Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
'అధిక బరువు' , ‘ఊబకాయం’తగ్గేందుకు 'ఆయుర్వేదంలో రహస్యాలు..
నేడు ఎక్కడ చూసినా అధిక బరువు, స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్న వారు అధికంగానే కనిపిస్తున్నారు. కారణాలేమున్నా ఒకసారి బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిత్యం వ్యాయామం, వేళకు తగిన పౌష్ఠికాహారం తీసుకోవడం తప్పసరి అయింది. ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, హెల్తీగా బరువు తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేదం చాలా ఫర్ఫెక్ట్ అని చెప్పవచ్చు .
ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గించుకోవడానికి ముందుగా ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆయుర్వ్ అంటే ఆయుష్యు(దీర్ఘకాలం జీవించడం). వేద అంటే సైన్స్ . ఈ రెండు పదాలను చేర్చితే సైన్స్ ఆఫ్ లైఫ్ ని అర్ధం వస్తుంది,. ఆయుర్వేదాన్ని మన ఇండియాలోనే కనుగొనడం జరిగింది. ఇది పురాత కాలంలోని ఔషధ పద్దతి .
బరువు తగ్గించుకోవడం లో పురాతన పద్దతుల్లో చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు . ఆయుర్వేదం ప్రకారం వ్యాధులకు మూలకారణం గుర్గించడం ద్వారా శాస్వతంగా పరిష్కరించుకోవడానికి మార్గాలను సూచిస్తుంది. బరువు తగ్గించుకోవడంలో ఆయుర్వేదంలో బాడీ టైప్ ను బట్టి, వారికి సూటబుల్ గా ఉండే పదార్థాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. రువు సమస్యలతో పోరాడటం కోసం ఆయుర్వేద పధ్ధతులు బాగా సహాయపడి ఆరోగ్యకరమైన జీవనశైలి మొదలుపెట్టువచ్చు. అంటే మీరు ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, మరియు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ఎందుకంటే మన శరీరం కూడా ఒక గడియారంలా పనిచేస్తుంది. ఈ టైమ్ లో ఇదేచేయాలి, అని నిర్ధేశించుకుంటుంది. ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మీ ఆహారపు అలవాట్ల ద్వారా తెలుస్తుంది.
ఆయుర్వేదంలో , కాలానుగుణ లభించే పండ్లు మరియు కూరగాయలు తీసుకోమని ఊబకాయగ్రస్తులకు నిపుణులు సలహా ఇస్తుంటారు . అధిక ప్రోటీనులుండే నేచురల్ ఫుడ్స్ మరియు పండ్లు ద్వారా ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఆయుర్వేదంలో బరువు తగ్గించే పద్దతులను పాటిస్తున్నట్లైతే ప్రిజర్వేటివ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు తప్పనిసరిగా నివారించాలి. అదనపు కొవ్వును త్వరగా మరియు ఎఫెక్టివ్ గా కరిగించుకోవడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద స్పూర్తితో ఇచ్చిన చిట్కాలు ఉన్నాయి. కింద పేర్కొన్న 'ఆయుర్వేద' సూచనలు పాటిస్తే అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

లెమన్ మరియు తేనె:
లెమన్ మరియు తేనె చాలా సాధారణ రెమెడీ. లెమన్ మరియు తేనెను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ పరగడుపున తాగడం వల్ల శరీరంలోని వ్యర్థలను బయటకు పంపుతుంది. ఆకలి తగ్గిస్తుంది. దాంతో క్రమంగా బరువు తగ్గుతారు

పెప్పర్:
లెమన్ మరియు హని మ్యాజిక్ చేస్తే ఈ కాంబినేసన్ వాటర్ కు పెప్పర్ పౌడర్ జోడించడం వల్ల అద్భుతం జరగుతుంది . ఇది కంపల్సరీ కాకపోయినా.. వేగంగా బరువు తగ్గించుకోవాలనుకొనే వారు ప్రతి రోజూ ఉదయం తాగే లెమన్ హనీ వాటర్ లో పెప్పర్ పౌడర్ జోడించాలి.

క్యాబేజ్:
క్యాబేజ్ ను పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు . పచ్చిక్యాబేజ్ ను సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఎక్కువ పోషకాలను పొందవచ్చు. మరియు ఫ్యాట్ బర్న్ చేయడానికి బూస్ట్ లా పనిచేస్తుంది.

