Latest Updates
-
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు!
బరువు తగ్గించేందుకు సహాయపడే సమ్మర్ ఫ్రూట్స్
సాధారణంగా సీజన్ బట్టి, పండ్లు, కూరగాయలు మారుతుంటాయి. మన శరీరంలో మార్పులకు అనుగుణంగా ఆయా సీజన్లలో లభ్యం అయ్యే పండ్లు, కూరగాయలను తీసుకోవడం చాలా అవసరం. ఆయా సీజన్లలో వాతావరణానికి తగ్గట్టు మన శరీరం సహకరించడానికి తప్పకుండా ఆయా సీజన్లలో దొరికే పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను తీసుకోవడం ద్వారా, ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతే కాదు, కొన్ని రకాల కూరగాయలు, పండ్లు బరువు తగ్గడానికి ఎక్కువగా సహాయపడుతాయి. ఇతర సీజన్లలో కంటే వేసవిలో కాలంలో బరువు తగ్గించుకోవడం చాలా సులభం మరియు తేలిక కూడా. వేసవి కాలంలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల కూడా శరీరానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.
వేసవికాలంలో అందుబాటులో ఉండే పండ్లలో ఎక్కువగా విటమిన్స్ మరియు ప్రోటీనులు అధికంగా ఉండే మీలో శక్తిని పెంచుతాయి. ఇవి జిమ్ లో పాల్గొన్నప్పుడు కోల్పోయే బరువు కంటే, పండ్ల ద్వారా మరింత ఎక్కువ బరువు కోల్పోవడానికి సహాయపడుతాయి. సంవత్సరంలో ఇది ఒక బెస్ట్ సీజన్ ఈ సీజన్ లో రుచికరమైన హెల్తీ స్ట్రాబెర్రీలు మరియు ఆరెంజ్ లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఇవి ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు, రుచికరమైన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా గొప్పగా సహాయపడుటతో పాటు, బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.
ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్.:క్లిక్ చేయండి
మరి ఈ వేసవి కాలంలో రుచికరమైన పండ్లు, పండ్ల రసాలతో ఎంజాయ్ చేయడంతో పాటు కొన్ని పౌండ్లను బరువు తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని సమ్మర్ ఫ్రూట్స్ ఉన్నాయి. వీటిని పరిశీలించి మీ రెగ్యులర్ డైట్ లో తప్పక చేర్చుకోవాలి...

స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీస్ ఒక ఉత్తమ సమ్మర్ ఫ్రూట్. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి, పొటాషియం, ఫొల్లెట్, మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది.

ఆరెంజె
ఈ జ్యూసీ సమ్మర్ ఫ్రూట్ , సమ్మర్ సీజన్ కు చాలా ఉత్తమమైనవి. బరువు తగ్గడంలో ఇవి ఎలా సహాయపడుతాయో తెలుసుకుంటే, మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఆరెంజ్ కేవలం 80శాతం క్యాలరీలను కలిగి ఉండి మీ పొట్టను ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. మరియు ఇది సమ్మర్ లో శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది.

రాస్బెర్రీస్
రాస్బెర్రీస్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. బెర్రీ కుటుంబానికి చెందిన ఈ పండ్లలో 60క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ' మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ లో ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో అటువంటి వారికి ఇవి చాలా అసవరం.

పీచెస్
బరువు తగ్గాలనే దృడనిశ్చయం ఉన్నప్పుడు, వేసవిలో దొరికే ఈ పీచెస్ ఎక్స్ ట్రా బరువు తగ్గించడానికి అద్బుతంగా సహాయపడుతాయి. పీచెస్ లో 60 క్యాలరీలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, సమ్మర్ లో బరువు చాలా తేలికగా తగ్గించుకోవచ్చు.

వాటర్ మెలోన్
కర్భూజ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. వేసవిలో విరిగా అందుబాటులో ఉండే ఈ సమ్మర్ ఫ్రూట్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని బరువు తగ్గించుకోండి. 90శాతం నీరు ఉండే ఈ సమ్మర్ ఫ్రూట్ ఆకలిని దూరంగా ఉంచుతుంది. అధికంగా క్యాలరీలను తగ్గిస్తుంది.

మామిడి
మామిడిపండులో అధిక క్యాలరీలుంటాయి. వేసవిలో అందుబాటులో ఉండే ఈ సమ్మర్ ఫ్రూట్ బరువు తగ్గించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతాయి . ఇది శరీరంలోని కొవ్వును మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కరిగిస్తుంది. ఇది ఒబేసిటి మరియు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

ద్రాక్ష
ఫైబర్ అధికంగా ఉన్న సమ్మర్ ఫ్రూట్స్ లో నల్ల ద్రాక్ష ఒకటి. శరీరంలో అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడే వాటిలో నల్లద్రాక్ష కూడా ఎక్కువగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications