తేనె, నిమ్మరసం వల్ల కలిగే 7 అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఇవిగో

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనం చాలామందిని పొద్దున్నే తేనె,నిమ్మరసాన్ని కలిపి తాగటాన్ని చూస్తుంటాం. నిజానికి, రోజును ఈ హాయినిచ్చే డ్రింక్ తో మొదలుపెట్టడం మంచిదే. ఈ రసం చర్మంలో విషపదార్థాలన్నీ తొలగించి, శరీరాన్ని క్రమబద్ధీకరిస్తుంది.

చాలామంది ఈ తేనె,నిమ్మరసం కేవలం బరువు తగ్గటానికే ఉపయోగపడుతుంది అనుకుంటారు. అంటే మీకు పూర్తి అవగాహన లేదని అర్థం. ఈ తేనె, నిమ్మరసం ఉపయోగాలను మీరు ఊహించలేరు కూడా. ఇదిగో అలాంటి కొన్ని మంచి లాభాలను ఇక్కడ చదివి తెలుసుకోండి.

Here Are 7 Amazing Health Benefits of Honey And Lemon Water

1.జీర్ణక్రియలో సాయపడుతుంది

మీరు అజీర్తితో బాధపడుతుంటే, ఈ తేనె, నిమ్మరసం మీ జీర్ణక్రియను బాగుచేస్తుంది. ఈ టానిక్ ను తాగటం వలన బైల్ రసం, కడుపులో యాసిడ్లు స్రవించటానికి సాయపడి, ఆహార పదార్థాలు చక్కగా విడగొట్టబడతాయి. అలా మీ శరీరం పోషకాలను పీల్చుకుంటుంది. ఇంకా తేనె, నిమ్మరసం తాగటం వలన, మీ ప్రేగుల కదలికలు కూడా మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

2.శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది

మీకు మొటిమలు లేదా మలబద్ధకం తగ్గాలంటే తేనెతో నిమ్మరసాన్ని కలిపి తీసుకోవటం మంచి పరిష్కారం. శ్వాసకోశం,చర్మం, కాలేయం కింద పొరల్లో పేరుకునే విషపదార్థాలను తొలగిస్తుంది. కాలుష్యం, హానికారక రసాయనాలు ఈ విషపదార్థాలకి కారణం. అందుకని, నిమ్మ,తేనె రసం కాలేయానికి విషపదార్థాలను తొలగించి, శరీరాన్ని శుభ్రం చేయటంలో మంచి టానిక్ గా పనిచేస్తుంది.

3.చర్మాన్ని శుభ్రపరుస్తుంది

తేనె, నిమ్మరసం మొటిమలు లేని మొహాన్ని పొందటానికి మంచి ఇంటి చిట్కా. ప్రతిరోజూ పొద్దున్నే ఈ రసాన్ని గోరువెచ్చని నీరుతో కలిపి తాగటం వలన చర్మంలో సహజకాంతి వస్తుంది. నిమ్మకాయలో ఉండే లక్షణాలు చర్మంపై నుండి ఎక్కువగా ఉండే జిడ్డును తీసేస్తుంది. ఇంకా,ఈ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రీ రాడికల్స్, జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను తొలగిస్తుంది.

4.రోగనిరోధక శక్తి పెరగటంలో సాయపడుతుంది

తేనె కలిపిన నిమ్మరసాన్ని తాగటం వలన రోగనిరోధకశక్తి పెరిగి వాతావరణ మార్పుల వలన వచ్చే అంటు వ్యాధులనుండి శరీరాన్ని కాపాడుతుంది.జలుబు, జ్వరాలతో బాగా పోరాడుతుంది, ఎందుకంటే తేనెలో ఉండే ప్రొటీన్లకి యాంటీమైక్రోబియల్, బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. నిమ్మ, తేనె నీరు జబ్బు త్వరగా నయమవటంలో కూడా సాయపడుతుంది.

5.మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది

నిమ్మరసంలో తేనె కలపటం వలన శరీరంలో మెటబాలిజాన్ని పెంచి , ప్రేగుల కదలికను క్రమబద్ధం చేస్తుంది. దానితోపాటు, ప్రతిరోజూ పొద్దున్నే దీన్ని తాగటం వల్ల కొవ్వు కరిగి మీరు ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఫీలవుతారు.

6.గొంతు ఇన్ఫెక్షన్ కి మంచి చిట్కా

గొంతు ఇన్ఫెక్షన్లని సిట్రస్ మరింత పెంచుతుందనే సాధారణ అపోహ చాలానే ఉంది కానీ నిజం దానికి పూర్తిగా వ్యతిరేకం. నిమ్మరసం మ్యూకస్ ను తగ్గేలా చేస్తుంది, దానివల్ల గాలి వెళ్ళే నాళం ఖాళీ అవుతుంది. డిస్ ఇన్ఫెక్టంట్ లక్షణాలుండే తేనె గొంతులో ఏర్పడ్డ ఎక్కువ కఫాన్ని కరిగించి, శ్వాసనాళాన్ని ఖాళీ చేస్తుంది.

7.మీ ఓపికను పెంచుతుంది

తేనె సహజంగా శక్తిని పెంచే పదార్థం, పంచదారకన్నా తినటానికి చాలారెట్లు ఆరోగ్యకరమైనది. ఇందులో ఉండే బ్యాక్టీరియాను చంపే లక్షణాలు శరీరంలో శక్తిని పెంచి, మిమ్మల్ని యాక్టివ్ గా మారుస్తుంది.

తేనె నిమ్మరసం డ్రింక్ ను ఎలా తయారుచేయాలి?

ఈ డ్రింక్ ను తయారుచేయటానికి ఒక కప్పు గోరువెచ్చని నీరు, తాజాగా పిండిన అరచెక్క నిమ్మరసం ,ఒక చెంచా తేనె అవసరం. నిమ్మరసం, తేనెను నీటిలో వేసి, కలిపి ప్రతిరోజూ పొద్దున్నే తాగండి.

మీరు ఈ తేనె, నిమ్మరసాన్ని చల్లనీరుతో కూడా కలిపి చేయవచ్చు, ఇది తక్కువ క్యాలరీలున్న హాయినిచ్చే, ఎండాకాలపు డ్రింక్ గా బావుంటుంది.

English summary

Here Are 7 Amazing Health Benefits of Honey And Lemon Water

Many individuals believe that this condition of lemon water with honey is only beneficial for weight loss. But alas! You all have limited information. The health effects of this water go beyond your imagination. Here are some of the best benefits of honey and lemon water.