Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
గుడ్ న్యూస్: సింపుల్ గా బొజ్జ కరిగించుకునే పర్ఫెక్ట్ టిప్స్..!!
డైటింగ్ వల్ల కిలోల తగ్గవచ్చు. స్లిమ్ కనిపించడానికి సహాయపడుతుంది. కానీ డైటింగ్ ఫాలో అవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే.. ఇష్టమైన ఫుడ్ తినకూడదు, ఆకలిగా ఉన్నా.. కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది.
మనలో చాలామందికి బరువు తగ్గాలని, ఆకర్షణీయమైన బాడీ షేప్ కలిగి ఉండాలనే ఆశ ఉంటుంది. అయితే బరువు తగ్గి.. ఎట్రాక్టివ్ గా కనిపించడానికి కష్టపడి డైట్ పాలో అవ్వాల్సిన అవసరం లేదు. అలాగని.. వ్యాయామం కూడా చేయాల్సిన పని లేదు. మరి ఎలా ? అని ఆలోచిస్తున్నారా ?

డైటింగ్ వల్ల కిలోల తగ్గవచ్చు. స్లిమ్ కనిపించడానికి సహాయపడుతుంది. కానీ డైటింగ్ ఫాలో అవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే.. ఇష్టమైన ఫుడ్ తినకూడదు, ఆకలిగా ఉన్నా.. కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది.
సీరియస్ గా డైట్ ఫాలో అవుతూ కాకుండా.. సింపుల్ గా బరువు తగ్గాలి అని మీరు భావిస్తుంటే.. మీకో గుడ్ న్యూస్ ఉంది. అధిక బరువుని తేలికగా మీరే తగ్గించుకోవచ్చు. కొన్ని చాలా తేలికైన రెమిడీస్ ఉన్నా.. కొన్ని కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ.. వీటిని పర్ఫెక్ట్ గా పాలో అయితే మాత్రం మీ బొజ్జ కరిగి.. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందవచ్చు.

మెంతులు
3 టీస్పూన్ల మెంతులను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రాత్రి నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల ఆకలి అదుపులో ఉండటమే కాకుండా. .మెటబాలిజంను పెంచుతుంది.

తేనె
1టీస్పూన్ తేనె, అర టీస్పూన్ చెక్క పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. ఇలా రోజుకి రెండుసార్లు తాగాలి. ఈ డ్రింక్ హార్మోన్స్ ని యాక్టివేట్ చేసి.. ఆకలిని తగ్గిస్తుంది.

ఉసిరి
ఒక్కొక్క టీస్పూన్ ఉసిరి, అలోవెరా జ్యూస్ లను ఒక గ్లాసు నీటిలో కలపాలి. ఈ డ్రింక్ ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది ఎక్కువగా తినకుండా ఎక్కువసేపు పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.

గ్రీన్ టీ
రోజుకి రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగాలి. అలాగే ఈ గ్రీన్ టీలో అల్లం, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. మరింత ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు. ఇందులో బయోయాక్టివ్ సబ్ స్టాన్సెస్ ఉండటం వల్ల.. మీ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.

టమోటా
ఒక టమోటాను ప్రతి రోజూ ఉదయం పరకడుపున తీసుకోవడం వల్ల.. పొట్టనిండుగా, ఏమీ తినాలి అనిపించకుండా ఉంటుంది. దీనివల్ల ఆకలి కంట్రోల్ లో ఉండి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

క్యాబేజ్
మీ భోజనంలో 250 గ్రాముల క్యాబేజీని చేర్చుకోవాలి. ఇందులో టార్టారిక్ యాసిడ్ ఉండటం వల్ల.. బాడీ షుగర్, గ్లూకోజ్ ని ఫ్యాట్స్ ని మారకుండా అడ్డుకుంటుంది. మీ బాడీ షేప్ ని పర్ఫెక్ట్ గా మారుస్తుంది.

అల్లం
ఒక చిన్న అల్లం ముక్కను భోజనానికి ముందు నమలాలి. లేదా భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం జ్యూస్ లో చిటికెడు ఉప్పు కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ ని కరిగించి.. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.

పసుపు
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పసుపు కలిగి.. ఉదయాన్నే ఖాళీ పొట్టతో తీసుకోవాలి. ఇది.. మెటబాలిజంను మెరుగుపరిచి.. ఫ్యాట్స్ కరిగించి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

సొరకాయ
ఒక గ్లాసు సొరకాయ జ్యూస్ ని లేదా ఏదైనా సూప్ ని రోజూ తీసుకోవడం వల్ల.. ఎక్కువగా తినాలన్న ఆలోచనను తగ్గిస్తుంది. సొరకాయలో ఫైబర్ ఎక్కువగా, తక్కువ ఫ్యాట్స్ ఉండటం వల్ల.. జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గించి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మిరపకాయలు
ఎక్కువ మిరపకాయలను డైట్ లో చేర్చుకోవడం వల్ల.. అదనపు ఫ్యాట్ ని తొలగిస్తుంది. మిరపకాయల్లో ఉండే కాప్సిసిన్ బాడీ ఫ్యాట్ ని వేగంగా కరిగిస్తుంది.



Click it and Unblock the Notifications
