Latest Updates
-
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు
World Obesity Day 2023: స్థూలకాయం(ఒబేసిటీ) తగ్గించే బెస్ట్ హోం రెమిడీస్
World Obesity Day 2023: స్థూలకాయం(ఒబేసిటీ) తగ్గించే బెస్ట్ హోం రెమిడీస్
స్తూలకాయం అంటే ఒక వ్యక్తి యొక్క అధిక బరువు మరియు కొవ్వు కలిగి ఉండే పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి యొక్క స్థూలకాయంను బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా కొలుస్తారు.BMI ని మీ బరువు కిలోగ్రాములలో మరియు మీ ఎత్తు స్క్వేర్డ్ మీటర్లలో తీసుకోని భాగించటం ద్వారా పొందవచ్చు. ఒక వ్యక్తి యొక్క BMI 25-29 మధ్యలో ఉంటే అధిక బరువుగా పరిగణించబడుతుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క BMI 30 మరియు 40 మధ్య ఉంటే స్థూలకాయంగా భావిస్తారు.

స్థూలకాయం అనేది జీవితంలో మధుమేహం,గుండె వ్యాధులు,కొన్ని రకాల క్యాన్సర్లు,స్ట్రోక్ వంటి వివిధ రకాల వ్యాధులకు దారితీస్తుంది. ఊబకాయం అన్ని వయసుల వారికి సంభవించవచ్చు. ఎక్కువ కేలరీలు తీసుకోవడం మరియు చలనం లేని జీవనశైలి అనేవి స్థూలకాయంనకు ప్రధాన కారణంగా ఉండొచ్చు. స్థూలకాయం నియంత్రించడానికి వివిధ ఇంటి పరిష్కారాలు మరియు జీవనశైలిలో మార్పులను ఉపయోగించి స్థూలకాయంను వదిలించుకోవటానికి అవకాశం ఉంది. వంశపారంపర్యం కూడా స్థూలకాయం అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. స్థూలకాయం వదిలించుకోవటం కొరకు అనేక వెయిట్ లాస్ చికిత్సలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అవి ప్రభావవంతమైనవి కాదు. అలాగే సురక్షితమైన పద్ధతి కూడా కాదు. స్థూలకాయం వదిలించుకోవటం కొరకు ఇంటి పరిష్కారాలను ప్రయత్నించండి.
మహిళల్లో స్థూలకాయంవల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు:క్లిక్ చేయండి
సహజంగా స్థూలకాయంనకు చికిత్స చేయడానికి హోం రెమిడీస్
మానవులలో స్థూలకాయంనకు నియంత్రణ లేదు. కానీ ఈ క్రింద కేవలం ఇంటి నివారణలు కొన్ని ఉన్నాయి. అవి ఒక ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సు నిర్వహించడానికి సహాయం చేస్తాయి.

గ్రీన్ టీ
గ్రీన్ టీ బరువు తగ్గించటంలో చాలా ప్రభావవంతముగా పనిచేస్తుందని కనుగొన్నారు. అలాగే బరువు నష్టం చికిత్సలో ఏటువంటి ఆహార నియంత్రణ లేకుండా బరువు క్షీణత మాత్రలు సహాయం చేస్తాయి. మరిగే నీటిలో ఉత్తమ నాణ్యత గల గ్రీన్ టీ ఆకులను వేసి కొన్ని నిమిషాల పాటు అలా ఉంచి వడకట్టండి. ఈ గ్రీన్ టీని రోజులో 2 నుంచి 3 సార్లు త్రాగితే కనిపించే ఫలితాలను మీరే చూడండి.

ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నిమ్మ రసం
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక స్పూన్ నిమ్మ రసంను కలపండి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నీటిని రెండు మూడు నెలల పాటు త్రాగండి. నీరు మిమ్మల్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది. అంతేకాక కనిపించే ఫలితాలను మీరు చూస్తారు. ఆపిల్ సైడర్ వెనిగర్ మీ జీవక్రియను పెంచటానికి మరియు నిమ్మ నీటి రుచి అభివృద్ధికి సహాయం చేస్తుంది.

తేనె త్రాగటం ప్రారంభించండి
ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. ఈ నీటి మిశ్రమానికి ఒక స్పూన్ నిమ్మరసంను జోడించండి. మీరు మంచి పలితం పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఈ నీటిని మొదటి పానీయంగా త్రాగాలి. సమర్థవంతమైన బరువు క్షీణతను చూడటానికి కనీసం రెండు,మూడు నెలల పాటు ప్రతి రోజు త్రాగాలి.

వేడి నీరు త్రాగాలి
మీకు చల్లని నీరు త్రాగే అలవాటు ఉంటే,ఆ స్థానంలో వేడి నీటిని త్రాగటానికి ప్రయత్నించండి. వేడి నీరు మీ శరీరంలో కొవ్వు నిల్వలను తొలగించడంలో సహాయం చేస్తుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు త్రాగాలి. అలాగే మీ ఆహారం మరియు నీటి మధ్య అరగంట గ్యాప్ ఉండాలని నిర్ధారించుకోండి. తిన్న వెంటనే నీరు ఎప్పుడూ త్రాగకూడదు.

