మంచి హైట్ పెరగాలంటే రోజూ తప్పకుండా ఈ ఫుడ్స్ తినండి...!!

సరైన వ్యాయామం మరియు ప్రత్యేకమైన డైట్, ఈ రెండింటి కాంబినేషన్ ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి. కొన్ని రకాల మినిరల్స్ మరియు ప్రోటీనులు నేచురల్ గా పొడవు పెరగడానికి సహాయపడుతాయి. పోషకాలు, న్యూట్రీషియన్స్

వ్యక్తి పొడవును బట్టి కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు అంటుంటారు. అయితే, పుట్టుకతోనే దేవుడు ఇచ్చిన ఎత్తును మార్చుకోవడం అన్నది అంత సులభం కాదు. సాధారణంగా పుట్టినప్పటి నుంచి మగవారిలో 18 ఏళ్ల వరకు, ఆడవారిలో 16 సంవత్సరాల వరకు ఎముకల్లో పొడవు పెరుగుదల ఉంటుంది. పెరిగే వయసులో ఎముకల్లోని ముఖ్యభాగాలు మూడు అవి... ఎపిఫైసిస్‌, డయాఫైసిస్‌, మెటాఫైసిస్‌. ఈ చిత్రంలో చూపినట్టు ప్రతి ఎముకలోను కింద భాగానా, పైభాగాన కల రెండు మెటాఫైసిస్‌ యూనిట్లలో పెరుగుదలకు సంబంధించిన కణజాలం ఉంటుంది. దీన్ని గ్రోత్‌ప్లేట్‌ అంటారు. ఈ కణజాలం ప్రతి వ్యక్తిలోను తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన (జీన్స్‌) అనువంశిక లక్షణాలకు లోబడి వ్యక్తి పొడవు నిర్ణయమవుతుంది. అంటే మనిషి ఎత్తు మూలకాలు జీన్స్‌ద్వారా నిర్ణయమవుతాయి. కొంతవరకు ఆహార పోషక పదార్థాలు మనిషి ఎత్తు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకానీ రకరకాల వ్యాపార ప్రకటనలతో మోసపోయి ఎక్కువ ఎత్తు పెరగడం అనే అపోహను వదులుకోవాలి.

చాలా వరకూ తల్లిదండ్రుల జీన్స్ వల్ల పిల్లల ఎత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎత్తుగా పెరుగుతారు లేదంటే లేదు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాలతో శరీర పెరుగుదలకు ఉద్దీపన కలిగించినప్పుడు, ఎత్తు పెరగడానికి సహాయపడుతాయి. అంతే కాదు, ఎత్తును పెంచడానికి వ్యాయామాలు కూడా సహాయపడుతాయి. ఎత్తు పెరగడం మొదలైనప్పుడు వ్యాయామాల వల్ల శరీరంలోని కండరాలు వదులు అవుతాయి.

21సంవత్సరాల్లోపు మీ బరువును పెంచుకోవడం తెలుసుకోవాలంటే, ఇది చాలా సులభం. 18ఏళ్ళ వరకూ మీ శరీరం పెరుగుతున్న దశలోనే ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత, పెరుగుదల సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి ఎటువంటి హాని జరగదు. సరైన వ్యాయామం మరియు ప్రత్యేకమైన డైట్, ఈ రెండింటి కాంబినేషన్ ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి. కొన్ని రకాల మినిరల్స్ మరియు ప్రోటీనులు నేచురల్ గా పొడవు పెరగడానికి సహాయపడుతాయి. పోషకాలు, న్యూట్రీషియన్స్ పొడవు పెరగడానికి అద్బుతంగా సహాయపడుతాయి.

ఉదాహరణకు విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం అంది, ఎముకల పెరుగుదలకు సహాయపడి, వ్యాధినిరోధకత తగ్గి పెరుగుదల మెరుగుపడుతుంది. ప్రోటీలు అధికంగా ఉన్న ఆహారాలు ఎఫెక్టివ్ గా పొడవు పెరుగుటలో సహాయపడే టిష్యులను మర్మత్తు చేసి కొత్తి టిష్యలు ఏర్పటాకు సహాయపడుతాయి. కాబట్టి, ఎత్తు పెరగడంలో విటమిన్ డి మరియు ప్రోటీలను, అవసరం అయ్యే మినిరల్స్ ఎత్తు పెరగడానికి సహాయపడే క్యాల్షియంను శరీరంలో పెంచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కాబట్టి, స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉండటానికి మీ రెగ్యులర్ డైట్ లో క్యాల్షియ రిచ్ గా ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. పొడవును పెంచే హెల్తీ ఫుడ్స్ క్రింది విధంగా ఉన్నాయి...

