Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి
బరువు తగ్గేందుకు 5 సింపుల్ అండ్ నేచురల్ టిప్స్
చాలా మంది కొంచెం లావు అయితే చాలు అయ్యే చాలా లావు అయిపోయాను అని హైరానా పడిపోతూ బరువు తగ్గడానికి చిట్కాలను వెదుకుతారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..?శరీరం నాజుగ్గా ఉంచుకోడం కోసం కొంత మంది ప్రయత్నిస్తే మరి కొంత మంది ఆరోగ్యం కోసమంటారు. మరికొంత మంది సెక్సీగా కనబడటానికి అంటారు. ఏదైమైన వయస్సుకు మిచ్చిన బరువు ఉండటం ఇలా శరీరానికే కాకుండా అలా ఆరోగ్యానికి కూడా హానికరమే. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి గంటల తరబడి జిమ్ కెలుతుంటారు.
జిమ్ కి వెళ్లి నానా తంటాలు పడి ఫ్యాట్ బర్న్ గి చేయాలను కొంటారు. అయితే అందువల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కొవ్వును కరిగించడం జరుగుతుంది. అయితే దాని వల్ల శరీరంలో ఒకే సారి కొన్ని జీవక్రియలపై ప్రభావం చూపెడుతుంది. శరీరంలోని మినరల్స్ తగ్గిపోతాయి. శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి జిమ్ కు వెళ్ళకుండానే జీర్ణక్రియ ద్వారా మీ శరీర సామర్థాన్ని పెంచుకోవడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వ్యాయామంతోపాటు..పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడచక్కని రూపం మన సొంతమవుతుంది.

నీళ్ళు:
సాధారణంగా డ్రింక్స్ అంటే మీరు ఎక్కువగా పంచదార కలపిన జ్యూసులు, సోడా మరియు ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల పూర్తిగా వాటి మీద ఆధారపడుతారు. దాంతో శరీరంలో అధనంగా మరి కొంత కొవ్వు ఏర్పడుతుంది. అలా కాకుండా నీళ్ళను ఎక్కువగా సేవించడం మంచిది. నీరు తాగడము వల్ల సైడు ఎఫెక్ట్సు ఉండవు . ఎక్కువగా తాగితే మూత్రపిండాలకు శ్రమ ఎక్కువవుతుంది. తక్తం లొని సోడియం నిల్వలు పల్చబడతాయి. అందువలన ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు . దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి. అన్నింటి కి దివ్య ఔషధం నీరు .శరీరములో జరిగే మెటబాలిక్ చర్యల్కు నీరు అతిముఖ్యము . చాలా మందికి తెలియకునా నీరు , నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరి చేరవు . శరీరము లొ రక్తం కి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది . మానవ శరీరము లోని ద్రవ పదార్ధాల సమ్మేళనానికి , విటమిన్లు , మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడం లో నీరు భూమిక వహిస్తుంది . నీటిలో క్లోరిన్ , ఇయోడి్న్ , ఆక్షిజన్ వంటి వాయువులు సమపాళ్ళ లో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యం గానే ఉంటాడు .

గ్రీన్ టీ:
అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమ కాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్ టీ (తేయాకు). అంతేకాదు గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉన్నదంటున్నారు. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి హృద్రోగాలను దూరం చేస్తుంది.

తేనె:
పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.

మొలకెత్తిన పెసలు:
వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ లో బనానా(అరటిపండు)తప్పని సరి:
ప్రతిరోజూ ఉదయం తీసుకొనే అల్పాహారంతో పాటు ఒక అరటి పండును తినడం చాలా మంచిది. డైట్ లో ఐరన్ కంటెంట్ తప్పనిసరి: ఫ్యాట్ బర్నింగ్ టిప్స్ లో ఐరన్ కలిగినటువంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.



Click it and Unblock the Notifications