Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
బరువు తగ్గటానికి 11 భారతీయ ఆరోగ్యకరమైన స్నాక్స్
కొంచెం కొంచెం తినడం, బరువు తగ్గే క్రమంలో చాల ముఖ్యం మరియు అవసరమైనది. రోజుకి ఒక 5-6 సార్లు తినే అలవాటు చేసుకుంటే, అది బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది.ఎంత తింటున్నారో చూసుకోవడం,అది పోషకమైన ఆహారమా కాదా అని చూసుకోవడం కూడా బరువు తగ్గే క్రమంలో భాగమే.
బరువు తగ్గే సమయంలో స్నాక్స్ తినడం తప్పు కాదు.కానీ, ఎలాంటి స్నాక్స్ తింటున్నామో చూసుకోవాలి. రోజు తీసుకునే కేలరీలు చూసుకోవాలి కాబట్టి, అవి కూడా తక్కువ కేలరీలు మరియు కొవ్వు కరిగించే పదార్థాలు తినాలి.
సరైన స్నాక్స్ తీసుకుంటే అది మీ ఆకలి తీరడమే కాకుండా పోషకాలు కూడా అందిస్తుంది.
మీకు ఈ ఆరోగ్యకరమైన అల్పాహారాలు మీ వంటగదిలోనే కనిపిస్తాయి మరియు అవి మీరు నేరుగా అయిన తినచ్చు లేక రోజు తినే ఇతర పదార్థాలతో అయినా కలిపి తినచ్చు.
కనుక, ఇక్కడ కొన్ని, బరువు తగ్గించేవే కాకుండా మీ ఆకలిని తీర్చి ఎక్కువ సేపు కడుపు నిండి ఉండేలా చేసే ఆరోగ్యకరమైన అల్పాహారాల గురించి మట్లాడుకుందాం.

1. వేయించిన బొంబాయి సెనగలు
వేయించిన బొంబాయి సెనగలు భారత దేశంలోనే అతి సాధారణమైన స్నాక్స్ లలో ఒకటి.ఒక గిన్నె వేయించిన బొంబాయి సెనగలలో 1.25 గ్రా ఫైబర్ ఉండటం వల్ల అది మంచి స్నాక్ అవుతుంది.క్యాలరీలు మరియు గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువ ఉండటం వలన దీన్ని మీరు రోజుకి ఒకటి, రెండు సార్లు తినచ్చు.

2. వివిధ నట్లు కలిపి తినడం
బాదం, అక్రోట్లు, పిస్తాలు తదితర నట్లలో కార్బోహైడ్రేట్ల శాతం తక్కువ, ఆరోగ్యకరమైన కొవ్వు మరియు ప్రోటీన్ల శాతం ఎక్కువ ఉంటాయి.బాదం గింజల్లో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఉంటాయి.అలాగే అక్రోట్లలో అన్ సాచ్యురేటడ్ కొవ్వు మరియు పిస్తాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.ఆరోగ్యకరమైన అల్పాహారానికి అవి సంపూర్ణమైనవి.

3. వేయించిన పనీర్ తో అవిసె గింజలు
ఇంకో చక్కని బరువు తగ్గించే స్నాక్ వేయించిన పనీర్ తో అవిసె గింజలు మరియు దాల్చిన చెక్క కలిపి తినడం.పనీర్ లో ఉండే అధిక ప్రోటీన్ శాతం మీ కండరాలు పెరగడానికి సహాయపడుతుంది;అవిసె గింజలలో ఒమెగా -3- ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి మరియు బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క అధ్బుతమైన ఆహారపదార్థం.

4. దోసకాయ టమాటా సలాడ్
ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు తక్కువ కొవ్వు శాతం ఉన్న సలాడ్లు తినడం ఉత్తమం, ఎందుకంటే డైట్ లో ఉన్నవాళ్ళకి అదే రుచికరమైన ఆహారం.దోసకాయ మరియు టమాటా సలాడ్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఎందుకంటే దోసకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి మరియు టమాటాలు ఆకలి ఎక్కువ వెయ్యకుండా నియంత్రిస్తాయి.

5.దానిమ్మ మరియు ఆపిల్ సలాడ్
చాలామంది డైట్ లో ఉన్నపుడు పళ్ళు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు.సాధారణంగా బరువు తగ్గడానికి అందరూ తినే పళ్ళు ఆపిల్, దానిమ్మ,పైనాపిల్, పుచ్చకాయ. దానిమ్మలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు అది రక్త పోటు తగ్గించడంలో సహాయం చేస్తుంది .ఆపిల్స్ లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అది మీ కడుపుని నిండుగా ఉంచుతుంది.

6. మొలకెత్తిన గింజల సలాడ్
మొలకెత్తిన గింజలు ఇంకో బరువు తగ్గించే మంచి ఆరోగ్యపదార్థాలు మరియు మొలకెత్తిన పెసలు వాటిల్లో సాధారణమైనవి. వాటిలో పోషకాలు ఎక్కువ మరియు కొవ్వు ఇంకా కేలరీలు తక్కువ.మొలకెత్తిన పెసలు రక్తపోటుని తగ్గించడమే కాకుండా, ఆహారాన్ని విషపదార్థాలనుంచి వేరుచేయటంలో సహాయపడుతుంది.కొవ్వు కరిగించడానికి దాన్ని కొంచెం నిమ్మరసంతో తినండి.

7. ఘాటుగా ఉండే మొక్కజొన్న చాట్
మొక్కజొన్నలో ఉండే అనామ్లజనకాలు మరియు ఫైబర్, శరీరంలో విషపదార్థాలను తొలగించి, కడుపుని కూడా నిండుగా ఉంచుతాయి. ఎర్ర పచ్చిమిర్చి పొడి లో క్యాప్సైసిన్ మీ బరువు పెరగకుండా అదుపులో పెట్టడమే కాకుండా తొందరగా బరువు తగ్గేలా చూస్తుంది.

8.చిలకడ దుంప చాట్
చిలకడ దుంపల్లో నీటి శాతం మరియు ఫైబర్ శాతం అధికం మరియు కొవ్వు శాతం తక్కువ. అది బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఎందుకంటే దానిలో పోషక సాంద్రత ఎక్కువ మరియు ఫైబర్ ఎక్కువ ఉండటం వలన ఎక్కువ సమయందాకా కడుపు నిండుగా ఉంటుంది.

9. పచ్చి వేరుశెనగలు
వేరుశెనగలు గుండె జబ్బులు తగ్గించడంలో ఉపయోగపడతాయి. వీటిలో అన్సాచ్యురేటెడ్ కొవ్వు మరియు అనామ్లజనకాలు ఎక్కువ. ఈ ఆరోగ్యకరమైన కొవ్వు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.రోజుకి ఒక గుప్పెడు వేరుశనగ పప్పులను తినండి, దాని కంటే ఎక్కువ కాదు.

10.గ్రీక్ యోగర్ట్ మరియు చియా గింజలు
గ్రీక్ యోగర్ట్ మరియు చియా గింజలు బరువు తగ్గడానికి చాలా ముఖ్యమైనవి మరియు ఒక అందమైన ,రుచికరమైన స్నాక్ కూడానూ.ఈ అల్పాహారంలో ఉండే ఎక్కువ విటమిన్లు మరియు ప్రోటీన్లు మీ పొట్టలోని కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి.

11. ఓట్స్ స్నాక్స్
ఓట్స్ లో కరిగే కొవ్వు పదార్థాలు ఉంటాయి, అందుకని అవి మీ కడుపును తొందరగా నింపి, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తాయి. ఇవి మీ జీవక్రియని పెంచి, తద్వారా కొవ్వుని తొందరగా కరిగిస్తుంది. కనుక బరువు తగ్గడానికి ఈ ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తినండి.
ఈ లిస్టు మీకు నచ్చితే మీ దగ్గరవారితో పంచుకోండి.



Click it and Unblock the Notifications