Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
నడుము తగ్గించి నాజూగ్గా మార్చే నయా డ్రింక్
బెల్లీ ఫ్యాట్ తగ్గాలి. కానీ.. తేలికగా ఉండాలి. వ్యాయామం చేసే టైం లేదు. డైట్ ఫాలో అయ్యే ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి ఫిట్ నెస్ సీక్రెట్ ఎక్కడైనా ఉంటే బావుండు అని ఫీలవుతున్నారా ? అయితే మీ కోరిక నెరవేరినట్టే. ఎలాంటి రిస్క్ లేకుండా, కష్టం లేకుండా.. ఈజీగా బెల్లీ ఫ్యాట్ ఫ్లాట్ గా మారే అద్భుతమైన డ్రింక్ మీ చేతులతోనే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
మీ బెల్లీ ఫ్యాట్ ఏ టైప్ ? దాన్ని ఎలా టార్గెట్ చేయాలి ?
మీ నడుము చుట్టుకొలత తగ్గించి మీకు ఎట్రాక్టివ్ లుక్ తీసుకొస్తుంది ఈ అమేజింగ్ డ్రింక్. ఇందులో ఉపయోగించే అన్ని పదార్థాలు బరువు తగ్గడానికి, కొవ్వు కరగానికి ఉపయోగించేవే. అది కూడా మీకు అందుబాటులో ఉండే పదార్థాలే అంటే.. ఇంతకంటే ఏం కావాలి. ఈ డ్రింక్ కేవలం ఎక్కువ మోతాదులో అనవసర కొవ్వునే టార్గెట్ చేస్తుంది.

చేయాల్సిందల్లా ఒక్కటే.. ఈ డ్రింక్ ని ముందు రోజు రాత్రి తయారు చేసుకోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. అయితే మీకు నీళ్లు తాగాలి అనిపించినప్పుడు ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది. భోజనానికి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో తీసుకోవడం మంచిది. లేదా ఆకలిగా, దప్పికగా అనిపించనప్పుడు ఈ డ్రింకే తాగాలి. అలాగే ఉదయాన్నే ఈ డ్రింక్ తాగడం మరవకూడదు. ఇంకా త్వరగా మీ బెల్లీ ఫ్యాట్ కరగాలి అని భావిస్తే.. ఉదయం నిద్రలేవగానే తాగాలి. అలాగే రెండు లేదా 3 గంటలకొకసారి తాగుతూ ఉండాలి. ఇక ఈ డ్రింక్ ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దామా
నిద్రకు ముందు ఇది తాగితే..! బెల్లీ ఫ్యాట్ దూరం

3 నిమ్మకాయలు
2 నిమ్మకాయలు రసం తీయడానికి
20 పుదీనా ఆకులు
2 లీటర్ల నీళ్లు
ముందుగా 2 నిమ్మకాయలను రసం తీయాలి. పుదీనా ఆకులను కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి గంటపాటు అలానే ఉంచాలి. మిగిలిన నిమ్మకాయలను రసం తీయకుండా.. కట్ చేసుకోవాలి వాటిని నీళ్లలో కలపాలి. అందులోకే పుదీనా, నిమ్మరసం మిక్స్ ని కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి. గాజు బాటిల్ లో నిల్వ ఉంచితే మంచిది. ప్లాస్టిక్ ది మాత్రం ఉపయోగించరాదు. ఒకవేళ మామూలుగా తాగాలి అనిపించకపోతే.. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగవచ్చు. అయితే రోజు మొత్తంలో పూర్తిచేయాలి. ఈ సింపుల్ డ్రింక్ ట్రై చేసి.. మీ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications