శరీరంలో ఫ్యాట్ కరిగించి.. స్మార్ట్ గా మార్చే ఆహారాలు

By Swathi

శరీరంలో ఫ్యాట్ పెరిగిందా ? ఫ్యాట్ కరిగించుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారా ? ఫలితం కనిపించడం లేదని డీలాపడిపోతున్నారా ? డోంట్ వర్రీ. కాస్త ఫుడ్ లో చేంజెస్ తీసుకొచ్చే.. మీరు స్మార్ట్ గా మారిపోవచ్చు. ఆహారంలో మార్పులు అంటే.. కంగారు పడకండి. చాలా సింపుల్ డైట్. కానీ మీ శరీరంలో ఫ్యాట్ ని ఈజీగా కరిగించే సింపుల్ డైట్ మీ చేతుల్లోనే ఉంది.

పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

శరీరంలో పేరుకున్న ఫ్యాట్ కరిగించడానికి కేవలం వ్యాయామం సరిపోదు. స్మార్ట్ గా, బెట్టర్ బాడీ షేప్ పొందాలంటే.. ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఎక్కువ పోషకాలు, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు తేలికగా కరిగిపోతుంది. ఈ ఫుడ్స్ ఫ్యాట్ కరిగించడమే కాదు.. మీకు ఎనర్జీని కూడా అందిస్తాయి. అలాంటి 10 బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తేనె

తేనె

పువ్వుల్లోని మకరందంతో తేనెటీగలు తయారు చేసే తేనె తియ్యగా.. చాలా రుచికరంగా ఉంటుంది. ఒబేసిటీకి ఇది చక్కటి హోం రెమిడీ. అధిక ఫ్యాట్ ని కరిగించి.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను, ఒక గ్లాసు వేడినీటిలో కలిపి.. రోజూ ఉదయం తీసుకుంటే సరిపోతుంది.

పసుపు

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ అనే గుణం.. ఎంజైమ్ ని బ్లాక్ చేసి, డైటరీ కార్బొహైడ్రేట్స్ మారుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఫ్యాట్ కరిగించడంలో పసుపు చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

యాలకులు

యాలకులు

జీర్ణశక్తి పెంచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి యాలకులు. పొట్టలో వచ్చే సమస్యలను ఇవి తగ్గిస్తాయి. అలాగే మెటబాలిజంను పెంచి.. ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ యాలకులు తీసుకుంటే ఉంటే సరిపోతుంది.

చిల్లీ పెప్పర్

చిల్లీ పెప్పర్

మిర్చీ ఉండే ఆహారాలు.. శరీరంలో ఫ్యాట్ ని బర్న్ చేస్తాయి. మిర్చిలలో ఉండే.. క్యాప్సెసిన్ మెటబాలిజంను పెంచుతాయి. అంతేకాదు.. ఇవి తీసుకున్న 20నిమిషాల్లో శరీరంలోని క్యాలరీలను కరిగించేస్తాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి ఫ్యాట్ కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ ఫుడ్. వెల్లుల్లిలో సల్ఫర్, అల్లుసిన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. శరీరంలో ఉండే అన్ హెల్తీ ఫ్యాట్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.

ఓట్ మీల్

ఓట్ మీల్

ఓట్ మీల్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అది.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని యాసిడ్స్, ఫ్యాట్స్ ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. పంచదార కలపకుండా.. తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ స్వీట్ నెస్ కావాలి అనుకుంటే.. తేనె లేదా ఫ్రూట్స్ కలుపుకోవడం మంచిది.

సజ్జలు

సజ్జలు

మిల్లెట్స్ లేదా సజ్జల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ తో పాటు.. ఎక్కువ సమయం ఆకలి ఉండదు. అలాగే శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ వీటి ద్వారా ఎక్కువగా పొందవచ్చు. సజ్జలతోపాటు, జొన్నలు, రాగులు తీసుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ కరిగించవచ్చు.

పెసలు

పెసలు

పెసలలో విటమిన్ ఏ, బి, సి, ఈ ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, పొటాషియం కూడా పుష్కలంగా పొందవచ్చు. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి ఇవి కరెక్ట్ గా సరిపోతాయి. చాలా తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది.

ఎగ్స్

ఎగ్స్

సాధారణంగా గుడ్లలో హై కొలెస్ట్రాల్ ఉంటుందని భావిస్తారు. కానీ.. కోడిగుడ్లలో హై ప్రొటీన్ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది. వీటి ద్వారా విటమిన్ బి12 పొందవచ్చు. ఇది ఫ్యాట్ ని కరిగించడనికి సహాయపడుతుంది.

క్యాబేజ్

క్యాబేజ్

క్యాబేజ్ అంటే.. చాలా మంది ఇష్టపడరు. కానీ.. గ్రీన్ లీఫ్ వెజ్జీ అయిన క్యాబేజ్ ద్వారా.. శరీరంలోని షుగర్ ని కార్బోహైడ్రేట్స్ గా మారుస్తుంది. బరువు తగ్గడానికి ఇది చాలా పర్ఫెక్ట్ ఆప్షన్.

Story first published: Tuesday, February 9, 2016, 12:15 [IST]
Desktop Bottom Promotion