Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
రోజు వారి వ్యాయామం ఎందుకు చేయాలి? పొందే ప్రయోజనాలేంటి..?
దైనైందిన కార్యక్రమాలతో అలసిపోయాకా మీకు ఎక్సర్సైజ్ చెయ్యడానికి సమయం చిక్కట్లేదా?? ఎంత ప్రయత్నించినా రోజూ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చెయ్యలేకపోతున్నారా??రోజూ వ్యాయామం చెయ్యాలంటే ఒక్కటే మార్గం.ఒక జత రన్నిం
దైనైందిన కార్యక్రమాలతో అలసిపోయాకా మీకు ఎక్సర్సైజ్ చెయ్యడానికి సమయం చిక్కట్లేదా?? ఎంత ప్రయత్నించినా రోజూ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చెయ్యలేకపోతున్నారా??రోజూ వ్యాయామం చెయ్యాలంటే ఒక్కటే మార్గం.
ఒక జత రన్నింగ్ షూస్ కొనుక్కుని అలా ఆరు బయటకి వెళ్ళి మొదట నడక మొదలెట్టి మెల్లిగా జాగింగ్ ఆ తరువాత రన్నింగ్ చెయ్యండి.

రోజూ వ్యాయామం చేస్తే మీ శరీరం నూతనోత్తేజాన్ని పొంది చక్కని నిద్ర పడుతుంది.రోజూ వ్యాయామం వల్ల మీ కండరాలు గట్టి పడతాయి, కీళ్ళూ అవీ ఆరోగ్యంగా తయారయ్యి రోజంతా కూడా ఉత్సాహంగా ఉండగలరు.
ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు రన్నింగ్ షూస్ వేసుకుని పరిగెత్తేకొద్దీ మీకు దాని మీద మక్కువ ఏర్పడి వ్యాయామాన్ని ఇష్టంతో చేస్తారు. దీనివల్ల మీ మెటాబాలిజం లేదా జీవక్రియల రేటు పెరుగుతుంది. అంటే మీరేమీ చెయ్యకుండా ఉన్నప్పుడు కూడా మీ శరీరంలో కేలొరీలు ఖర్చు అవుతూ ఉంటాయి.

శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మీరు ఏమీ చెయ్యకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూదా శరీరంలో జీవక్రియలు మందగించవు.అలా ఆహ్లాదంగా కాసేపు బయట నడవటం వల్ల మీ బరువులో గణనీయమైన మార్పు రాదు కానీ మీ బరువుని అదుపులో ఉంచుగోగలుగుతారు.రన్నింగ్ కి తోడు చక్కని ఆహారం కూడా తీసుకుంటే మీరు బరువు తగ్గడం ఖాయం.

రన్నింగ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు, రక్తపోటు అదుపులో ఉంటుంది.మధుమేహం, ఊబకాయం దరి చేరవు.వ్యాయామం వల్ల విడుదలైన హార్మోనులవల్ల నెప్పులూ అవీ తగ్గుతాయి.బ్రెస్ట్ మరియూ పెద్ద ప్రేగు క్యాన్సర్ కూడా నిరోధించబడుతుంది.వ్యాయామం చెయ్యడం వల్ల విడుదలయ్యే హార్మోనుల్లో ఒత్తిడి మరియూ డిప్రెషన్‌ని తగ్గించేవి కూడా ఉంటాయి.
మీరు కనుక ఊబకాయులయితే వెంటనే ఒక జత రన్నింగ్ షూస్ కొనుక్కోండి.వాకింగ్ ద్వారా మీ వ్యామాన్ని మొదలుపెట్టవచ్చు.
లేదా ఊబకాయం వల్ల గుండె సంబంధిత వ్యాధులూ, మధు మేహం, అధిక రక్తపోటు వంటివి కలిగే ప్రమాదం ఉంది.
ఇప్పుడు తెలిసిందా మీకు ఒక జత రన్నింగ్ షూస్ ఎందుకు కావాలో??
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