జీర్ణ శక్తిని పెంచుకోవాలి:
తిన్న ఆహారం సరిగా జీర్ణ కాలేదంటే లేదన్నా లేదా అజీర్తి వల్ల అధిక బరువుకు, ఫ్యాట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు జీర్ణశక్తిని పెంచుకోవడానికి బాడీలో నేచురల్ గా కొవ్వు కరిగించడానికి రెగ్యులర్ డైట్ లో అల్లం, బొప్పాయి, బిట్టర్ గార్డ్ , వెల్లుల్లి, పచ్చిమిర్చి వంటివి చేర్చుకోవాలి.

మసాలాలు జోడించాలి :
కారం, మసాలాలు తగ్గించడం వల్ల జీర్ణ శక్తి తగ్గుతుంది. కారం, చేదు, మరియు ఆస్ట్రిజెంట్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అందుకోసం కడుపులో మంట కలిగించి కొవ్వు కరిగేలా చేసే కొన్ని మసాలాలు, జీలకర్ర, కేయాన్ పెప్పర్, ఆవాలు, పెప్పర్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఉపవాసం:
ఆయుర్వేదం ప్రకారం: వారంలో ఒక రోజు ఉపవాసం ఉండటం వల్ల శరీరం శుభ్రపడుతుంది . శరీరంలో అవయవాలు చురుకుగా పనిచేసి ఫ్యాట్ ను కరిగిస్తుంది . జీర్ణశక్తి పెరుగుతుంది, అందుకోసం, రెగ్యులర్ డైట్ లో సరిపడా నీరు చేర్చుకోవాలి, గ్రీన్ టీ (అల్లం టీ, తులసి టీ, మింట్ టీ)మరియు వెజిటేబుల్ జ్యూసులతో ఉపవాసం ఉండటం వల్ల వేగంగా బరువు తగ్గించుకోవచ్చు .

హెర్బ్స్:
ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గించుకోవడానికి కామన్ హెర్బ్ అరటికి, బిబిటిక్, ఆమ్లాకి, లికోరిస్, తులసి, అలోవెర, వ్రిక్షమాల మొదలగు హెర్బ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి క్యాప్స్యూల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.

అల్లం:
రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది . అల్లం టీని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.

ఉలవలు:
చాలా మంది ఆయుర్వేద నిపుణుల ప్రకారం రెగ్యులర్ డైట్ లో ఉలవలు చేర్చుకోవడం వల్ల వరీరంలో వేడి పుట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది .

అలోవెర జ్యూస్:
అలోవెర జ్యూస్ కు కొద్దిగా పసుపు, జీలకర్రపొడి, మిక్స్ చేసి గ్లాసు నీటిలో మిక్స్ చేసి గోరువెచ్చగా ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి . తేనె కూడా చేర్చితే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది

నల్లమిరియాలు, తేనె
1 కప్పు నీటిలో 3 టీస్పూన్ల నిమ్మ రసం, చిటికెడు నల్ల మిరియాల పొడిని, 1 టీస్పూన్ తేనెను బాగా కలపాలి. ఒకటి, రెండు నెలల పాటు రోజుకు 2 సార్లు ఈ మిశ్రమాన్ని తాగాలి.

త్రిఫల చూర్ణం
2 టేబుల్ స్పూన్ల త్రిఫల చూర్ణాన్ని అరలీటరు నీటిలో కలపాలి. దీన్ని 5 నిమిషాల వరకు వేడి చేయాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టగా వచ్చే నీటికి తేనెను కలపాలి. దీన్ని రోజుకి 2 సార్లు తీసుకోవాలి.

రైస్ వాటర్
జీరా, పొడి అల్లం పౌడర్, మిరియాల పొడి, పిప్పళ్ల చూర్ణం అన్నింటినీ సమపాళ్లలో తీసుకుని మళ్లీ పొడి చేయాలి. ఈ పొడిలో 1/4 వంతు తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం, ఒక పెద్ద గ్లాసు నీటిని కలిపి ఉడికించాలి. అనంతరం వచ్చే పదార్థంలోంచి కేవలం ద్రవాన్ని మాత్రమే వంచి తీసుకోవాలి. దీనికి కొద్దిగా ఉప్పు జోడించి సూప్‌లాగా తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











