Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఈ ఎఫెక్టివ్ ట్రిక్స్ అనుసరిస్తే.. నో స్టొమక్, బాడీ స్లిమ్..!
చాలా మంది స్లిమ్ గా ఉండాలని కోరుకుంటారు. అందులో మీరూ ఒక్కరైతే మీ శరీరంలో నిల్వ ఉన్న అధనపు కొవ్వు నిల్వలను కరిగించుకొని, బరువు తగ్గించుకోవడానికి వర్క్ అవుట్స్ (వ్యాయామాలు)చేయాల్సి ఉంటుంది. కానీ, వీటితో పాటు ఒక కఠినమైన న్యూట్రీషియన్ మరియు హెల్తీ డైట్ ను ఫాలో అయినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. కొవ్వు కరిగించి, బరువు తగ్గించి మిమ్మల్ని స్లిమ్ గా మార్చేందుకు సహాయపడే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ చాలా ఉన్నాయి.
మీకు బిగువైపోయిన పాత జీన్స్ మరియు టాప్ లు, మీకు ఇక్కువగా ఇష్టమైయ్యే డ్రెస్లు వేసుకోవాలంటే, అందుకు ఫ్లాట్ బెల్లీ(సాదా పొట్ట)పొందాలి. అందుకు మీరు కొన్ని ట్రిక్స్ అనుసరిస్తే మీకు అలాంటి స్లిమ్ బాడీతో పాటు, ప్లాట్ బెల్లీ మీ సొంతం అవుతుంది. ప్లాట్ బెల్లీ పొందడానికి కొన్ని ప్రభావంతమైన ట్రిక్స్ ఉన్నాయి. మరియు మీరు ట్రెండింగ్ క్రాప్ టాప్స్ , నడుము వరకూ వచ్చే విస్ట్ స్కర్ట్, స్కిన్నీ జీన్స్ మరియు బాడీకాన్ డ్రెస్సులు ధరించాలని మీరు కళలు కంటుంటే ఈ ట్రిక్స్ పాటించక తప్పదు.
ప్లాట్ బెల్లీ పొందుటకు ట్రిక్స్ పాలో అవ్వడం చాలా సులభం. ఉదాహరణకు: ఒక్కేసారి, ఎక్కువ మోతాదులు ఆహారాన్ని, కానీ లేదా ఏదైనా పదార్థాన్ని కానీ తీసుకోవడం కంటే మద్య మద్యలో గ్యాప్ ఇస్తూ కొద్దిగా కొద్దిగా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కొన్ని వండర్స్ జరగవచ్చు ఇది ఒక బెస్ట్ ట్రిక్! ఇదే కానీ, లేదా ఏ ఇతర ట్రిక్స్ కానీ అంత బాధాకరమైనవి కాదు. చాలా సింపుల్ గా ఉన్నా, ఎఫెక్టివ్స్ గా పనిచేసే ఈ ట్రిక్స్ అనుసరించడం వల్ల తక్షణమే ఫ్లాట్ బెల్లీని పొందవచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఒకసారి చూద్దామా....

3pm స్నాక్:
ప్లాట్ బెల్లీని సులభంగా పొందడంలో ఇది ఒక ముఖ్యమైన ప్రభావవంతమైన ట్రిక్. మద్యహ్నం 3గంటల సమయలో ప్రోటీన్ స్నాక్ అంటే లో ఫ్యాట్ చీజ్ లేదా ప్రోటీన్ బార్ వంటివి తీసుకోవడం ఆరోగ్యకరం. శరీరంలో తగ్గిపోయే షుగర్ లెవల్స్ ను నిరోధిస్తాయి. షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు, ఆటోమాటిక్ గా ఇన్సులిన్ లెవల్ తగ్గిపోతుంది. క్రమంగా శరీరంలో కొవ్వు నిల్వలు మొదలవుతుంది. కాబట్టి, మద్యహ్నాం 3గంటల సమయంలో స్నాక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

ab క్రంచెస్:
ఫ్లాట్ బెల్లీ పొందాలంటే, ఈ ట్రిక్ తప్పనిసరిగా ప్రయత్నించాలి. ab క్రంచెస్ వల్ల పొట్టదగ్గర పేరుకుపోయిన క్రొవ్వు నిల్వలను బర్న్ చేయడానికి చాలా సులభంగా సహాయపడుతుంది.