టర్నిప్:

టర్నిప్:

హార్మోన్స్ ను పెంచడంలో టర్నిప్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా పొడవు పెరగానికి సహాయపడుతాయి. టర్నిప్స్ లో విటమిన్స్, మినిరల్స్, ఫైబర్, ప్రోటీన్స్, కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఉడికించి నేరుగా తీసుకోవడం లేదా గ్రేవీ రూపంలో తయారుచేసి తీసుకోవడం మంచిది.

గుడ్లు:

గుడ్లు:

ఈ సూపర్ ఫుడ్స్ లో విటమిన్ డి మరియు క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైనది మరియు ఎముకలకు తగినంత క్యాల్షియం అంధివ్వడంలో గుడ్డు బాగా సహాయపడుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

బరువు పెంచడంలో ఇది మరో సూపర్ ఫుడ్. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో, ఎముకల పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో బ్రొకోలీ, ఆకు కూరలను తప్పకుండా చేర్చుకోండి.

పండ్లు:

పండ్లు:

స్ట్రాంగ్ మరియు ఆరోగ్యకరమైన బోన్స్ కొరకు, మీరు రెగ్యురల్ గా అరటిపండ్లును తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎత్తు పంచడంతో పాటు ఇవి మంచి జీర్ణక్రియకు మరియు బౌల్ మూమెంట్ సాఫీ జరగడానికి సహాయపడుతుంది.

త్రుణధాన్యాలు:

త్రుణధాన్యాలు:

హైట్ పెంచడంలో హోల్ గ్రెయిన్స్ అద్భుతంగా సహాయపడుతాయి. గోధుమలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా సులభమైన పద్దతి, గోధుమల్లో విటమిన్ బి, ఐరన్ లు పుష్కలంగా ఉన్నాయి. హోల్ గ్రెయిన్స్ తో తయారుచేసిన పాస్తా, బ్రెడ్ వంటివి రెగ్యులర్ గా తినడం మొదలు పెడితే మంచి హైట్ పెరుగుతారు.

పెరుగు:

పెరుగు:

పెరుగు ఒక డైరీ ప్రొడక్ట్. ఇందులో అధిక ప్రోటీనుల మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఎ, బి, డి మరియు ఇలు ఉన్నాయి. ఇవి ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి.

చికెన్ :

చికెన్ :

ఇతర అనిమల్ ఫుడ్స్ లో ఇతర వాటితో పోల్చితే చికెన్ లో అత్యధిక ప్రోటీనులు కలిగి ఉంటుంది. చికెన్ తినడం వల్ల తగినన్ని ప్రోటీనులను శరీరానికి అంధిస్తుంది. ప్రోటీనులు కండరాల పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. కండరాల పెరుగుదలకు కావల్సిన రా ప్రోటీన్స్ అనిమల్స్ ప్రోటీనుల్లో అధికంగా ఉంటాయి.

క్యారెట్:

క్యారెట్:

క్యారెట్స్ లో విటిమన్ సి మరియు ఎలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా పెరుగుతాయి.

పాలు:

పాలు:

ఎముకల బలానికి పెరుగుదలకు పాలు చాలా అద్భుతంగా సహాయపడుతాయి. పాలు ఒక అత్యంత శక్తివంతమైన బూస్టర్ గా పనిచేస్తుంది.పాలలో ఉన్నటువంటి అన్ని న్యూట్రీషియన్స్ ఎత్తు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. పాలు తాగడం వల్ల క్యాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీనులు ఇవన్నీ కూడా ఎత్తు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. కాబట్టి, రెగ్యులర్ గా రెండు మూడు గ్లాసుల పాలు త్రాగడానికి అలవాటు చేసుకోండి.

సోయా బీన్స్:

సోయా బీన్స్:

వెజిటేరియన్స్ కు తగినన్ని పోట్రీనులు అందాలంటే సోయాబీన్స్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమమైన పద్దతి. సోయా చంక్స్, టోఫు, సోయా మిల్క్, మొదలగునవి శరీరంలోని కండరాల పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. ఎముకల్లో విటమిన్స్ మరియు క్యాల్షియం షోషణ జరగాలంటే సోయాప్రోడక్ట్స్ ను మరియు సోయాబీన్స్ సోయా మిల్క్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

Story first published: Monday, October 24, 2016, 19:00 [IST]
Desktop Bottom Promotion