ఒత్తిడి అరికట్టేందుకు ఉత్తమ మార్గం అల్పాహారం

By Lakshmi Perumalla

ఈ రోజుల్లో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా ఉన్నది. ప్రస్తుతం ఒత్తిడి వలన మానసిక మరియు శారీరక సమస్యలు వచ్చి తద్వారా అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ఈ వ్యాధులు అధిక శ్రమ, డిస్టర్బ్ జీవనశైలి మరియు అనారోగ్య ఆహార అలవాట్ల వలన వస్తాయి. కొన్ని కారణాల వలన రక్తపోటు, శారీరక మరియు మానసిక వైకల్యాలకు మరియు ఉద్వేగభరితమైన వైఫల్యాలకు దారితీస్తాయి. ఒత్తిడి అనేది అనేక మందికి ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. దానిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేలా సంరక్షణ తీసుకోవాలి.

ఒత్తిడి మరియు సంబంధిత సమస్యలను అరికట్టేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. అటువంటి పద్ధతిలో అల్పాహారం ఒకటిగా ఉంది. మీరు తిన్న తర్వాత ఒత్తిడిని పోలిస్తే తక్కువ అనుభూతి మరియు తక్కువ సమయం ఉంటుంది. అల్పాహార మార్పిడి ఒత్తిడి అరికట్టేందుకు ఉత్తమ మార్గాలలో ఒకటి. ముఖ్యంగా తీపి అల్పాహారాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పబడింది. ఇది కొంతమందికి నమ్మకం లేనప్పటికీ నిరూపితమైంది. అల్పాహారం అనేది ఒత్తిడిని అరికట్టేందుకు ఉత్తమ పద్ధతి అని నిరూపించే కొన్ని కారణాలు క్రింద చర్చించబడ్డాయి.

 snacking

1. హార్మోన్లు
మనకు టెన్షన్,పని భారం,ఒత్తిడి మరియు బాధ కలిగినప్పుడు మన శరీరంలో కొన్ని ఒత్తిడి కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ సమయంలో మన శరీరంలో ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. అప్పుడు మన శరీరంనకు శక్తి లేక అలసటతో కూడిన అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో ఒత్తిడి అరికట్టేందుకు స్వీట్ స్నాక్స్ తినటం ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. స్వీట్ స్నాక్స్ ఒత్తిడి సంబంధిత హార్మోన్ల ఉత్పత్తి మరియు వేగాన్ని తగ్గిస్తాయి. అప్పుడు తక్కువ హార్మోన్ల ఒత్తిడి ఉంటుంది.

2. ఆరోగ్యవంతమైన ఆహారాలు

అల్పాహారం అనేది ఒత్తిడి తగ్గించటానికి కేవలం ఒక మార్గం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన మార్గంగా చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాలు తినటం వలన ఒత్తిడిని తగ్గించవచ్చు. ఒత్తిడి తగ్గించటానికి ఆరోగ్యకరమైన ఆహారాలలో పండ్లు,బెర్రీలు,డార్క్ చాక్లెట్,పాల ఉత్పత్తులు మొదలైనవి ఉన్నాయి. ఈ ఆహారాలు ఒత్తిడి సంబంధిత రుగ్మతలను తగ్గిస్తాయి.

3. ప్రశాంతత

అల్పాహారం ఒత్తిడి అరికట్టేందుకు ఉత్తమ పద్ధతులలో ఒకటి. ఇది ఒత్తిడిని తగ్గించటమే కాకుండా మెదడు మరియు శరీరం ద్వారా వెళ్ళే ఆందోళనలను తగ్గిస్తుంది. ఇది మీ మెదడు విశ్రాంతి మరియు ఉపశమనానికి చాలా అవసరం. దురదృష్టవశాత్తు కొన్ని సార్లు మెదడుకు విశ్రాంతి లేకుండా ఒత్తిడికి గురి అవుతుంది. అందువల్ల అల్పాహారం మనస్సుకు తేలికపాటి అనుభూతిని కలిగిస్తుంది.

4. జీవక్రియను మెరుగుపరుస్తుంది
ఒత్తిడి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వలన జీవక్రియను మెరుగుదల లేదా లేదా ఒత్తిడి హార్మోన్ల కారణంగా నిదానం అవుతుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్ తినటం వలన బ్రేక్ డౌన్ నుండి తిరిగి శరీరం తన శరీర విధులను చేయటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మంచి ఆహారాలు శరీరంలో పోషక విలువలు మరియు ఖనిజ కంటెంట్ అభివృద్ధి మరియు శక్తి పెంచడానికి సహాయపడి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏది ఏమైనా మొత్తంమీద ఒత్తిడి సమయాల్లో చిరుతిండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

5. మూడ్ ఎలివేటర్లు

ఒత్తిడికి చెడు మూడ్స్ బాధ్యత వహిస్తాయి. ఇది మానసికంగా తక్కువ నిరాశ అనుభూతిని కలిగిస్తుంది. ఒత్తిడి కొన్నిసార్లు పెరిగినట్లు అనిపించవచ్చు. అటువంటి సమయాల్లో డార్క్ చాక్లెట్ వంటి గొప్ప మానసిక ఎలివేటర్లు ఉన్నాయి. అవి ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గించడం ద్వారా ఆహ్లాదకరమైన మూడ్స్ ను ఇస్తాయి. మీరు తక్కువ నిరాశ అనుభూతి ఉన్నప్పుడు మూడ్ ఎలివేటర్లను ఉపయోగించవచ్చు. కొన్ని ఆహారాలు వలన మానసిక మరియు శక్తి స్థాయిలను మార్చడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. అందుచేత అల్పాహారం ఒత్తిడి అరికట్టేందుకు ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు.

పైన చెప్పిన కారణాలు కేవలం అల్పాహారం మాత్రమే ఒత్తిడి అరికట్టేందుకు ఉత్తమ మార్గం అని చెప్పాయి. కానీ ఒత్తిడిని అరికట్టేందుకు పుస్తకాలు చదవడం,కొంచెం సేపు నిద్ర, ప్రశాంతముగా సంగీతం వినటం, సరదాగా బయటకు వెళ్ళటం వంటివి ఇతర మార్గాలుగా ఉన్నాయి. సమస్యలను పంచుకోవడం మరియు ఇతరులతో మాట్లాడటం వంటి వాటి వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఈ కొన్ని చిట్కాలు మీ ఒత్తిడిని తగ్గించేందుకు సహాయం చేస్తాయని ఆశిస్తున్నాము. ఆరోగ్యవంతమైన అల్పాహారం ఖచ్చితంగా ఇతర పద్దతులతో పాటుగా సహాయం చేస్తుందని చెప్పవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, November 26, 2013, 4:01 [IST]
Desktop Bottom Promotion