షుగర్ ఫ్రీ:
ఫ్లాట్ బెల్లీ పొందాలంటే, ఈ దీర్ఘకాల ట్రిక్ ను అనుసరించాల్సిందే. తక్కువ షుగర్ ఉపయోగించడం వల్ల కొవ్వు, ఎనర్జీ రూపంలోకి మార్చే గ్లుకగాన్ పెంపొందించడంలో బాగా సహాయపడుతుంది.

ఆహారం మెత్తబడేవరకూ బాగా నమిలి తినాలి:
బరువు తగ్గడంలో ఇదొక ట్రిక్. తినే ఆహారం ఏదైనా సరే బాగా నమిలి తినడం, ఎక్కువసారల్లు నమలడం వల్ల, బెల్లీ దగ్గర నిల్వ ఉన్న కొవ్వు నిల్వలను బర్న్ చేసేందుకు ఇది బాగా సహాయపడుతుంది. దాంతో కడుపు ఉబ్బరంగా అనిపించదు మరియు మీకు కడుపు నిండుగా ఉందన్న అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల మీరు తక్కువగా తినగలుగుతారు. దాంతో ఫ్లాట్ బెల్లి పొందగలుగుతారు.

డాన్స్:
శరీరంలో కొవ్వు నిల్వలు వేగవంతంగా కరిగిపోవాలంటే ఒక పెద్ద మ్యూజిక్ పెట్టుకొని, మీకు ఇష్టమైన మ్యూజిక్ తో మీ శరీరాన్ని మీ ఇష్టం వచ్చినట్లు షేక్ చేయాలి. అంటే డ్యాన్స్ చేయాలి. ఇది మీరు ఒక ఆకారం పొందుటకు సహాయపడుతుంది. మరియు మీ శరీరం మొత్తం ఆరోగ్యానికి మేలు చేసే హృదయ స్పందన రేటు మరియు రక్త ప్రసరణ పెరుగుతుంది.

చిన్న మోతాదలో (తక్కువగా):
మీరు తీసుకొనే ఆహారం చాలా ముఖ్యం. ఎందుకంటే. మంచి ఆకారం పొందడం కోసం మీరు తినే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం ఒక బెస్ట్ ట్రిక్.

మీరు ఏం తింటారు అనేది కూడా ప్రధానమే:
ఇది నిజం!మీరు ఫ్లాట్ బెల్లీ పొందాలనుకుంటే, మీరు ఖచ్చితంగా ఫ్రైడ్ మరియు జంక్ ఫుడ్స్ ను తినకూడదు. ఉడికించిన ఆహారాలు అంటే ఆకుకూరలు, కీరదోసకాయ మరియు టమోటో, ధాన్యాలు వంటి న్యూట్రీషియన్ ఫుడ్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

వేడినీళ్ళు-నిమ్మరసం:
మీరు బరువు తగ్గాలన్నా మరియు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలన్నా, నిమ్మరసం కలిపిని వేడినీళ్ళను తాగాలి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కొన్ని వండర్స్ ను క్రియేట్ చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నిల్వలను కరిగించడంతో పాటు, శరీరంలోని మలినాలు, వ్యర్థాలను తొలగిస్తుంది.

బీరు తాగడం మానుకోండి:
మీ బద్ద శత్రువు బీర్. ఫ్లాట్ బెల్లీ పొందాలంటే, బీర్ తాగడం మానేయాల్సిందే. బీర్ కూడా ఒక ఫ్యాటింగ్ డ్రింక్. ఇది బెల్లీ ఫ్యాట్ కు ప్రధానం కారణం అవుతుంది.

బెర్రీస్ తినాలి:
బెర్రీస్ లో చాలా రకాలున్నాయి. అందులో ముఖ్యంగా బ్లూ బెర్రీస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల సహజంగానే ఫ్లాట్ బెల్లీని పొందవచ్చు.

ఆకారానికి తగ్గట్టు ధరించడం:
ఫ్లాట్ బెల్లీ పొందడానికి, ఇది ఒక స్మార్ట్ మరియు తక్షణ ప్రభావవంతమైన ట్రిక్. అండర్ గార్మెంట్ దుస్తులు ధరించడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను కనబడనియ్యకుండా చేస్తుంది. నడుము ఆకారం కనబడాలంటే కోర్ సెట్ ధరించాలి.

సంతోషంగా ఉండాలి:
బరువు పెరుగుటకు డిప్రెషన్ కూడా ఒక ప్రధాన కారణం. అందుకు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. పెద్దగా నవ్వాలి. దాంతో శరీరంలోని కొవ్వు కరిగా మీ శరీరంను ఫిట్ గా ఉంచతుంది.



Click it and Unblock the Notifications
