Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
శరీరంపై దుష్ప్రభావం చూపే ఆహార పదార్థాలు
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే.. తీసుకునే ప్రతి ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్త వహిస్తాం. ఆరోగ్యానికి మంచిదనే భావించే ఫుడ్ ని మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని ఆహార పదార్థాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని కొన్నిసార్లు గ్రహిస్తాం.. మరికొన్నిసార్లు గ్రహించలేకపోతాం.Read
more:ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరం ఈ పోషక ఆహారాలు..
ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వు పదార్థాలు.. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్నిస్తే.. మరికొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కారణమౌతాయి. కానీ అవగాహన లేని వాటిని తినేస్తూ ఉంటాం. అనారోగ్యానికి కారణమయ్యే ఆహారాలేంటో ఓ సారి చూద్దాం.

బంగాళదుంపలు: బంగాళదుంపలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారం. వీటితో రకరకాల ఫ్లేవర్స్ లో వండుకోవచ్చు. తయారు చేయడం కూడా ఈజీనే కావడంతో ఎక్కువగా వీటిని తీసుకుంటూ ఉంటాం. అయితే బంగాళదుంపలను తరచుగా తినడం వల్ల బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి వీటిని అవైడ్ చేయడం మంచిది.

పాలు: పాలు అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థమే అయినా.. ప్రతి రోజూ తీసుకునే పాలు పెరుగుదలకు అడ్డుపడుతుంది. నిద్రించే ముందు, బ్రేక్ ఫాస్ట్ రూపంలో, ఈవెనింగ్ స్నాక్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఎంపిక చేసుకునే ముందు ఒకసారి ఫ్యాట్ కంటెంట్ ని సరిచూసుకోవాలి. తక్కువ మోతాదులో వీటిని తీసుకుంటే మంచిది.

డిజర్ట్: భోజనం చేశామంటే డిజర్ట్ కంపల్సరీ అయిపోయింది. భోజనం తర్వాత కొంతమందికి స్వీట్ తినడం అలవాటుగా మారింటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు స్వీట్స్ తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే డిజర్ట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

స్నాక్స్: ఈవెనింగ్ స్నాక్స్ తినడం అందరికీ అలవాటే. కానీ అవి ఎంతవరకు ఆరోగ్యానికి మంచిదనేది ఒకసారి గమనించుకోవాలి. ఆకలిగా ఉందని ఏది పడితే అది తింటే.. ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి సాండ్విచ్, సమోసాలకు బదులు.. నట్స్, ఫ్రూట్స్ వంటివి స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
