Latest Updates
-
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.!
ఫ్రెండ్లీగా బరువు తగ్గించే టాప్ 10 వెయిట్ లాస్ ఫుడ్స్
ఇండియన్ వంటకాలు వెరీ రిచ్ అని చాలా మంది నమ్ముతారు. అందుకు కారణం వీటిలో బరువు తగ్గించే గుణాలు ఎక్కువని. చాలా వరకు ఇండియన్ వంటకాలను ఎక్కువ మసాలా దినుసులతోనూ మరియు బట్టర్(ప్యురిఫైడ్ నెయ్యి)తో తయారు చేస్తారు. నన్ను ఒక నిజాన్ని చెప్పనియ్యండి, చాలా వరకూ ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని ఆరోగ్యకరమైన ఇండియన్ ఫుడ్స్ బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అంతే కాదు అవి తినడం వల్ల బరువు తగ్గించడంతో పాటు మన శరీరానికి కావల్సి న్యూట్రిషయిన్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా అంధిస్తాయి. కాబట్టి ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే వాటిని సెలక్ట్ చేసుకొని మరీ ఉపయోగించడం వల్ల బరువు తగ్గించే ప్రయోజనాలు కూడా మెండుగా కనబడుతాయి.
బరువు తగ్గించుకోవాలంటే మొదట గుర్తొచ్చేది డైట్ . డైలీ డైట్ లో ఫ్యాటీఫుడ్స్ ఉండటం, ఈ ఫుడ్స్ లో క్యాలరీలు అధికంగా ఉండటం మరియు కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఎక్స్ ట్రా పౌండ్ బరువు తగ్గడానికి ఎలాంటి చాన్సెస్ ఉండవు . వ్యాయామం ఎంత చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు . హెల్తీగా మరియు ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే మొదట డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి.
శరీరంలో త్వరగా కొవ్వు కరిగించి, బరువు తగ్గించే 22 చౌకైనఇండియన్ ఫుడ్స్
పోషకాహార నిపుణుల సలహా మేరకు మంచి బ్యాలెన్సింగ్ డైట్ ను అనుసరిస్తున్నట్లైతే శరీరం మంచి ఎనర్జీని పొంది శరీరంలో ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతాయి . హై ప్రోటీన్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక ఫ్యాట్ ను కరిగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. హై ప్రోటీన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్ గా ఫీలవుతారు ఎలాంటి అలసట మరియు ఉండదు.
అదే విధంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా శరీరానికి అదే ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. కాబట్టి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను కూడా డైలీ డైట్ లో చేర్చుకోవాలి . ఇలాంటి హైప్రోటీన్, అండ్ ఫైబర్ బ్రిలియంట్ ఫుడ్ వల్ల ఫ్రెండ్లీగా బరువు తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!
ఈ హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల శరీరం తనంతట తాను ఫ్యాట్ బర్న్ చేసుకోగలుగుతుంది . అంతే కాదు క్రమంగా శరీరకంగా ఫిట్ గా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి . మరి మన వంటగదిలోని వెయిట్ లాస్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం...

1. ఫైబర్ ఫుడ్స్:
రెగ్యులర్ డైట్ లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను జోడించాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, మరియు గోధుమలు మరియు మరికొన్ని ఇండియన్ ఫుడ్స్ ను చేర్చాలి . ఈ ఫుడ్స్ ఫ్రెండ్లీగా బరువు తగ్గించడం మాత్రమే కాదు, పొట్ట నింపుతుంది మరియు వ్యాధినిరోధకత పెంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది.

2. బాదం:
గుప్పెడు బాదం పప్పులు తినడం వల్ల శరీరానికి అవసరం అయ్యే విటమిన్ ఇని అందిస్తుంది. బరువు తగ్గించుకోవాలని చూసేవారు ప్రోటీన్ ఫుడ్స్ అధికంగా అవసరం అవుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన 5 బాదం పప్పులను తినడం మంచిది.

3. గ్రీన్ టీ:
గ్రీన్ టీ ఒక హేర్బల్ బెవరేజ్. విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ కు ఒక పవర్ హౌస్ వంటిది. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాపడుతుంది. కాబట్టి రెండు నుండి 3 కప్పులు గ్రీన్ టీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, మీ ఎనర్జీలో మార్పులను మరియు బరువు తగ్గించుకోవడంలో మార్పులను గమనించండి.

4. మసాలా దినుసులు:
పురాతన పరిశోధన ప్రకారం ఇండియన్ మసాలా దినుసులు బరువు తగ్గించడంలో ఉత్తమ పదార్థాలుగా ఉన్నాయి . మసాలాలో కారం, పసుపు డైలీ మీల్స్ లో జోడించినప్పుడు ఆకలిని తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలో మార్పులను చూపెడుతాయి.

5. గుడ్లు:
ఎగ్ వైట్ లో ప్రోటీనులు అధికంగా ఉన్నాయి . ఎగ్ వైట్ క్యాల్షియం ను అందిస్తుంది. ఇది బోన్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది. మరియు బోన్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది . గుడ్లలో ఉండే గ్లూకగాన్ హార్మోన్ ఫాట్ బర్నింగ్ కు సమాయపడుతుంది . కాబట్టి ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎనర్జీని అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తుంది.

6. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్:
ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ , వాటర్ అధిక శాతంలో ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి . ఒక వారం పాటు పండ్లు కూరగాయలతో డైట్ మార్చుకోవడం వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్ ను మీరు గమనించవచ్చు

7. యోగ్రట్:
గ్రీక్ యోగ్రట్ బరువు తగ్గించుకోవడంలో ఒక బెస్ట్ ఫుడ్ . వెయిట్ లాస్ ఫ్రెండ్లీ ఫుడ్. ఇందులో ప్రోటీనులు మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది . ఇంకా పొటాషియం, జింక్ మరియు విటమిన్ బి6 మరియు బి12 అధికంగా ఉండటం వల్ల టమ్మీ శాటిస్ ఫై మరియు ఆకలికోరికలను తగ్గిస్తుంది.

8. వెల్లుల్లి:
వెల్లుల్లిల్లో క్రొవ్వు కరిగించే గుణాలు అలిసిన్ పుష్కలంగా ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. కాబట్టి పురుషులు ఈ ఇండియన్ స్పైసీ వెల్లుల్లిని రెగ్యులర్ గా తింటే శరీర బరువును తగ్గించుకొని, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

9. మొలకలు మొలకలను ఏదోఒకవిధంగా తీసుకోవాలి .
ఒక సర్వింగ్ మొలకల్లో 4గ్రాముల ప్రోటీలను మన శరీరానికి అందుతాయి. ఇది క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది..

10. బ్రౌన్ రైస్ బరువు తగ్గించే క్రమంలో పూర్తిగా అన్నం మానేయనవసరం లేదు.
సాధారణ రైస్ కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ ను ఒక కప్పును ప్రతి రోజూ తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ లో ఎక్కువ న్యూట్రీషియన్ విలువలున్నాయి.



Click it and Unblock the Notifications