బాగా తినడం, విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఇదే అతను ఖచ్చితంగా చేసేది. తన శరీరాన్ని హుషారుగా, ఫ్రెష్ గా ఉంచుకోవడానికి అతను ప్రతిరోజూ ఏడుగంటలు నిద్రపోతాడు, అతను ఆరోగ్యంగా ఉండడానికి క్రమశిక్షణతో ఉంటాడని దీనివల్ల తెలుసుకోవచ్చు.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ ఫిట్ నెస్ సీక్రెట్స్

సైఫ్ అలీ ఖాన్: సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంగా, హుషారుగా ఉండడానికి ప్రతిరోజూ 2 గంటలు వ్యాయామం చేస్తాడు. ముందు కార్డియో వ్యాయామం చేసి, తరువాత యోగా కూడా చేస్తాడు. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండడానికి అతను రోజూ పవర్ యోగా కూడా చేస్తాడు. కండరాల పుష్టి కోసం రోజూ కార్డియో వ్యాయామం, వైట్ లిఫ్టింగ్ చేస్తాడు. శరీరాకృతి కాపాడుకోవడానికి కిక్ బాక్సింగ్ కూడా సాధన చేస్తాడు.

Desktop Bottom Promotion