పుదీనా ఆకులు
పుదీనా జీర్ణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల పుదీనా ఆకు రసం జోడించి బాగా కలపాలి. ఈ పానీయంను మీరు భోజనం చేసిన అరగంట తర్వాత తీసుకోవాలి. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయం చేస్తుంది. మీ జీవక్రియ పెంచడానికి మరియు దీర్ఘకాలం ఉపయోగించడం వలన బరువు క్షీణతకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

సోంపు గింజలు
సోపు ఆకలిని తగ్గించటానికి బాగా ప్రసిద్ధి చెందిన పురాతన ఇంటి నివారణలలో ఒకటిగా ఉంది. ఒక కప్పు నీటిలో 6 నుంచి 8 సోంపు గింజలు వేసి కొన్ని నిమిషాలు అలా ఉంచాలి. నీటి నుండి ఆ గింజలను తొలగించి,ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగితే మీకు తినాలనే కోరిక తగ్గుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్
ప్రతి రోజు మీరు పడుకోవటానికి ముందు ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోండి. మీరు నిద్ర పోయినప్పుడు మీ శరీరంలో కొవ్వులు బర్న్ కావటానికి సమర్థవంతంగా సహాయం చేస్తుంది.

ఇంటిలో తయారుచేసిన ఆహారం
హోటల్స్,రెస్టారెంట్లు లేదా రోడ్డు పక్కన తినుబండారాలను క్రమం తప్పకుండా తింటే మీ బరువు పెరుగుతుంది. తక్కువ కొవ్వు మరియు తక్కువ నూనె గల ఇంటిలో తయారుచేసిన ఆహారాలను తీసుకోవాలి. మీ ఆహారంలో ఆకుకూరలు,పండ్లు మరియు కూరగాయలను జోడిస్తే స్థూలకాయం పోరాటంలో సహాయం చేస్తుంది.

తేనె తో మిరియాలు
తేనె చాలా రోగాలకు ఉత్తమ ఇంటి నివారణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాక బరువు కోల్పోవడం కొరకు కూడా సహాయపడుతుంది. ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్స్ నిమ్మ రసం,ఒక స్పూన్ తేనె మరియు చిటికెడు మిరియాల పొడిని కలపండి. ప్రతి రోజు ఉదయం ఈ నీటిని త్రాగాలి. మీరు బరువు ఎప్పటికీ పెరగరు.

మీ టీలో మసాలా దినుసులను జోడించడం
మసాలా దినుసులు బరువు తగ్గించడంలో సమర్థవంతంగా మరియు సహజంగా సహాయపడే మంచి పదార్థాలుగా చెప్పబడినాయి. బాగా వేగంగా బరువు తగ్గే ఫలితాల కోసం,మీ రోజువారీ ఆకుపచ్చ టీలో రెండు మూడు అల్లం ముక్కలు, నల్ల మిరియాలు,యాలకులు,లవంగాలను జోడించవచ్చు. రోజులో రెండు,మూడు సార్లు నెల రోజుల పాటు త్రాగి ప్రభావవంతమైన ఫలితాలను చూడండి.

కరివేపాకు
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 10 -12 ఆకుల కరివేపాకును తినడానికి ప్రయత్నించండి. మీరు పూర్తిగా ఆకులను నమిలి మరియు దాని రసం త్రాగవలసిన అవసరం ఉంది. దీనిని మీరు మూడు,నాలుగు నెలల పాటు కొనసాగించండి. మీరు మీ శరీరంలో గణనీయమైన బరువు నష్టంను చూడవచ్చు.

కూరగాయలు మరియు పండ్లు
మీ రోజువారీ ఆహారంలో ఆకు కూరలు,టమోటాలు మరియు క్యారెట్లను తీసుకోవాలి. ఉదయం రోజువారీ అల్పాహారంలో ఒక టమోటా సలాడ్ సమర్థవంతంగా బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది. మీరు తినటానికి మరియు మీ కడుపు త్వరగా నింపటానికి సహాయపడే కూరగాయలు మరియు పండ్ల వంటి తక్కువ కాలరీలు గల ఆహారం తీసుకోవాలి.

రేగు వాటర్
ఒక కప్పు నీటిలో రేగు ఆకులను వేసి నానబెట్టాలి. రాత్రిపూట వదిలి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని త్రాగాలి. మీరు ఖాళీ కడుపుతో ఈ నీటిని త్రాగాలి. ప్రతి రోజు ఒక నెల పాటు త్రాగితే ఉత్తమ ఫలితాలను చూడవచ్చు

చిరు ధాన్యాలు
చిరు ధాన్యాలను మీ రోజువారీ ఆహారం ప్రణాళికలో చేర్చవలసిన అవసరం ఉంది. ఇది స్థూలకాయం చికిత్సకు ఆదర్శ ఆహారం మరియు నెమ్మది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు మీ శరీరంలో కలవటానికి చాలా కాలం పడుతుంది. అందువల్ల స్థూలకాయంను నిరోధిస్తుంది.

శారీరక వ్యాయామం
చురుకైన వాకింగ్ స్థూలకాయం తగ్గించేందుకు మరియు ఒక ఆరోగ్యకరమైన శరీరం నిర్వహించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటిగా ఉంది. ఆరోగ్యకరమైన డైటింగ్ అలవాటుతో పాటు వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు 30-45 నిమిషాల పాటు జిమ్ చేయుట వలన మీ అధిక బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది. మీకు స్థూలకాయం అంటే విసుగు వచ్చిందా? మిమ్మల్ని ట్రిమ్ మరియు సెక్సీగా చూడాలని అనుకుంటున్నారా? మీ శరీరంను పరిపూర్ణ ఆకారంలో పొందటానికి పైన చెప్పిన ఇంటి నివారణలను ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications











